artie offices
-
‘కొత్త’ లెసైన్స్ కార్డులొచ్చాయ్..!
ఖిలావరంగల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదు జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో వాహన రిజిస్టేషన్, డ్రైవింగ్ లెసైన్స్ సాఫ్ట్వేర్ సమస్యలను అధిగమించి ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చారుు. పెండింగ్ కార్డులతో వాహనదారుల ఇబ్బందులపై ఈనెల 1వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘కార్డులు ఇంకెన్నడు..!’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. వాహనదారుల ఇబ్బందులను గుర్తించిన ఐదు జిల్లాల పర్యవేక్షణాధికారి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొత్త జిల్లాల లోగోతో కూడిన కార్డులను గురువారం పూర్తిస్థారుులో విడుదల చేశారు. జిల్లాకు సుమారు ఐదువేల కార్డుల చొప్పున అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న కార్డులను వేగంగా ఆయా జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో ముద్రణ పూర్తి చేసి స్పీడ్పోస్ట్కు అందజేశారు. ప్రతి వినియోగదారుడు మరో రెండు రోజుల్లో రిజస్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్సకార్డులను అందుకోనున్నారు. -
దాడులతో దడ..!
డ్రైవింగ్ లెసైన్సులకు భలే గిరాకీ ఆర్టీఏ కార్యాలయాల్లో పెరిగిన రద్దీ పోలీసు,రవాణా తనిఖీలతోబారులు తీరుతున్న వాహనదారులు 20 శాతం పెరిగిన రద్దీ సిటీబ్యూరో:డ్రైవింగ్ లెసైన్సుల కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గత రెండు రోజులుగా రవాణా, పోలీసు విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీలతో లెసైన్సులు లేకుండా బండి నడుపుతున్న వాహనదారులు ఆర్టీఏ బాటపట్టారు. ఈ రెండు రోజుల్లో గ్రేటర్ పరిధిలో సాధారణ రోజుల్లో కంటే 20 శాతానికిపైగా లెర్నింగ్ లెసైన్సులు, డ్రైవింగ్ లెసైన్సులకు డిమాండ్ పెరిగి నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. 360 లెర్నింగ్ లెసైన్స్ స్లాట్ లు అందుబాటులో ఉన్న ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో బుధవారం 288 మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు తీసుకున్నారు. సాధారణ రోజుల్లో 150 నుంచి 200 వరకు మాత్రమే స్లాట్లు నమోదవుతాయి. అలాగే సాధారణ రోజుల్లో 100 నుంచి 150 వరకు డిమాండ్ ఉండే సికింద్రాబాద్ ఆర్టీఏలో 200మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు తీసుకున్నారు. నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్ పరీక్షల కోసం ఏకంగా 435 మంది హాజరయ్యారు. మరోవైపు నగర శివార్లలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ డ్రైవింగ్ లెసైన్సుల కోసం వచ్చే వాహనదారుల రద్దీ కనిపించింది. లెర్నింగ్లెసైన్సులు, డ్రైవింగ్ లెసైన్సుల కోసం బుధవారం 991 మంది హాజరయ్యారు. ఏజెంట్లను ఆశ్రయించవద్దు : జేటీసీ నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో డిమాండ్‌కు అనుగుణంగా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని పరీక్షలకు హాజరు కావాలని జేటీసీ సూచించారు. ఈ సేవా కేంద్రాల్లోనూ స్లాట్ నమోదు చేసుకొనే సదుపాయం ఉందన్నారు. వినియోగదారులు బ్రోకర్లు, ఏజెంట్లను ఆశ్రయించకుండా నేరుగా ఆర్టీఏ అధికారులను సంప్రదించాలని కోరారు. రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్స్ రూల్స్ పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వాహనదారులు లెర్నింగ్, డ్రైవింగ్ పరీక్ష ల్లోనూ ఉత్తీర్ణులవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఎల్ఎల్ఆర్ ఇలా పొందవచ్చు.... రవాణాశాఖ వెబ్సైట్లో మొదట స్లాట్ నమో దు చేసుకోవాలి. 24 గంటల్లో ఈ సేవ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా నిర్ణీత రుసుం చెల్లించాలి. నిర్ణీత తేదీ, సమయం ప్రకారం పుట్టిన తేదీ, ని వాస ధృవీకరణ పత్రాలతో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన 20 ప్రశ్న ల్లో 12 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన జవాబులు గుర్తిస్తే ఉత్తీర్ణులుగా పరిగణించి వెంటనే ఎల్ఎల్ఆర్ ఇస్తారు. డ్రైవింగ్ లెసైన్స్ ఇలా... ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్) తీసుకున్న 30 రోజుల నుంచి 6 నెలల వరకు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్ట్ కు హాజరు కావచ్చు. ఇందుకోసం మరోసారి ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఈసేవ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా 24 గంటల్లో ఫీజు చెల్లించాలి.నిర్ణీత తేదీ, సమయం ప్రకారం అందుబాటులోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌కు పరీక్షకు వెళ్లి, అధికారుల పర్యవేక్షణలో వాహనాలు నడపాలి, నిబంధనలకు అనుగుణంగా నడిపిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. వారం రోజుల్లో డ్రైవింగ్ లెసైన్స్ స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికి చేరుతుంది. లెర్నింగ్ పరీక్షల్లోనూ,. డ్రైవింగ్ పరీక్షల్లోనూ ఫెయిల్ అయిన వారు తిరిగి మరోసారి పరీక్షలకు హాజరు కావలసిందే. -
ప్రారంభమైన టీఎస్ సిరీస్
సాక్షి, సిటీబ్యూరో: కొత్త రాష్ట్రంలో కొత్త సీరిస్తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల తరువాత రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో వాహనదారుల్లో ఆనందం వ్యక్తమైంది. మొన్నటి వరకు వాహనాల సిరీస్, కోడ్ విషయంలో స్పష్టత లేకపోవడంతో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి నిరీక్షణ తప్పలేదు. కొత్త సిరీస్ రిజిస్ట్రేషన్లకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాహనదారులు ఉత్సాహంగా ఆర్టీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. మొదటి రోజైన బుధవారం గ్రేటర్ పరిధిలో 967 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. విరామం తరువాత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో నగరంలోని ఖైరతాబాద్‌తోపాటు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చెల్, సికింద్రాబాద్, మెహదీపట్నం తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారుల రద్దీ కనిపించింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొట్టమొదటి నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0002’ను నగరంలోని రహమత్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడపాటి శివారెడ్డి తన స్విఫ్ట్‌డిజైర్ కోసం సొంతం చేసుకున్నారు. మరో నెంబర్ ‘టీఎస్ 09 ఈఏ 0003’ వేదాంత లైఫ్‌సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ‘టీఎస్ 09 ఈఏ 0004’ నెంబర్‌ను ఎన్.సుధాకర్ అనే వ్యక్తి తన హోండా యాక్టీవాకు తీసుకున్నారు. కొత్త సిరీస్ ప్రారంభమైనప్పటికీ వాహనదారుల్లో సరైన అవగాహన లేక ఫ్యాన్సీ నెంబర్లకు డిమాండ్ కనిపించలేదు. సాధారణ ఫీజులు, తత్కాల్ ఫీజులపైనే వాహనదారులు తమకు కావలసిన నెంబర్లను దక్కించుకున్నారు. ‘టీఎస్09 ఈఏ 369’ కోసం ఓ వాహనదారుడు రూ.70 వేలు వేలం ద్వారా చెల్లించగా ‘టీఎస్ 09 ఈఏ 18’ కోసం మరో వాహనదారుడు రూ.10 వేలు చెల్లించారు. ఫ్యాన్సీ నెంబర్లు సర్కార్కే.. తెలంగాణ రాష్ర్టంలోని తొలి సిరీస్‌లో ఫ్యాన్సీ నెంబర్లను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. ప్రభుత్వ వాహనాల కోసం వీటిని వినియోగించనున్నట్టు రవాణా అధికారులు తెలిపారు. వాహనదారులు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ‘1, 11, 111, 6, 66, 666, 9, 99, 999’ వంటి నెంబర్లు సర్కార్ వాహనాలకే సొంతం కానున్నాయి. మొట్టమొదటి సిరీస్ కావడంతో ప్రభుత్వం ఈ నెంబర్లకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. పాత వాహనాలపై ప్రతిష్టంభన.. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనా పాత వాహనాలపై నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం తొలగిపోలేదు. ‘ఏపీ’ నుంచి ‘టీఎస్’కు మారిన దృష్ట్యా అన్ని వాహనాలు తప్పనిసరిగా ఇందుకు అనుగుణంగా నెంబర్ ప్లేట్లను సవ రించుకోవాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో జిల్లా కోడ్ నెంబర్లు కూడా మారిపోతాయి. ఈ అంశంపై స్పష్టతకు మరో వారం, పది రోజులు పట్టవచ్చని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ ర ఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. రంగారెడ్డి పరిధిలో 482 రిజిస్ట్రేషన్లు అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో బుధవారం 482 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ తెలిపారు. అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో 116, ఇబ్రహీంపట్నంలో 174, ఉప్పల్‌లో 93, మేడ్చల్‌లో 99 వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు. ఉప్పల్‌లో టీఎస్ 08 సిరీస్.. ఉప్పల్: రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాహనదారులతో ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం కిక్కిరిసిపోయింది. టీఎస్ 08 ఈఏ 0001, ట్రాన్స్‌పోర్టు వాహనాల సిరీస్ టీఎస్ 08 యూఏ 0001తో ప్రారంభమయ్యాయి. ఉప్పల్ పారిశ్రామికవాడకు చెందిన దోషి జమ్స్ అండ్ జ్యువెలర్స్ పేరిట ‘టీఎస్ 08 ఈఏ 0001’ నెంబర్‌ను రూ. 50 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాడు. సికింద్రాబాద్‌లో.. కంటోన్మెంట్: సికింద్రాబాద్ ఆర్టీఏ పరిధిలో తొలి నెంబర్‌ను హబ్సిగూడకు చెందిన వ్యాపారి శ్రీధర్‌రెడ్డి దక్కించుకున్నారు. విఖ్యాత్ ఇన్ఫ్రా పేరిట తీసుకున్న బెంజి కారుకు టీఎస్10ఈఏ 0009 నెంబర్‌కు పోటీ లేకపోవడంతో కేవలం రూ.50 వేలకే దక్కించుకున్నారు.