Artificial shortage
-
నోట్లరద్దు తర్వాత కన్నా రెండింతలైంది
-
ప్రజల వద్ద 18.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న నగదు స్థాయి గరిష్టానికి చేరుకుందనీ, 2016లో నోట్ల రద్దు తర్వాత జనం చేతుల్లో ఉన్న డబ్బుకు రెండింతలకుపైగా ఇప్పుడు ఉందని ఆర్బీఐ పేర్కొంది. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి పాత రూ.1,000, పాత రూ. 500 నోట్లను ప్రభుత్వం చలామణి నుంచి ఉపసంహరించడం తెలిసిందే. 2016 డిసెంబర్ 9 నాటికి ప్రజల వద్ద ఉన్న నోట్ల విలువ 7.8 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది మే 25 నాటికి 18.5 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు జనం దగ్గర ఉన్నా యని ఆర్బీఐ వెల్లడించింది. అలాగే నోట్లరద్దు అనంతర రోజులతో పోలిస్తే ప్రస్తుతం రెండింతలకు పైగా నగదు చలామణిలో ఉందంది. 2017 జనవరి 6 నాటికి రూ. 8.9 లక్షల కోట్లు చలామణిలో ఉండగా, ఈ నెల 1 నాటికి అది రూ. 19.3 లక్షల కోట్లకు చేరుకుందంది. ప్రజల్లో ఉన్న నగదు, బ్యాంకుల వద్ద ఉన్న నగదు.. రెండింటినీ కలిపి చలామణిలో ఉన్న నగదుగా పరిగణిస్తారు. రెండు, మూడు నెలల క్రితం అనేక రాష్ట్రాల్లో నగదు కొరత ఏర్పడినా, ఆర్బీఐ గణాంకాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. కొందరు వ్యక్తులు వివిధ కారణాలతో భారీ స్థాయిలో డబ్బును బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుని, చలామణిలోకి తేకుండా దాచిపెట్టడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
యూరియా...లేదయ్యా..!
తెనాలిటౌన్: తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని మండలాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు కంటి మీద కునుకు ఉండడం లేదు. పైరుకు సకాలంలో ఎరువు వేయలేక పంటను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక అల్లాడుతున్నారు. యూరియాకు కృతిమ కొరత ఏర్పడటంతో రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి దశలో ఎరువులు వేయాల్సిన సమయం రావడంతో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతు లు పలు అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలోని విక్రయ కేంద్రం చుట్టూ రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు, వేమూరు మండలాల్లో మొక్కజొన్న పైరు 30 నుంచి 35 రోజుల దశలో ఉంది. కొన్నిచోట్ల 25 నుంచి 30 రోజుల దశలో ఉంది. ఈ దశలో మొదటి దఫా ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. డీఏపీతోపాటు యూరియా కూడా వేస్తారు. తెనాలి మండలంలో 8,750 ఎకరాలు, దుగ్గిరాలలో 8వేల ఎకరాలు, కొల్లిపరలో 8,500 ఎకరాలు, కొల్లూరులో 7,500 ఎకరాలు, వేమూరులో 7వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టినట్టు వ్యవసాయ సహాయ సంచాలకులు కె.జ్యోతిరమణి తెలిపారు. తెనాలి మార్కెట్‌యార్డు ఆవరణలో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 50 కిలోల యూరియా బస్తా రూ. 298.50లకు విక్రయిస్తున్నారు. డివిజన్ పరిధిలోని మండలాలతో పాటు చుండూరు, చేబ్రోలు, అమృతలూరు రైతులు కూడా ఇక్కడకు వచ్చి యూరియా కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరిగింది. రైతులు ఆటోలు, ట్రక్కు ఆటోల ద్వారా తీసుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు విక్రయ కేంద్రంలో నవంబర్, డిసెంబర్ నెలలకు కలిపి 9,140 బస్తాలు, జనవరిలో ఇప్పటి వరకు 1600 బస్తాలు విక్రయించినట్టు ఇన్చార్జి ఇన్నయ్య తెలిపారు. అలాంట్మెంట్ తక్కువగా ఉండటం, రవాణా సక్రమంగా జరగకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. మండల కేంద్రాల్లో వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా యూరియాను సక్రమంగా సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అక్కడ లేకపోవడంతో తెనాలి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రానికి రావాల్సి వస్తుందని, ఐతానగర్‌కు చెందిన సురేష్ అనే రైతు తెలిపారు. పైరుకు నీరు పెట్టాల్సిన సమ యం వచ్చిందని, ఎరువు వేసి నీరు పెడదామంటే యూరియా అందుబాటులో లేదని తెలిపారు. ముందస్తు నిల్వలు.. ఇదిలావుంటే , ప్రస్తుతం యూరియా కొరతగా ఉండటంతో రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది ఎదురుకావచ్చనే ఉద్దేశంతో కొందరు రైతులు ఇప్పుడే కొని నిల్వ చేసుకుంటున్నారు. ఒక్కొక్క రైతు 20 నుంచి 50 బస్తాల వరకు కొనుగోలు చేయడంతో మిగతావారికి అందడం లేదని ఇన్నయ్య తెలిపారు. రైతులందరూ ఒకేసారి అడుగుతున్నందున కొరత ఏర్పడిందని చెప్పారు. రైతులకు మొదటి దఫా ఎంతమేరకు అవసరమో అంతవరకే కొనుగోలు చేసి మిగతా రైతులకు అందేలా సహకరించాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. ఇదిలావుండగా, బయట మార్కెట్లో యూరి యాను అధిక ధరకు విక్రయించినట్లయితే చర్యలు తప్పవని వ్యవసాయాధికారులు తెలిపారు. 30 వేల బస్తాల యూరియా అవసరం ... సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో సాగవుతున్న మొక్కజొన్న, జొన్న పైర్లకు మరో 30 వేల బస్తాల యూరియా అవసరం కానుంది. ఇప్పటివరకు 10వేల బస్తాలకు పైగా విక్రయించారు. ఈ మ ండలాలతో పాటు పక్కన ఉన్న అమృతలూరు, భట్టిప్రోలు, చుండూరు, చేబ్రోలు రైతులు యూరియా కోసం ఇక్కడకు రావడంతో కొరత ఏర్పడింది. అధికారులు చర్యలు తీసుకుని రైతులందరికీ సకాలంలో యూరియా అందే విధంగా చూడాలని కోరుతున్నారు. -
ఇసుక తిప్పలు
బాన్సువాడ: ఇసుక క్వారీలకు అనుమతి లేదంటూ పలువురు కాంట్రాక్టర్లు కృత్రిమ కొరతను సృ ష్టించి ఇసుక ధరలను పెంచేశారు. దొడ్డిదారిన , అక్రమంగా రోజూ వందలాది లారీల ఇసుకను మంజీరా నుంచి తోడుతున్నా, ఇసుక కొరత ఉందంటూ వీరు నిర్మాణదారులను దోచుకొంటున్నారు. మంజీరా తీర ప్రాంతంలోని బిచ్కుంద మండలం హస్గుల్, షెట్లూర్, వాజిద్నగర్, పిట్లం మండలంలోని మద్దెల్‌చెరు, బాన్సువాడ మండలం చింతల్ నాగారం, బీర్కూర్ మండలం కిష్టాపూర్, దామరంచ, బీర్కూర్, బరంగేడ్గి, కోటగిరి మండలం హంగర్గ, పోతంగల్ తదితర ప్రాంతాల నుంచి రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలలో ఇసుక తరలి వెళ్తోంది. ఇసుక రవాణాకు అనుమతి లేకున్నా పలువురు కాంట్రాక్టర్లు ఇందిరమ్మ ఇండ్లకు, ప్రభుత్వ పనుల కోసమంటూ నకిలీ అనుమతులు తీసుకొని యథేచ్ఛగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రిపూటే ఈ దందా నిరాటంకంగా కొనసాగుతున్నా పట్టించుకున్నవారు మాత్రం లేరు. ఇసుకను నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, హైదరాబాద్‌కు సై తం రవాణా చేస్తున్నారు. బాన్సువాడలోని పలు ప్రాంతాలలో ఇసుక డంపులు ఉన్నాయి. కనీసం 50 నుంచి 100 లారీల ఇసుకను నిలువ చేసి, అక్కడి నుంచి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా నిర్మాణదారులకు సరఫరా చేస్తున్నారు. అనధికారికమే ఇసుక క్వారీలు, పట్టాదారులు ఇసుకను తరలించకుండా నాలుగు నెలల క్రితం ప్రభుత్వం అనుమతులను నిలిపివేసింది. అయినా, రెవెన్యూ అధికారులు, పోలీసుల తో మిలాఖాత్ అయిన కాంట్రాక్టర్లు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాలలో వీరు దళారులను ఏర్పాటు చేసుకొని అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారు. నిర్మాణదారులు ప్రశ్నిస్తే ఇసుక క్వారీలకు ప్రభుత్వ అనుమతి లేదని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని అంటున్నారు. మరో వైపు మంజీరా నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభమైనందున ధరలు తగ్గుతాయని ఇటు అధికారులు, అటు నిర్మాణదారులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. నిలిచిన నిర్మాణాలు ఇసుక లేకపోవడంతో నాలుగు నెలలుగా అనేక నిర్మాణాలు నిలిచిపోయాయి. గతంలో పట్టణ పా్రంతాలలో ట్రాక్టర్ ఇసుక సీనరేజి, రవాణాతో కలిపి రూ.1,350కి వచ్చేది. చిన్న చిన్న పాయింట్ల నుంచి తీసుకువచ్చే ఇసుక రూ. 800 నుంచి 1200 వరకు లభించేది. నాటి ధరలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. ప్రస్తుతం క్వారీల లో ట్రాక్టర్ ఇసుకను రూ. రెండు వేల నుంచి రూ. మూడు వేల వరకు విక్రయిస్తున్నారు. పనులు నిలిపివేసిన యజమానులు చేసేదేమీ లేక అదే ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధికారులు కల్పించుకొంటే ధర తగ్గుతుందని మరికొందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల ఉదాసీనత కూడా వ్యాపారులకు కలి సొచ్చింది. కాంట్రాక్టర్లే ధరను పెంచారని బ్రోకర్లు చెబుతుండగా, కాదు బ్రోకర్లే పెంచారని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఏది నిజమో తెలియని నిర్మాణదారులు గంద రగోళానికి గురవుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో ఇండ్ల నిర్మాణాలకు ఇబ్బందులు తప్పవని యజమానులు ఆందోళన చెందుతున్నారు. నిజాంసా గర్ ప్రధాన కాలువ ఆధునికీకరణ నిమిత్తం ఇసుక తరలింపునకు ప్రభుత్వం అనుమతినివ్వగా, కాంట్రాక్టర్లు దీన్ని ఆసరాగా చేసుకొని ఇసుకను విక్రయిస్తున్నట్లు ఆరోప ణలు వస్తున్నాయి. పెరుగుతున్న సమస్యలు ఇసుక తరలింపుతో గ్రామాలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మంజీరా తీర ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వంద అడుగుల వరకు బోరుబావులు తవ్వినా నీళ్లు పడడం లేదని రైతులు వాపోతున్నారు. మంజీరా నుంచి ఇసుక తరలిపోతే చాలా బోర్లు ఎండిపోతాయి. పొలాలు బీడులుగా మిగిలి పోతాయి. డీఫ్లోరైడ్ పథకాలు వట్టి పోతాయి. పరిమితికి మించి 40 టన్నుల లోడ్‌తో లారీలు వెళ్తే కోట్లాది రూపాయలతో నిర్మించిన బీటి రోడ్లు, సీసీ రోడ్లు శిథిలమైపో తాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.