Arun Babu
-
ప్చ్.. మీ పనితీరు బాగోలేదు
పుట్టపర్తి అర్బన్: ‘‘బుక్కపట్నం, కదిరి వెస్ట్, ధర్మవరం, గాండ్లపెంట, తనకల్లు, ఓడీసీల్లో అంగన్వాడీ కేంద్రాల పనితీరు సరిగా లేదు. సీడీపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఇకపై పనితీరు మార్చుకోవాలి. బుధవారం నాటికి నిర్దేశిత లక్ష్యాల సాధనలో కొంతైనా పురోగతి చూపాలి’’ అని కలెక్టర్ అరుణ్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని కోర్టు కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ నెల 8వ తేదీన (గురువారం) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని, ఆలోపు జిల్లాలోని అన్నిశాఖల అధికారులు సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల నిర్దేశిత లక్ష్యాల సాధనకు అధికారులు ప్రణాళికా బద్ధంగా పని చేయాలన్నారు. లక్ష్య సాధనలో పురోగతి లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఈ క్రమంలోనే ఐసీడీఎస్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే ధర్మవరం అర్బన్, కదిరి అర్బన్, పుట్టపర్తి అర్బన్, హిందూపురం అర్బన్, గోరంట్ల, మడకశిర మండలాల్లోనూ పనులు పురోగతి సరిగా లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్నపిల్లలు, బాలికల్లో రక్తహీనత, పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు, 10 నుంచి 19 ఏళ్లలోపు బాలికల్లో రక్త హీనత, పోషకాహారలోపం లేకుండా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి అంగన్వాడీ, పాఠశాలల్లో పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. అలాగే గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బడి మానేసిన చిన్నారులపై దృష్టి సారించి వారందరికీ స్కూళ్లలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు వినియోగంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇక ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో ఎమ్మెల్యేలు ద్వారా గుర్తించిన 133 పనులకు ఆమోదం తెలిపామన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగప్రసాద్, డీఎంహెచ్ఓ కృష్ణారెడ్డి, ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి, నోడలాఫీసర్ శివారెడ్డి, జిల్లా కోర్డినేటర్ యవవాణి తదితరులు ఉన్నారు. -
రేషన్ డీలర్ కోసం గాలింపు
పెనమలూరు: విధి నిర్వహణలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) గుమ్మడి విజయ్‌కుమార్‌పై ఈనెల 17న దాడికి కారకుడైన రేషన్ డీలర్ లుక్కా అరుణ్‌బాబు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత డీలర్ తన కుటుంబ సభ్యులతో పారిపోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత అరుణ్‌బాబు గురించి ఆరా తీస్తే అతను పక్కా టీడీపీ వ్యక్తిగా స్పష్టమైంది. అంతేకాక.. స్థానికంగా టీడీపీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పేదలకు రేషన్ పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అరుణ్‌బాబు పచ్చచొక్కా వేసుకుని రేషన్ అక్రమాలకు తెరలేపాడు. ఇతనికి టీడీపీ అగ్రనేతలతో కూడా సత్సంధాలున్నాయని చెబుతున్నారు. టీడీపీ హయాంలోనే నియామకం నిజానికి.. లుక్కా అరుణ్‌బాబును టీడీపీ హయాంలో నిబంధనలు అతిక్రమించి మరీ కృష్ణాజిల్లా పెనమలూరు డీలర్‌గా నియమించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నాటి టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో ఫొటోలు కూడా దిగాడు. పార్టీ జెండాను భుజంపై వేసుకుని టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో.. పార్టీ అండ చూసుకుని రేషన్‌ను పక్కదారి పట్టిస్తున్నాడు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ గుమ్మడి విజయ్‌కుమార్ తనిఖీ చేయగా 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార మాయం చేశాడని తేలింది. డీలర్ లుక్కా అరుణ్‌బాబు గుట్టురట్టు కావడంతో అతనిని కాపాడేందుకు బోడె ప్రసాద్, అతని అనుచరులు అధికారులపై దాడిచేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అదృశ్యమైన డీలర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దాడిలో 9 మందికి రిమాండ్ ఇక డిప్యూటీ తహసీల్దార్‌పై దాడి కేసులో తొమ్మిది మందికి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు వంగూరు పవన్, చిగురుపాటి శ్రీనివాసరావు, దొంతగాని పుల్లేశ్వరరావు, కొల్లిపర ప్రమోద్, కిలారు ప్రవీణ్, బోడె మనోజ్, కాపరౌతు వాసు, కిలారు కిరణ్‌కుమార్, వెలివెల సతీష్‌లను పెనమలూరు పోలీసులు అరెస్టుచేసి నిందితులను గురువారం విజయవాడ రైల్వే కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. -
కోర్టు ధిక్కారం కేసులో ఆర్డీవోకు జైలు, జరిమానా
నరసరావుపేట ఆర్డీవో అరుణ్‌బాబుపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే కాకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినందుకు గుంటూరు జిల్లా, నరసరావుపేట రెవిన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీవో) పి.అరుణ్‌బాబుకు ఉమ్మడి హైకోర్టు కోర్టు ధిక్కారం కింద వారం రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తీర్పు వెలువరిం చారు. దీనిపై అప్పీల్‌కు వీలుగా ఆర్డీవో తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును నెల రోజుల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో ఎస్.నరసింహారావు అనే వ్యక్తి రెండెకరాల డీకేటీ పట్టా భూమిని సాగు చేసుకుంటున్నారు. దీనిపై నడిచిన వ్యవహారంలో న్యాయస్థానం పైవిధంగా స్పందించింది.