Aruna Sri
-
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
చెన్నూర్ : వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి కుందేటి ప్రమీల (28) శుక్రవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. వైద్యులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రమీలకు నెలలు నిండడంతో గత మంగళవారం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికు వెళ్లింది. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యురాలు అరుణశ్రీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాలని సూచించింది. అదే రోజు కుటుంబసభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి 12.30 నిమిషాలకు ప్రమీల నార్మల్ డెలివరీ అయిన ప్రమీల మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు పరీక్షలు నిర్వహించిన వైద్యుడు సత్యనారాయణ బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగలేదని పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని సూచించడంతో ప్రమీల భర్త శ్రీనివాస్ కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులతోపాటు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 2 గంటల నుంచి ఉదయం వరకు ప్రమీల కడుపులో మంటగా ఉందని చాలా అవస్థ పడింది. సిబ్బంది, వైద్యులు అందుబాటులో లేక వైద్యం అందక తెల్లవారు జామున ప్రమీల మృతి చెందిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పారు. వైద్యులు అందుబాటులో ఉంటే ప్రమీల బతికేదని పేర్కొన్నారు. మృతురాలికి భర్త శ్రీనివాస్, కుమారుడు క్రిష్ ఉన్నారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన ప్రమీల మృతికి కారణమైన వైద్యులు, సిబ్బందిని సస్పెండ్ చేసి, మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట మృతురాలు బంధువులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, సీఐటీయూ, కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులు ధర్నా చేశారు. నాలుగు గంటల పాటు ధర్నా చేయడంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలియడంతో జిల్లా పరిషత్ ైవె స్ చైర్మన్ మూల రాజిరెడ్డి, తహశీల్దార్ హన్మంతరావు సంఘటన స్థలానికి చేరుకొని వైద్యులను విచారించారు. వైద్యులపై చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తహశీల్దార్ చెప్పినా ఆందోళన కారులు వినిపించుకోలేదు. వైద్యులకు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తహశీల్దార్ ఆర్డీవోతో మాట్లాడారు. దళితబస్తీ పథకం ద్వారా మూడు ఎకరాల భూమి, ఆపద్బంధు పథకం కింద రూ.1.50 లక్షలు అందజేస్తామని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లేశ్, చిరంజీవి, కృష్ణమాచారి, తగరం మధురాజ్, మోహన్ పాల్గొన్నారు. -
సౌకర్యాలు అధ్వానం
బాసర, న్యూస్‌లైన్ : బాసర ట్రీపుల్‌ఐటీలో సౌకర్యాల తీరుపై ఆర్డీవో అరుణశ్రీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆర్డీవో ట్రీపుల్‌ఐటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమా రు రెండు గంటలపాటు ఉండి, ప్రతీ విభాగాన్ని పరిశీ లించారు. మెస్, వైద్యశాల, వంట గదులతోపాటు హాజ రుపట్టికలను తనిఖీ చేశారు. వంటశాలలో కుళ్లిన కూరగాయలు దర్శనమిచ్చారుు. కారంపొడి, పప్పులు తది తర సరుకులు నాసిరకం వాడుతుండడంతో మెస్ నిర్వాహకుడిపై మండిపడ్డారు. విద్యార్థులకు కనిపిం చేలా మెనూ ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం వైద్య శాలను తనిఖీ చేశారు. వైద్యశాలలో ఇద్దరు కాంట్రాక్ట్ వైద్యులుండగా ఒక్కరే విధులకు హాజరయ్యూరు. దీంతో హాజరు పట్టిక, మందుల నిల్వ రిజిష్టర్లను పరిశీలించారు. హాజరుపట్టికలో ముందే సంతకాలు చేసి ఉండడం, ఒకరి సంతకాలు మరొకరు పెట్టడంపై వైద్యు డు కౌశిక్‌పై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో కనీసం ఫ్రీజ్ సైతం లేకపోవడమేంటని, మందులు ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించారు. ట్రిపుల్ ఐటీ నిర్వహణ తీరుపై ఓఎస్డీ నారాయణతో మాట్లాడారు. నిర్వహణ అస్తవ్యస్తం.. ట్రిపుల్ ఐటీ తనిఖీ అనంతరం ఆర్డీవో అరుణశ్రీ విలేకరులతో మాట్లాడారు. సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులున్న ట్రీపుల్ ఐటీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉం దని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తు న్నా విద్యార్థులకు సౌకర్యాల కల్పన, పరిపాలన విషయంలో ట్రీపుల్‌ఐటీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మెస్‌లో కుళ్లిన కూరగాయల నిల్వలు ఉన్నాయన్నారు. నిధుల విషయంలో ఆడిట్ లేకపోవడంతో ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ వివరాలపై అధికారులు బదులు ఇవ్వలేకపోయూరని తెలిపారు. ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులు ఉండాల్సి ఉందని, ఇందులో ఇద్దరు ఉండగా తనిఖీ సమయంలో ఒక్కరే ఉన్నారని చెప్పారు. తనిఖీలో వెలుగుచూసిన విషయూలను నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందిస్తానని పేర్కొన్నారు. ఆమె వెంట తహశీల్దార్ నరేందర్, ఆర్ఐ, వీఆర్ఏ ఉన్నారు. -
రైతులకు గుర్తింపుకార్డులు
ఖానాపూర్, న్యూస్‌లైన్ : రైతులు ఆయా మండలాలు, సమీపంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలని నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీ అన్నారు. త్వరలో పత్తి రైతులకు తహశీల్దార్, వీఆర్వోలతో గుర్తింపు కార్డులు జారీ చేయిస్తామని చెప్పారు. గుర్తింపుకార్డులు ఉన్న రైతుల పంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖానాపూర్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ అలెగ్జాండర్ అధ్యక్షతన రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో అరుణశ్రీ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లోని రైతులు పంటలను దళారులకు విక్రయించి మోసపోకుండా దూరభారమైనా కేంద్రాలకు తీసుకు రావాలని సూచించారు. మాజీ జెడ్పీటీసీ రామునాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కె.గంగారావు, మాజీ అధ్యక్షుడు కె.సురేశ్ మాట్లాడుతూ రైతులు లేకుండా రైతుసదస్సులు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ముందుగా ప్రచారంలో చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. పైరవీలు చేయనిదే పంట కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. వరుస క్రమంలో కొనుగోలు చేయాలని, తూకంలో మోసం లేకుండా చూడాలని ఆర్డీవో అధికారులను ఆదేశించారు. సర్పంచు నేరెళ్ల సత్యనారాయణ, తహశీల్దార్ కనకయ్య, ఏడీఏ దాదేరావు, కడెం, ఖానాపూర్ తహశీల్దార్లు, ఏవోలు కనకయ్య, వీణ, గాయత్రి పాల్గొన్నారు.