ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ దుస్తులు అమ్ముతూ!
ICC Elite Panel Umpire Asad Rauf: ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఒకప్పుడు అంపైర్‌గా ఉన్న పాకిస్తాన్ ఆటగాడు అసద్ రవూఫ్.. ప్రస్తుతం దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. క్రికెట్‌కు పూర్తిగా దూరమైన అతడు సెకండ్ హ్యాండ్ దుస్తులు, బూట్లు, ఇతర వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు పాక్‌టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా డబ్బు చూశానని, ఇప్పుడు తన షాప్‌లో పనిచేసే వర్కర్ల కోసమే పని చేస్తున్నానని పేర్కొన్నాడు.
కాగా 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ బ్యాటర్.. ఆయా మ్యాచ్‌లలో మొత్తం కలిపి 3423, 611 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంపైర్‌గా మారిన అతడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకుని కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకున్నాడు.
ఇక 2000-2013 వరకు 98 వన్డేలు, 49 టెస్టులు, 23 టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన అసద్ రవూఫ్.. ఐపీఎల్-2013 సందర్భంగా బుకీల నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆటకు పూర్తిగా దూరమయ్యాడు.
ఈ క్రమంలో లాహోర్‌లోని లాండా బజార్లో షాప్ నడుపుతున్న 66 ఏళ్ల అసద్‌ను స్థానిక మీడియా సంప్రదించగా.. తన జీవితంలో ఏ విషయానికి పశ్చాత్తాప పడటం లేదని పేర్కొన్నాడు. తాను చేస్తున్న పనితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. తనకు దురాశ లేదని, ఉన్నంతలో సర్దుకుంటానని పేర్కొన్నాడు.
ఈ మేరకు.. ‘‘ఇది నాకోసం చేయడం లేదు. నా షాపులో పనిచేసే సిబ్బందికి రోజూ కూలీ చెల్లించాలనే ఉద్దేశంతోనే నేను కూడా పనిలో భాగమవుతున్నా. నా లైఫ్‌లో చాలా డబ్బు చూశాను. ప్రపంచం మొత్తం తిరిగాను.
నా కుటుంబం విషయానికొస్తే.. నాకు దివ్యాంగుడైన కుమారుడు ఉన్నాడు. మరో కుమారుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నిజానికి నేను ఏ రంగంలో ఉన్నా అందులో తారస్థాయికి చేరుకోవాలని కోరుకుంటాను.
క్రికెట్ ఆడే సమయంలో, అంపైరింగ్‌లో టాప్‌లో ఉండేవాడిని. ఇప్పుడు షాప్‌కీపర్‌గా కూడా ఉన్నత స్థితికి చేరుకునేందుకు కృషి చేస్తున్నా. నేను చేస్తున్న పనితో పూర్తి సంతృప్తిగా ఉన్నాను’’ అని అసద్ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో ఆ చేదు అనుభవం మినహా మిగతాకాలమంతా ఎంతో అత్యుత్తమంగా గడిచిందని పేర్కొన్నాడు.
చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు!
Jos Buttler ODI Records: వన్డేల్లో చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు..!