ఆశా వర్కర్ల అరెస్ట్ - పరిస్థితి ఉద్రిక్తం
డిమాండ్ల సాధనలో భాగంగా హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకు వెళుతున్న ఆశా వర్కర్లను మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు శివారులోని నందిగామ వద్ద సోమవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిఘటించిన ఆశా వర్కర్లపై లాఠీచార్జి చేశారు. మహిళలని చూడకుండా ఈడ్చి అవతల పారేశారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రఘును అరెస్ట్ చేశారు. వంద మంది ఆశా వర్కర్లను కూడా వ్యానులో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాంతో కొత్తూరు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.