Asha Saini
-
పోర్నోగ్రఫీ కేసు: నాకెలాంటి సంబంధం లేదన్న నటి
ముంబై: ‘‘నేనొక నటిని. ప్రపంచంలో ఎక్కడో ఏ మూలనో కూర్చున్న వ్యక్తులు నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. మీరు ప్రచారం చేసే వదంతుల వల్ల నాకు వచ్చే అవకాశాలు చేజారతాయి. దయచేసి నన్ను వివాదాల్లోకి లాగకండి’’ అని నటి ఫ్లోరా షైనీ(ఆశా షైనీ) విజ్ఞప్తి చేసింది. రాజ్‌కుంద్రాతో గానీ, అతడి అనుచరులతో గానీ తనకు ఎటువంటి సంబంధం లేదని, తనకు ఏ పాపమూ తెలియదని స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం అర్థించగా.. తిరస్కరించి కోర్టు అతడికి 14 రోజులపాటు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా సన్నిహితుడు ఉమేశ్ కామత్‌తో ఫ్లోరా షైనీకి స్నేహం ఉందని, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంటూ శనివారం నాటి నుంచి ఓ వాట్సాప్ చాట్ స్థానిక మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన ఫ్లోరా షైనీ.. ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ మేరకు ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన ఆమె... ‘‘ రాజ్‌కుంద్రా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన భార్య శిల్పాశెట్టి కూడా నటి. కాబట్టి ఆయనకు చాలా మంది నటీనటులతో స్నేహం ఉండే ఉంటుంది. కానీ, నాకైతే ఆయనతో గానీ, రూమర్లు ప్రచారం అవుతున్నట్లుగా ఉమేశ్ కామత్‌తో గానీ ఎలాంటి సంబంధం లేదు. వారి కాంటాక్ట్ నంబర్లు కూడా నా వద్ద లేవు. అనవసరంగా నన్ను వివాదంలోకి లాగడం సరికాదు. నన్ను సంప్రదించకుండా, ఆ చాట్స్ నిజమైనవో కాదో తెలుసుకోకుండా ఇష్టారీతిన ప్రసారాలు చేస్తే ఆ చానెల్‌కు వచ్చే లాభమేమిటో అర్థం కావడం లేదు. నాపై చెడు ప్రచారం జరుగుతుంది కాబట్టే.. నేరుగా స్పందించాల్సి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలబడుతున్నారు. కాగా నరసింహా నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో, సర్దుకుపోదాం రండి తదితర తెలుగు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఆశా షైనీ.. కొంతకాలం సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంది. ఆ తర్వాత తన పేరును ఫ్లోరా షైనీగా మార్చుకుని.. బాలీవుడ్‌కు వెళ్లింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావుల స్త్రీ బేగంజాన్, లక్ష్మీ తదితర సినిమాలతో పాటు గందీ బాత్ వెబ్‌సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Flora Saini (@florasaini) -
నిజమే మన ఆయుధం
‘చాలా బాగుంది, సర్దుకుపోదాం రండి, నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో’... వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఫ్లోరా షైనీ (ఆశా షైనీ) సుపరిచితురాలే. 2013లో వచ్చిన ‘సహస్ర’ చిత్రం తర్వాత ఆమె తెలుగులో సినిమాలేవీ చేయలేదు. తాజాగా ఆమె ఫేస్బుక్లో చేసిన పోస్టు, ఫొటోలు వైరల్‌గా మారడంతో హాట్ టాపిక్ అయ్యాయి. పదేళ్ల కిందట తన మాజీ ప్రియుడు, నిర్మాత గౌరంగ్ దోషి (దీవార్, ఆంఖే తదితర చిత్రాల నిర్మాత) నన్ను దారుణంగా కొట్టాడు అంటూ ఆ ఘటన తాలూకు ఫొటోలను షేర్ చేసి, ఫ్లోరా తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2007 ప్రేమికుల దినోత్సవం. అందరికీ సుపరిచితుడైన, నేనెంతగానో ప్రేమించిన నిర్మాత గౌరంగ్ దోషి అదే రోజు నన్ను దారుణంగా కొట్టాడు. ఏడాది పాటు నాకు నరకం చూపించాడు. అప్పుడు నా దవడ ఫ్రాక్చర్ అవడంతో పాటు ముఖంపై గాట్లు పడ్డాయి. ఆ సమయంలో నేను ఈ విషయాలు బయటపెట్టినా, ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో గౌరంగ్‌కు బాగా పలుకుబడి ఉండేది. నాకు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తానని చాలాసార్లు బెదిరించాడు. అన్నట్లుగానే ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు నన్ను తిరస్కరించేవారు. సినిమాకి తీసుకున్నట్లే తీసుకుని తొలగించిన రోజులూ ఉన్నాయి. ఆడిషన్స్‌కి పిలిచేవారు కూడా కాదు. నా ప్రతిభ చూసి అవకాశాలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే వారి వద్దకు పారిపోయి తలదాచుకోవాలని అనుకున్నాను. నేనే కాదు.. నాలాంటి ఎందరో మహిళలు గౌరంగ్ కారణంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిసినప్పుడు అతని వ్యవహారాన్ని నేను బయటపెట్టి మంచి పనే చేశా అనుకున్నా. నాకు అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదు.. కనీసం అతను ఇలాంటివాడు అని చెప్పినందుకు ఆనందపడుతున్నా. తమ పట్ల జరిగిన దారుణాల గురించి బయటపెడుతున్నవారి కోసం నేను ఈ పోస్ట్ పెడుతున్నాను. నిజాన్ని నమ్ముకోండి. దాన్ని ఆయుధంలా ధరించండి. మళ్లీ మనమంతా సంతోషంగా ఉందాం. ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. ఎవరూ ఎవరికీ తలొగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరి వాళ్లు కాదు’’ అని వెల్లడించారు ఫ్లోరా షైనీ. -
నిర్మాత పైశాచికత్వం; ఆ ఫొటోలో ఉన్నది నేనే!
పదేళ్ల క్రితం తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బాలీవుడ్ నటి తనుశ్రీ గళం విప్పిన నాటి నుంచి భారత్‌లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తమ చేదు అనుభవాలను బయటపెడుతుండగా.. తాజాగా నటి ఆశా(ఫ్లోరా) షైనీ కూడా ముందుకొచ్చారు. నరసింహా నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో, సర్దుకుపోదాం రండి తదితర తెలుగు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆశా షైనీ కెరీర్ తొలి నాళ్లలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టారు. ప్రేమ పేరిట నమ్మించి, తన జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేసిన వ్యక్తి గురించి #మీటూ స్టోరీ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన మాజీ ప్రేమికుడు, బాలీవుడ్ ప్రొడ్యూసర్ గౌరంగ్ దోషి తనను హింసించినందుకు సాక్ష్యంగా గాయాలతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ఆశా షైనీ..‘ అది నేనే. ఆరోజు 2007 వాలంటైన్స్ డే. అదే రోజు అందరికీ సుపరిచితుడైన, నేనెంతగానో ప్రేమించిన ప్రొడ్యూసర్ గౌరంగ్ దోషి(దీవార్, ఆంఖే వంటి హిట్ చిత్రాల నిర్మాత) నన్ను చావబాదాడు. నా దవడలు వాచిపోయేలా కొట్టాడు. ఆరోజే చచ్చిపోతానేమో అన్పించింది. కొన్ని రోజుల తర్వాత అతడి గురించి బయటి ప్రపంచానికి నిజాలు చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి(తనను ఉద్దేశించి) మాటలు ఎవరూ నమ్మరని, ముఖ్యంగా తన గురించి ఈ విషయాలు బయటపెడితే నాకే నష్టమని, అవకాశాలు కూడా రావని గౌరంగ్ చెప్పాడు. అన్నట్టుగానే అడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ నన్ను తిరస్కరించేవారు. అలాగే అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి. ఒకానొక సమయంలో అసలు ఈ విషయం ఎందుకు బయటపెట్టానా అని ఎన్నో సార్లు బాధపడ్డాను. కానీ నాలాగే ఎంతో మంది అమ్మాయిల జీవితాలను అతడు నాశనం చేశాడని తెలుసుకున్న తర్వాత నేను చేసింది కరెక్టే కదా అని నన్ను నేను సముదాయించుకున్నాను. కాకపోతే నాలాగా గౌరంగ్ బాధితులందరు నేటికీ నోరు విప్పకపోవడం కాస్త బాధించే అంశం. అయితే గౌరంగ్ రాక్షసత్వానికి భయపడినందు వల్లే వాళ్లు ముందుకు రావడం లేదు. కానీ నేడు పరిస్థితులు మారాయి. మంచిని ఆదరించే వాళ్లూ ఉన్నారు. ఎవరూ ఎవరికీ తలొగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరి వాళ్లు కాదంటూ’ ఆశా షైనీ ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. కాగా కొన్నాళ్లు వెండి తెరకు దూరమైన ఆశా షైనీ.. ఫ్లోరా షైనీగా పేరు మార్చుకున్నారు. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ మూవీ ‘స్త్రీ’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్లోరా షైనీ దెయ్యం పాత్రలో నటించారు. -
మళ్లీ వస్తానంటున్న లక్స్ పాప
ప్రేమకోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆశాషైని, బాలకృష్ణతో కలిసి నటించిన నరసింహనాయుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన లక్స్ పాప పాట ఆశకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయటంలో ఫెయిల్ అయిన ఆశషైని.. తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆశ బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అక్కడ తన అసలు పేరు ఫ్లోరాషైనిగా పాపులర్ అయిన లక్స్ పాప, త్వరలో బేగంజాన్ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన మైనా అనే ఆదివాసి యువతి పాత్రలో నటిస్తోంది ఈ బ్యూటి. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న ఆశషైనీ, బేగంజాన్ రిలీజ్ తరువాత తనకు సౌత్ నుంచి మళ్లీ పిలుపువస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. తాను తెలుగు బాగా మాట్లాడగలనని, ఛాన్స్ ఇస్తే మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించింది. మరి ఆశషైనీకి ఈ సారైనా టాలీవుడ్ వెల్కం చెబుతుందేమో చూడాలి. -
నగేశ్ కుకునూర్ సినిమాలో...
ఆశా సైనీ గుర్తుంది కదూ? ‘నరసింహనాయుడు’లో బాలకృష్ణతో ‘లక్స్ పాప’గా నర్తించి బాగా పాపులరయ్యారు. ఇప్పుడామె తన పేరుని ఫ్లోరా సైనీగా మార్చుకున్నారు. హిందీ చిత్రసీమలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ‘ధనక్’ (అంటే ఇంద్రధనస్సు అని అర్థం) అనే సినిమాలో కీలక పాత్ర చేశారామె. ఎనిమిదేళ్ల అంధ బాలుడు పదో ఏట అడుగుపెట్టేసరికి, అతని పదకొండేళ్ల అక్క కంటి చూపు తెప్పిస్తానని ప్రమాణం చేస్తుంది. దానికోసం తన స్నేహితులతో కలిసి ఆ సోదరి చేసిన ప్రయత్నాల సమాహారంతో ఈ చిత్రం సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం బెర్లిన్ చలన చిత్రోత్సవాలకు ఎంపికైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవాల్లో ‘ధనక్’ ప్రదర్శితం కానుంది.