మళ్లీ వస్తానంటున్న లక్స్ పాప | Asha Saini Hopes on BegumJaan | Sakshi
Sakshi News home page

మళ్లీ వస్తానంటున్న లక్స్ పాప

Published Sat, Mar 25 2017 1:41 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

మళ్లీ వస్తానంటున్న లక్స్ పాప

మళ్లీ వస్తానంటున్న లక్స్ పాప

ప్రేమకోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆశాషైని, బాలకృష్ణతో కలిసి నటించిన నరసింహనాయుడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన లక్స్ పాప పాట ఆశకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయటంలో ఫెయిల్ అయిన ఆశషైని.. తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆశ బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

అక్కడ తన అసలు పేరు ఫ్లోరాషైనిగా పాపులర్ అయిన లక్స్ పాప, త్వరలో బేగంజాన్ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమాలో గుజరాత్కు చెందిన మైనా అనే ఆదివాసి యువతి పాత్రలో నటిస్తోంది ఈ బ్యూటి. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న ఆశషైనీ, బేగంజాన్ రిలీజ్ తరువాత తనకు సౌత్ నుంచి మళ్లీ పిలుపువస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. తాను తెలుగు బాగా మాట్లాడగలనని, ఛాన్స్ ఇస్తే మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించింది. మరి ఆశషైనీకి ఈ సారైనా టాలీవుడ్ వెల్కం చెబుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement