నగేశ్ కుకునూర్ సినిమాలో... | Nagesh Kukunoor's Dhanak will be showcased at the Berlin Film Fest | Sakshi
Sakshi News home page

నగేశ్ కుకునూర్ సినిమాలో...

Published Fri, Dec 19 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

నగేశ్ కుకునూర్ సినిమాలో...

నగేశ్ కుకునూర్ సినిమాలో...

ఆశా సైనీ గుర్తుంది కదూ? ‘నరసింహనాయుడు’లో బాలకృష్ణతో ‘లక్స్ పాప’గా నర్తించి బాగా పాపులరయ్యారు. ఇప్పుడామె తన పేరుని ఫ్లోరా సైనీగా మార్చుకున్నారు. హిందీ చిత్రసీమలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ‘ధనక్’ (అంటే ఇంద్రధనస్సు అని అర్థం) అనే సినిమాలో కీలక పాత్ర చేశారామె. ఎనిమిదేళ్ల అంధ బాలుడు పదో ఏట అడుగుపెట్టేసరికి, అతని పదకొండేళ్ల అక్క కంటి చూపు తెప్పిస్తానని ప్రమాణం చేస్తుంది. దానికోసం తన స్నేహితులతో కలిసి ఆ సోదరి చేసిన ప్రయత్నాల సమాహారంతో ఈ చిత్రం సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం బెర్లిన్ చలన చిత్రోత్సవాలకు ఎంపికైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవాల్లో ‘ధనక్’ ప్రదర్శితం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement