బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అల్లు అర్జున్‌   | Allu Arjun To Attend Berlin Film Festival For Special Screening Of Pushpa The Rise, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun At Berlinale 2024: బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అల్లు అర్జున్‌  

Published Fri, Feb 16 2024 12:59 AM | Last Updated on Fri, Feb 16 2024 8:11 AM

Allu Arjun To Attend Berlin Film Festival For Special Screening Of Pushpa: The Rise - Sakshi

జర్మనీ వెళ్లారు హీరో అల్లు అర్జున్‌. ఈ ఏడాది ఫిబ్రవరి 15 (గురువారం) నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరుగుతున్న 74వ బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటారు అల్లు అర్జున్‌. ఈ చిత్రోత్సవాల్లో భారతీయ సినిమాప్రాముఖ్యత, చరిత్ర గురించిన అంశాలను అల్లు అర్జున్‌ మాట్లాడనున్నారని తెలిసింది. అంతేకాదు...ఈ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొం దుతున్న ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ ప్రత్యేక ప్రదర్శన కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రం ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ ఫిల్మ్‌ మేకర్స్, మార్కెటింగ్‌ స్ట్రాటజిస్ట్‌లతో అల్లు అర్జున్‌ మాట్లాడతారట. ఇక బెర్లిన్‌ ఫెస్టివల్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌లో పాల్గొంటారు అల్లు అర్జున్‌. రష్మికా మందన్నా, ఫాహద్‌ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement