Asha workers strike
-
ఏపీలో సమస్యల పరిష్కరం కోసం కార్మికుల ఆందోళన
-
ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటూ బీజేపీ మహిళా మోర్చ నిరసన
-
కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆశా ఆరోగ్య కార్యకర్తల సమ్మె నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తమకు మెరుగైన సేవా పరిస్థితులు, ప్రయోజనాలు కల్పించాలని ఆశా కార్యకర్తలు రెండు రోజులపాటు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆశా కార్యకర్తల విషయంలో మౌనం వహిస్తోందని రాహుల్ విమర్శించారు. ప్రస్తుతం వారి సమస్యలను ఏమాత్రం వినిపించుకోకుండా గుడ్డిగా వ్యవహిస్తోందని విరుచుకుపడ్డారు. ఆశా వర్కర్లు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఆరోగ్య రక్షకులుగా సేవలు అందిస్తారు. వారు నిజమైన ఆరోగ్యయోధులని అన్నారు. అటువంటి ఆరోగ్య కార్యకర్తలు నేడు తమ సొంత హక్కుల కోసం రోడ్లపై సమ్మెల చేయాల్సి వస్తోందని రాహుల్ కేంద్రంపై మండిపడ్డారు. (మోదీ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?) ఆశా(అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్), అంగన్వాడీ, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని కార్మికులకు సంబంధించిన పలు మీడియా నివేదికలను రాహుల్ తన ట్విటర్లో ట్యాగ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ శుక్రవారం నుంచి రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపుతో దేశ వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది ఆశా వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. -
‘ఆశా’ల వేతనాలపై.. కావాలనే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ఆశా వర్కర్ల వేతనాల విషయంలో కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. గౌరవ వేతనాల కోసం గతంలో వీరు, అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు చేస్తే లాఠీచార్జి చేయించి, గుర్రాలతో తొక్కించిన వాళ్లు ఇప్పుడు ఆశా వర్కర్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయనన్నారు. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి కాగానే ఆ హామీని నెరవేరుస్తూ.. వారు రూ.6 వేలు గౌరవ వేతనం అడిగితే రూ.10 వేలు ఇచ్చారని, ఇది చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీ నేతలు ఆశా వర్కర్ల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. ఆశా వర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్‌లు పెట్టలేదని, కొంతమంది ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రెచ్చగొట్టి వారితో ధర్నా చేయించారని, ఇది ఆశా అక్కచెల్లెమ్మలు గుర్తించాలని మంత్రి అన్నారు. 2014 ఎన్నికల సమయంలో గౌరవ వేతనం ఇస్తామని మభ్యపెట్టిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయ్యాక నాలుగున్నరేళ్లపాటు వారిని ఆయన పట్టించుకోలేదని, ఎన్నికలకు మూడు నెలల ముందు రూ.3వేలు ఇస్తూ జీవో ఇచ్చి అవి కూడా సకాలంలో ఇవ్వలేకపోయారని, ఇదీ చంద్రబాబు నైజమన్నారు. సెప్టెంబర్ 1 నుంచి పెంచిన వేతనాలు కాగా, పెంచిన వేతనాలను తాము ఆగస్టు నుంచి అమలుచేస్తూ సెప్టెంబరు 1 నుంచి ఇస్తున్నామని, పాత బకాయిలు కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి నాని భరోసా ఇచ్చారు. గ్రేడింగుల గురించి ఎవరో చెప్పిన మాటలు నమ్మవద్దని, ప్రభుత్వోద్యోగులందరికీ ఉన్నట్టే జాబ్‌చార్ట్ ఉంటుంది తప్ప మరోటి కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది నేతలు రెచ్చగొడుతూ ఉంటారని.. ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వస్తుందోనన్న దుగ్ధతోనే ఇలా చేస్తుంటారని ఆయన మండిపడ్డారు. ఒక్కసారి మాట ఇస్తే జగన్మోహన్రెడ్డి వెనక్కు తగ్గరని, రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందాలన్నదే ఆయన అభిమతమని నాని చెప్పారు. -
స్తంభించిన గ్రామీణ వైద్యం
సాక్షి, హైదరాబాద్: ‘ఆశ’ వ ర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైంది. 24 రోజులుగా వేలాది మంది ఆశ కార్యకర్తలు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడంలేదు. వారితో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయడంలో సర్కారు పెద్దలు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలున్నాయి. వ్యాధుల సీజన్లో ‘ఆశ’ వర్కర్ల సమ్మె.. పల్లెల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. డెంగీ, మలేరియా, చికున్ గున్యా, విష జ్వరాలతో పల్లెలు విలవిలలాడుతుంటే.. ఈ సమ్మె పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. పారితోషికాలు కాకుండా కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని ఆశ వర్కర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని కోరుతున్నారు. రెండ్రోజుల క్రితం మంత్రి లక్ష్మారెడ్డితో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు ఆశ వర్కర్లు సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నారు. ఈ లోపు జిల్లాల్లో నిరవధిక నిరాహార దీక్షలకు రంగం సిద్ధం చేశారు. సమ్మెలో 25 వేల మంది... రాష్ట్రంలో 25 వేల మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. పదే ళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం వీరిని నియమించారు. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటితోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అయితే వీరికి ప్రభుత్వం నామమాత్రపు పారితోషికాలను ఇస్తోంది. పనిని బట్టి నెలకు ఒక్కో ఆశ వర్కర్‌కు రూ. 400 నుంచి రూ. 2 వేల వరకు ఇస్తున్నారు. రోజంతా పల్లెల్లో తిరిగితే వచ్చే ఈ పారితోషికం ఏమాత్రం సరిపోవడంలేదు. కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని అనేకసార్లు ఆందోళనలు నిర్వహించినా స్పందన లేదు. పశ్చిమబెంగాల్, కేరళ, హర్యానా రాష్ట్రాలు పారితోషికాలతోపాటు నిర్ణీత వేతనాలు ఇస్తున్నాయని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే వేతనాలు నిర్ణయించాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని.. నిరవధిక దీక్షలు, చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. -
‘కార్పొరేట్’ దోపిడీని అరికడతాం
* ‘సాక్షి’ కథనాలు వాస్తవమే * వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి నల్లగొండ రూరల్: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ వైద్య దోపిడీని అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రకటించారు. నల్లగొండలో శనివారం జరిగిన ఈఎన్టీ డాక్టర్ల రాష్ట్రస్థాయి సదస్పుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ వైద్య దోపిడీపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల గురించి ఈ సందర్భంగా స్పందించారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో దోపిడీ జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. కార్పొరేట్ దోపిడీకి చెక్ పెట్టేందుకు త్వరలోనే ఒక విధానాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ప్రైవేటు వైద్యం కూడా ప్రభుత్వంలో భాగస్వామేనని, ఎక్కడో ఒకచోట కార్పొరేట్ ఆస్పత్రి వారు చేసే తప్పుతో మొత్తం వైద్యరంగానికే మచ్చ వస్తోందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు సాయం చేయాలని, పొరపాట్లు జరగకుండా వైద్య సేవలందించాలని కోరారు. ఆశ వర్కర్లు సమ్మె విరమిస్తేనే.. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్లు మంత్రి లక్ష్మారెడ్డికి వినపతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఆశవ ర్కర్లు సమ్మె విరమిస్తేనే చర్చలకు పిలుస్తామని స్పష్టం చేశారు. ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్న సమయంలోనే సమ్మెకు దిగారన్నారు. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా నేరుగా సమ్మెకు ఎలా వెళతారని మంత్రి ప్రశ్నించారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. ఆ తర్వాత నల్లగొండ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి రోగిని స్వయంగా పరీక్షించారు. మెడికల్, సర్జికల్, మెటర్నిటీ వార్డులను సందర్శించారు. -
ఆశావర్కర్ల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు
వర్ని (నిజామాబాద్) : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు, దళితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్నిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు ప్రకటించింది. దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. అలాగే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు.