Ashish Pareek
-
టెక్కీ దంపతులకు చేదు అనుభవం
జైపూర్: న్యూజెర్సీలో ఒక భారతీయ జంటకు చేదు అనుభవం ఎదురైంది. తల్లి ఒడిలో సేద తీరాల్సిన ఆ చిన్నారి ప్రస్తుతం బాలల సంరక్షణ కేంద్రంలో ఉన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రాణాపాయం నుంచి బయటపడిన తమ ముద్దుల చిన్నారి తిరిగి తమ ఒడికి చేరకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందున్నారు. 2012 లో నార్వేలో ఓ భారతీయ జంటకు ఎదురైన అనుభవం లాంటిదే వీరికి ఎదురైంది. తిరిగి తమ బాబును తమ చెంతకు చేర్చాల్సింది కోరుతూ కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ కు లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే.... జైపూర్‌కు చెందిన ఆశిష్ పరీక్ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్య విదీషతో న్యూజెర్సీలో ఉంటున్న వీరికి గత అక్టోబర్‌లో అశ్విద్ పుట్టాడు. అయితే విదీష చేతిలో నుంచి అశ్విద్... ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డాడు. టీవీ స్టాండ్‌కు బలంగా తగిలి నేలపై పడడంతో చిన్నారి తలపై తీవ్రంగా గాయమైంది. దీంతో వెంటనే ఆ పసివాణ్ణి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంతో ఉండడంతో మరో ఆసుపత్రికి చికిత్స అందించారు. ఎట్టకేలకు అశ్విద్ గండం నుంచి గట్టెక్కాడు. కానీ ఇక్కడే చిన్నారి తల్లిదండ్రులకు ఇంకో చిక్కు ఎదురైంది. పిల్లవాడిని అమానుషంగా హింసించారని ఆరోపిస్తూ అమెరికా అధికారులు ఆశిష్ పరీక్, విదీషపై కేసులు నమోదు చేశారు. చికిత్స తర్వాత కోలుకున్న చిన్నారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ పరిస్థితుల్లో అతడిని తల్లిదండ్రులకు అప్పగించలేమని అధికారులు వాదిస్తున్నారు. దీంతో అశ్విద్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనలో మునిగిపోయారు. తిరిగి తమ బాబును తమకు అప్పగించాల్సింది కోరుతూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ప్రమాదవశాత్తే జరిగిందే తప్ప బాబుని హింసించలేదని అశ్విద్ బంధువు తెలిపారు. -
'మా బిడ్డను బలవంతంగా లాక్కున్నారు'
జైపూర్: తాము ఏ తప్పూ చేయకపోయినా తామేదో కావాలని చేసినట్లు భావించి అమెరికా అధికారులు తమ బిడ్డను బలవంతంగా లాక్కున్నారని, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంరక్షణ కేంద్రానికి అప్పగించారని రాజస్థాన్‌కు చెందిన దంపతులు వాపోయారు. జైపూర్ కు చెందిన దంపతులు ఆశిష్ పరీక్, విదిశా అమెరికాలోని న్యూజెర్సీ లో టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. విదిశా గత అక్టోబర్ నెలలోనే ఓ బాబుకు జన్మనిచ్చింది. గత నెలలో ఆ బాలుడు చేతిలోకి తీసుకొని ఆడిస్తుండగా చేయి జారి కిందపడ్డాడు. ఆ క్రమంలో అతడి తల టీవీ స్టాండ్ కు తగిలి అనంతరం నేలకు బలంగా తాకింది. దీంతో ఆ బాలుడిని న్యూజెర్సీలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలుడికి ప్రాణగండం తప్పింది. సురక్షితంగా కోలుకున్నాడు. అయితే, అమెరికా శిశు సంరక్షణ శాఖకు చెందిన అధికారులు మాత్రం వారు కావాలనే బాబుకు హానీ కలిగించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ వారి చేతినుంచి బిడ్డను తీసుకొని ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో ఇప్పుడు తమ బిడ్డను ఎలాగైనా తమకు ఇప్పించండని, అది కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదం మాత్రమేనని అంటున్నారు. గతంలో నార్వేలో కూడా తమ పిల్లలకు సంబంధించి భారతీయ దంపతులకు ఇలాంటి చిక్కులు ఎదురైన విషయం తెలిసిందే.