టెక్కీ దంపతులకు చేదు అనుభవం | The baby, Ashvid, was handed over by child welfare officials to foster care last week | Sakshi
Sakshi News home page

టెక్కీ దంపతులకు చేదు అనుభవం

Published Thu, Jan 14 2016 1:24 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

టెక్కీ దంపతులకు చేదు అనుభవం - Sakshi

టెక్కీ దంపతులకు చేదు అనుభవం

జైపూర్:  న్యూజెర్సీలో ఒక భారతీయ జంటకు చేదు అనుభవం ఎదురైంది.  తల్లి ఒడిలో సేద తీరాల్సిన ఆ చిన్నారి ప్రస్తుతం బాలల సంరక్షణ కేంద్రంలో ఉన్నాడు.  ఆసుపత్రిలో చికిత్స పొంది,  ప్రాణాపాయం నుంచి బయటపడిన తమ ముద్దుల చిన్నారి తిరిగి తమ ఒడికి చేరకపోవడంతో  తల్లిదండ్రులు ఆందోళన  చెందున్నారు.  2012 లో నార్వేలో ఓ భారతీయ జంటకు ఎదురైన అనుభవం లాంటిదే వీరికి ఎదురైంది. తిరిగి తమ బాబును తమ  చెంతకు చేర్చాల్సింది కోరుతూ  కేంద్రమంత్రి సుష్మ స్వరాజ్ కు లేఖ రాశారు. 
 
వివరాల్లోకి వెళితే.... జైపూర్కు చెందిన ఆశిష్ పరీక్  ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అవుట్ సోర్సింగ్  ఉద్యోగిగా  పని చేస్తున్నాడు. భార్య విదీషతో న్యూజెర్సీలో ఉంటున్న వీరికి గత అక్టోబర్లో  అశ్విద్  పుట్టాడు.  అయితే  విదీష చేతిలో నుంచి  అశ్విద్... ప్రమాదవశాత్తూ  జారి కిందపడ్డాడు. టీవీ స్టాండ్కు బలంగా  తగిలి  నేలపై పడడంతో చిన్నారి తలపై తీవ్రంగా గాయమైంది.  దీంతో వెంటనే  ఆ పసివాణ్ణి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంతో ఉండడంతో మరో ఆసుపత్రికి చికిత్స అందించారు. ఎట్టకేలకు అశ్విద్ గండం నుంచి గట్టెక్కాడు.  కానీ ఇక్కడే చిన్నారి తల్లిదండ్రులకు  ఇంకో  చిక్కు ఎదురైంది.

పిల్లవాడిని అమానుషంగా  హింసించారని ఆరోపిస్తూ  అమెరికా అధికారులు ఆశిష్ పరీక్, విదీషపై కేసులు నమోదు చేశారు.   చికిత్స తర్వాత కోలుకున్న చిన్నారిని  బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.  ఈ పరిస్థితుల్లో  అతడిని తల్లిదండ్రులకు అప్పగించలేమని అధికారులు వాదిస్తున్నారు. దీంతో అశ్విద్  తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనలో మునిగిపోయారు.  తిరిగి తమ బాబును తమకు అప్పగించాల్సింది కోరుతూ  తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ప్రమాదవశాత్తే జరిగిందే తప్ప  బాబుని హింసించలేదని అశ్విద్ బంధువు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement