Ashwani
-
ఎనిమిది కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా ఎనిమిది నూతన రైల్వేలైన్ ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సుమారు రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఎనిమిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్ కేబినెట్ సమావేశానంతరం మీడియాకు ఆ వివ రాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులన్నీ 2030–31 కల్లా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.⇒ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహా రాష్ట్ర, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రా ల్లోని 14 జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్టుల నిర్మా ణం జరుగుతుంది. అందులో భాగంగానే కొత్తగా 64 రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం, మల్కన్‌గిరితోపాటు ఆరు ఆకాంక్ష జిల్లాల్లోని 510 గ్రామాలతోపాటు దాదాపు 40 లక్షల మంది జనాభాకు రైల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ⇒ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి మల్క న్గిరి–పాండురంగాపురం (భద్రాచలం మీదుగా) 173.61 కి.మీ పొడవున నూతన రైల్వేలైన్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాతోపాటు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలు ఉన్నాయి. ప్రముఖ పుణ్య క్షేత్రమైన భద్రాచలాన్ని ప్రధాన రైల్వేలైన్‌తో అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడనుంది. వీటితోపాటు తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన అజంతా గుహలను రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా...మల్కన్‌గిరి నుంచి పాండురంగాపురం వరకు గత ఏడాది ఫైనల్ లొకేషన్స్ సర్వే మంజూరైంది. ఆ వెంటనే సర్వే పనులు పూర్తి చేయడంతో కేంద్ర ప్రభు త్వం ఇప్పుడు ఆ మార్గాన్ని నిర్మించేందుకు సిద్ధప డింది. ఈ కొత్త రైల్వేలైన్ వల్ల భద్రాద్రి కొత్తగూడెంలోని రైలు అనుసంధానం లేని కొత్త ప్రాంతాలకు రైల్వే వసతి ఏర్పడుతుంది. సరుకు రవాణా ప్రధాన లక్ష్యంగానే ఇది నిర్మిస్తున్నప్పటికీ ప్రయాణికుల రైలు కూడా దీని మీదుగా నడపనున్నట్టు అధికా రులు చెబుతున్నారు. ఇందుకు దాదాపు రూ. 3,592 కోట్లు ఖర్చు చేయబోతోంది.జునాగఢ్ నుంచి మల్కన్‌గరి, మల్కన్‌గిరి నుంచి పాండురంగాపురం వరకు... ఈ రెండు లైన్లు కలిపి చూస్తే అయ్యే వ్యయం రూ.7,383 కోట్లు. ఈ ప్రాజెక్టు కోసం 1697 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. సెంట్రల్ సౌత్ ఇండియాలోని పవర్ ప్లాంట్లకు మహానది కోల్డ్‌ఫీల్డ్‌కు ఇది దగ్గర దారి కాబోతోంది. బస్తర్ రీజియన్‌కు మధ్య 124 కిలోమీటర్ల దూరాభారాన్ని కూడా ఇది తగ్గించనుంది. -
ప్రేక్షకురాలిపైనే సినిమా!
సొంతిల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్.. ఈ మూడూ ఉంటే చాలు లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది అంటారు ‘ఇన్ఫోసిస్’ కంపెనీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి. సొంతిల్లు అన్నారు కానీ బంగళా అనలేదు. కారు అన్నారు కానీ ఆడీనో, బిఎండబ్ల్యూనో అనలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అన్నారు కానీ కోట్లు, లక్షల కోట్లు అనలేదు. నెల నెలా అద్దె కట్టే అవసరం లేకుండా సొంత ఇల్లు, ఏ వేళనైనా ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా చిన్న కారు, ఊహించని ఆర్థిక అవసరాలకు ఎవరి దగ్గరా చెయ్యి చాచే అవసరం లేకుండా కొంత బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలని సుధామూర్తి మాటల్లోని అంతరార్థం. ఇంట్లో మొక్కల్ని పెంచడం; కారులో భర్త పిల్లల్తో కలిసి ప్రకృతి అందాలను వీక్షించడానికి వెళ్లడం ఆమెకు ఇష్టమైన విషయాలు. ఇక సినిమాలంటే ఎంతిష్టమో చెప్పేపనే లేదు. రోజుకో సినిమానైనా చూడందే ఆమెకు నిద్రపట్టదు. ఏడాదికి కనీసం 365 సినిమాలు చూస్తారు సుధామూర్తి. ఈ 69 ఏళ్ల వయసులోనూ ఆమె సినిమాలను వదిలిపెట్టనే లేదు. ఇంతగా సినిమాలను ఇష్టపడే, ప్రేమించే సుధామూర్తి పైనే ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది! సుధామూర్తి దంపతుల జీవితకథను అశ్వినీ అయ్యర్ తివారి ఒక స్ఫూర్తివంతమైన సినిమాగా తియ్యబోతున్నారు. ‘బరేలీ కీ బర్ఫీ’, ‘నీల్ బత్తి సనాటా’ చిత్రాల దర్శకురాలే అశ్వనీ అయ్యర్. 2017లో వచ్చిన ‘బరేలీ కీ బర్ఫీ’ రొమాంటిక్ కామెడీ. అంతకుముందు ఏడాది వచ్చిన ‘నీల్ బత్తి సనాటా’ కామెడీ డ్రామా. సుధామూర్తితో కలిసి దిగిన ఫొటోను అశ్వినీ అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘నిజాయితీతో కూడి ఈ ఆలూమగల జీవితం నాకు పెద్ద ఇన్స్పిరేషన్’’ అని రాశారు. అశ్వినీ అయ్యర్ తీయబోయే ఈ సినిమా బహుశా.. సుధామూర్తి దంపతులకు సొంతిల్లు, కారు, బ్యాంకు బ్యాలెన్సు లేని కాలం నుంచి మొదలవొచ్చు. ►సినిమాలను ఎంతగానో ఇష్టపడే, ప్రేమించే సుధామూర్తి పైనే ఇప్పుడొక సినిమా రాబోతోంది. కేవలం రెండు చిత్రాలతో ప్రసిద్ధురాలైన అశ్వినీ అయ్యర్ తివారీ ఆ సినిమాను తీయబోతున్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘యం6’
విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై జైరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం ‘యం6’. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ - ‘సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే ఈ రంగానికి వచ్చాను. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీని స్థాపించి నా తమ్ముడు ధ్రువను హీరోగా పరిచయం చేస్తూ ‘యం6’ చిత్రాన్ని నిర్మించాను. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమాను నిర్మించాం. ‘యం6’ సినిమా విషయానికి వస్తే దర్శకుడు జైరాం వర్మ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలైట్స్‌గా నిలుస్తాయి. ఈ సినిమాకి ‘యం6’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకుల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. -
'ఏ' సర్టిఫికెట్తో వస్తున్న జయిక్కిర కుదిర
సాక్షి, చెన్నై: లవ్, కామెడీ, గ్లామర్ ఈ మూడు అంశాలు ఉంటేనే నేటి యువతకు చిత్రాలు నచ్చుతున్నాయి. అలాంటి అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం జయిక్కిర కుదిరై అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శక్తి ఎన్.చిదంబరం. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సినిమాప్యారడైజ్, చరణ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొంత గ్యాప్ తరువాత జీవన్ హీరోగా నటిస్తున్న ఇందులో ఆయనకు జంటగా డింపుల్ శోబాడే, సాక్షీఅగర్వాల్, అశ్వని ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో జయప్రకాశ్, తలైవాసల్ విజయ్, కోవైసరళ, రవిమరియ, సింగంపులి, చిత్రాలక్ష్మణ్, లీవింగ్‌స్టన్, రమేశ్‌ఖన్నా, మదన్ బాబు, యోగిబాబు, భడవాగోపి, టీపీ.గజేంద్రన్, పాండు, ఏఎల్.అళగప్పన్, రోబోశంకర్, ఇమాన్ అన్నాచ్చి, దీప, రామానుజం, వైయాపురి, ఆదవన్ నటిస్తున్నారు. అంజి సంగీతం, కేఆర్.కవిన్ శివ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు శక్తి.ఎన్.చిదంబరం తెలుపుతూ జయిక్కిర కుదిరై చిత్రం జనరంజకమైన అంశాలతో ఆరంభం నుంచి, చివరి వరకూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుందన్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. -
కేసీఆర్ తో రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ భేటీ
వచ్చే నెలలో కరీంనగర్ లో పాస్ పోర్టు సేవాకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ అశ్శిని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాస్ పోర్టు జారీలో కొత్తగా వచ్చిన సంస్కరణలను కేసీఆర్ కి వివరించారు. తర్వరలో వరంగల్ లో కూడా పాస్ పోర్టు కార్యాలయన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులను కోరారు. తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
విభిన్న డిజైన్ ఆభరణాలతో
DESIRE మెరిసిపోయూరు నటి అశ్వని, మోడల్స్. జిగేల్వునే నెక్లెస్‌లు ధరించి అలరించారు. ఈ నెల 22 నుంచి తాజ్‌కృష్ణా హోటల్లో డి జైర్ ఎక్స్పో జరగనుంది. ఈ సందర్భంగా బంజారాహిల్స్ వ్యూక్స్ మీడియా సెంటర్లో సోమవారం విలేకరుల సవూవేశం నిర్వహించారు. 2 రోజుల ఈ ఎక్స్‌పోలో జాతీయ, అంతర్జాతీయ డిజైనర్లు పాల్గొంటారని, అత్యాధునిక దుస్తులు, ఇంటీరియర్స్ ప్రదర్శిస్తారని నిర్వాహకురాలు అనితా అగర్వాల్ తెలిపారు. ఎక్స్పో బ్రోచర్‌ని ఆవిష్కరించారు. సిటీ ప్లస్