Assam assembly polls
-
బెంగాల్, అసోం తొలిదశ పోలింగ్
-
బీజేపీ కార్యకర్తలపై దాడి
-
బెంగాల్, అసోంలో ముగిసిన తొలి దశ
► ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్ పశ్చిమ బెంగాల్ 30, అసోంలో 47 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్లో 77.99 శాతం పోలింగ్ నమోదు అసోంలో సాయంత్రం 5 గంటల వరకు 71.62 శాతం పోలింగ్ ► పశ్చిమ బెంగాల్, అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ బెంగాల్లో 30, అసోంలో 47 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బెంగాల్లో సాయంత్రం 4 గంటల వరకు 70.17 శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో సాయంత్రం 4 గంటల వరకు 62.36 శాతం పోలింగ్ నమోదు. ► సువేందు సోదరుడి కారుపై దాడి, ఒక కార్యకర్త హత్య పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కేశియారి ప్రాంతంలో బీజేపీ కార్యకర్త మంగల్ సోరెన్ (35) దారుణ హత్యకు గురయ్యాడు. పుర్బా మేదినిపూర్ జిల్లా సత్సతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొంటై నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి కారుపై దాడి జరిగింది. అతడి కారును అడ్డగించి ధ్వంసం చేశారు. కారు డ్రైవర్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి సౌమెందు అధికారి సురక్షితంగా బయటపడ్డాడు. ► బెంగాల్, అసోంలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. ఎన్నికల అధికారులు పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బెంగాల్లో ఉదయం 11 గంటల వరకు 24.61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అసోంలో ఉదయం11 గంటల వరకు 24.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అసోంలోని డిబ్రుగఢ్‌లో సీఎం సర్వానంద సోనోవాల్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో వందకు పైగా సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ►బెంగాల్, అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్లో ఉదయం 9 గంటల వరకు 7.72 శాతం పోలింగ్ నమోదు నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అసోంలో ఉదయం 9 గంటల వరకు 8.84 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటుర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ►బెంగాల్లో 5 జిల్లాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. తొలిదశలో బరిలో 191 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తొలిదశలో 10,288 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.73.80 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ►అసోంలో 12 జిల్లాల్లో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. తొలిదశలో బరిలో 264 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి దశలో 11,537 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.50 శాతం పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 81.09 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిదశలో మజూలి నుంచి బరిలో సీఎం సర్వానంద సోనోవాల్, జోర్హత్ నుంచి స్పీకర్ హితేంద్రనాథ్ బరిలో ఉన్నారు. ►పశ్చిమబెంగాల్లో తొలిదశ ఎన్నికల వేళ హింస చెలరేగింది. ఖేజురిలో బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. పటాష్‌పూర్‌లో భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. కోల్‌కతాలో 22 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ►పురులియాలో బస్సులో మంటలు చెలరేగాయి. ఎన్నికల సిబ్బందికి ఆహారం సరఫరా చేస్తున్న బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో మంటలు చెలరేగిన ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. కోల్‌కతా/గౌహటి: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమబెంగాల్‌తో పాటు అసోం అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో 30, అసోంలో 47 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. అస్పాం తొలిదశ ఎన్నికల పోలింగ్‌లో సీఎం సర్వానంద సోనోవాల్, స్పీకర్ హితేంద్రనాథ్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. బరిలో ఉన్న ప్రముఖులు పశ్చిమబెంగాల్లోని 30 స్థానాల్లో కొందరి అభ్యర్థిత్వం ఆసక్తి రేపుతోంది. పురూలియా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ ఇటీవల బీజేపీ గూటికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీ మంత్రి శాంతి రామ్ మెహతా పోటీ పడుతున్నారు. ఖరగ్‌పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. దినేన్ రాయ్ (టీఎంసీ), తపన్ భూహియా (బీజేపీ), ఎస్.కె.సద్దామ్ అలీ (సీపీఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది. అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు. -
అసోం పోల్స్: అఖిల్ గొగోయ్ సంచలన ఆరోపణలు
సాక్షి,గౌహతి: జైల్లో తనను మానసికంగా, శారీరకంగా హింసించారని యాంటీ సీఏఏ యాక్టివిస్టు అఖిల్ గొగోయ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో చేరితే తనకు వెంటనే బెయిల్ ఇస్తామని ఎన్ఐఏ ఆశచూపిందంటూ అఖిల్ లేఖ రాశారని ఆయనకు చెందిన రైజోర్ దళ్ వెల్లడించింది. కోర్టు అనుమతిలేకుండా అఖిల్‌ను 2019 డిసెంబర్లో ఢిల్లీకి తీసుకుపోయారని తెలిపింది. అక్కడ ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌లో తనను బంధించారని, గాఢమైన చలిలో నేలపై పడుకోవాల్సివచ్చిందని అఖిల్ లేఖలో తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లో చేరితే బెయిల్ పొందవచ్చన్న ఆఫర్‌ను తిరస్కరించగా కావాలంటే అసెంబ్లీకి పోటీ చేసి మంత్రికావచ్చని ఆశ చూపారన్నారు. అంతేకాకుండా కేఎంఎస్ఎస్(కృషిక్ ముక్తి సంగ్రామ్ సమితి)ని వీడి ఒక ఎన్జీఓ ఆరంభించి, అసోంలో క్రిస్టియన్ మతమార్పిడులకు వ్యతిరేకంగా పనిచేస్తే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారన్నారు. ఇవేవీ తాను అంగీకరించకపోవడంతో అసోం సీఎం మరియు ఒక ప్రభావవంతమైన మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని, దీన్ని కూడా తాను వ్యతిరేకించానని తెలిపారు. దీంతో తనపై ఎన్ఐఏ తీవ్రమైన ఆరోపణలతో కూడిన కేసులు పెట్టిందన్నారు. తనను చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయని, పదేళ్లు జైలు జీవితం గడపాలని భయపెట్టారని తెలిపారు. కోవిడ్ కారణంగా అఖిల్‌ను గౌహతి మెడికల్ కాలేజీలో చేర్చారు. యాంటీ సీఏఏ ఆందోళనల్లో పాల్గొన్నాడంటూ అఖిల్‌ను ఎన్ఐఏ 2019లో అరెస్టు చేసింది. అయితే అఖిల్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఇవన్నీ చౌకబారు రాజకీయాలని బీజేపీ ప్రతినిధి రూపమ్ గోస్వామి ఆరోపించారు. అసోం ఎన్నికలకు ముందు ఈ లేఖ విడుదల కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అఖిల్‌కు ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు. కాగా రేజర్ పార్టీ అసెంబ్లీ జనతా పరిషత్ (ఏజేపీ) తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుండి పోటీ చేస్తున్న గొగోయ్ శివసాగర్ సీటు నుండి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. -
అసోంలో ఏజీపీ ఎదురీత!
2009 ఫలితాలే పునరావృతమవుతాయని కాంగ్రెస్ ఆశలు ఎలక్షన్ సెల్: అసోంలో ఈసారి కూడా 2009 ఎన్నికల పరిిస్థితులే కనిపిస్తున్నాయి. అసోం గణపరిషత్ (ఏజీపీ) పతనమే కాంగ్రెస్‌కు వరంగా మారింది. విద్యార్థి నేతగా ఉద్యమాలకు సారథ్యం వహించి, ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏజీపీ అధినేత ప్రఫుల్లకుమార్ మహంతా కొన్నేళ్లుగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రాంతీయ సెంటి మెంటుతో 1985లో పార్టీని పెట్టిన రెండు నెలల్లోనే అధికారాన్ని దక్కించుకున్న ఏజీపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమై, ప్రాభవాన్ని కోల్పోయింది. ఏజీపీ ఆవిర్భావం ముందు వరకు అధికారాన్ని సాగించిన కాంగ్రెస్, అసోంలో మళ్లీ పట్టు పెంచుకుని అధికారంలోకి రాగలిగింది. గత పరాజయాలతో గుణపాఠాలు నేర్చుకోని ఏజీపీ నేటికీ ఏటికి ఎదురీదుతోంది. అందుకే, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 2009 నాటి కంటే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంటుందని ముఖ్య మంత్రి తరుణ్ గొగోయ్ ధీమాగా చెబుతున్నారు. 2009 నాటి కంటే, కాంగ్రెస్‌కు ఈసారి తక్కువ లోక్‌సభ స్థానాలు వస్తే, ముఖ్యమంత్రి పదవినే వదులుకుంటానని మరీ సవాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో 30 శాతం నుంచి 56 శాతం మేరకు ముస్లిం ఓటర్లు ఉండటం కాంగ్రెస్‌కు సానుకూలాంశం. అయితే, వ్యాపార వేత్త మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ స్థాపించిన ఏఐయూడీఎఫ్ ముస్లింలలో క్రమంగా పట్టు పెంచుకుంటుండటం కాంగ్రెస్‌ను కలవరపెడు తోంది. సంప్రదాయకంగా కాంగ్రెస్ వైపే ఉంటూ వచ్చిన ఆదివాసీలు సైతం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలపై భయంతో బీజేపీకి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఈసారి ముస్లింలు, ఆదివాసీ తేయాకు కార్మికుల మద్దతు ఆశించిన స్థాయిలో లభించక పోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో 15 శాతం నుంచి 18 శాతం వరకు ఉన్న ఆదివాసీలు అక్కడి ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ మోడీ ప్రభావాన్ని ఎంతగా నమ్ముకున్నా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి తగిన కేడర్ లేకపోవడంతో కాంగ్రెస్‌ను అధిగమించే అవకాశాలు లేవని విశ్లేషకుల అంచనా. ముస్లిం ఓట్లలో చీలికను నివారించడం ద్వారా బీజేపీని అడ్డుకునేందుకు ఏఐయూ డీఎఫ్తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకునే అవకాశాలూ లేకపోలేదు. వచ్చేనెల 7, 12, 24 తేదీల్లో అసోంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మా మద్దతు... బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేక వర్గం నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. ప్రధానమంత్రి పదవికి నరేంద్రమోడీనే సరైన వ్యక్తి అని ఆ వర్గం నిర్ధారించింది. మోడీ ప్రధాని కావడం కోసం తమ వర్గం వారంతా బీజేపీకే ఓటేయాలని నిర్ణయించింది. ఎవరా వర్గం అనుకుంటున్నారా? విషయమేంటంటే.. దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్స్ అంతా ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటెయ్యాలి?, ఏ నాయకుడికి మద్దతివ్వాలి అనే అంశంపై మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీ, అరవింద్ కేజ్రీవాల్, ములాయంసింగ్ యాదవ్, మాయావతి తదితర నేతల గురించి చర్చించారు. చివరకు ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్రమోడీనే సమర్థుడైన నాయకుడనే నిర్ణయానికి వచ్చారు. మోడీని ప్రధానిని చేయడం కోసం బీజేపీకే ఓటేయాలని డిసైడయ్యారు. కొంధొమాల్లో కోటీశ్వరులు ఒడిశాలో పేదరికంతో అల్లాడే కొంధొమాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలూ కోటీశ్వరులనే బరిలోకి దించాయి. బీజేడీ తరఫున పోటీ చేస్తున్న హేమేంద్రచంద్ర సింగ్ ఆస్తుల విలువ రూ.48.72 కోట్లు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న వారిలో ఆయనే అత్యంత సంపన్నుడు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో తనకు, తన భార్య ప్రయూషా రాజేశ్వరి సింగ్‌కు రూ.48.72 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులు ఉన్నట్లు హేమేంద్ర వెల్లడించారు. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన మాజీ మంత్రి హరిహర కరణ్ ఆస్తుల విలువ రూ.9.62 కోట్లు. బీజేపీ అభ్యర్థి సుకాంత పాణిగ్రాహికి అతి తక్కువగా రూ.5.08 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. 2004తో పోలిస్తే 2009లో పార్టీల ఓట్ల శాతంలో ఎంత తేడా..