ముగిసిన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వీరభద్రస్వామి, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ ఎమ్మెల్సీలు గుమ్మడి సంధ్యారాణి, తిప్పేస్వామి, వీవీవీ చౌదరి సోమవారం ఉదయం సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరూ సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి సమక్షంలో సభ్యులుగా ప్రమాణం చేశారు.
తెలంగాణ శాసనమండలి సభ్యునిగా ఎ.రామచంద్రరావు మండలి చైర్మన్ స్వామిగౌడ్ సమక్షంలో ప్రమాణం చేశారు.