Assembly discussion
-
ఏ ప్రయోజనం ఆశించి విభజిస్తున్నారు?
-
ఏ ప్రయోజనం ఆశించి విభజిస్తున్నారు?
కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎండగట్టారు. అసలది బిల్లా.. ముసాయిదానా ఏంటన్నది స్పష్టతే లేదని అన్నారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో మళ్లీ సీఎం కిరణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ''అసెంబ్లీకి పంపిన బిల్లులో సవాలక్ష లోపాలున్నాయి. రాష్ట్రపంతి పంపినదాన్ని బిల్లు అన్నారు. దీన్నే హోం శాఖ అధికారులు ముసాయిదా అంటున్నారు. రాష్ట్రపతికి ముసాయిదా బిల్లు ఎలా పంపుతారు? హోం శాఖ కార్యదర్శి సరైన సమాచారం ఇవ్వలేదు. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని మాకు వెల్లడించలేదు. అడిగిన సమాచారం ఇవ్వకుండా సమాధానం దటేశారు. విభజన బిల్లు పట్ల నెహ్రూ అభిప్రాయాన్ని పాటించడంలేదు. తప్పుల తడక బిల్లును మేం ఎలా చూడాలి?'' అని అడిగారు. ''ఏ ప్రయోజనం ఆశించి ఈ విభజన చేస్తున్నారు? కేంద్రం ఈ బిల్లులో అభిప్రాయాలేమీ చెప్పలేదు. ఈ బిల్లుపై మేమెలా అభిప్రాయాలు చెప్పాలి'' అని సీఎం అడిగారు. ఆర్టికల్ 371డిని ఉదహరిస్తూ, ఓపెన్ కేటగిరీ ప్రకారం అయితే తెలంగాణ వాళ్లకు సీట్లెలా వస్తాయని ప్రశ్నించారు. వెనకబడిన ప్రాంతాలను విశాల దృక్పథంతో అభివృద్ధి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా విభజన మంచిది కాదని, తెలంగాణ సమస్య ఒక్క రాష్ట్రానికి సబంధించినది కాదని, నీళ్ల విషయంలో కేంద్రం పెత్తనం ఉంటుందని ఆయన చెప్పారు. ఇన్ని సమస్యలున్న విభజన బిల్లు అసలు అవసరమా అని ప్రశ్నించారు. -
చర్చకు మరో రెండు వారాల గడువు!
-
చర్చకు మరో రెండు వారాల గడువు!
రాష్ట్రపతికి నివేదించిన కేంద్ర హోంశాఖ నేడో, రేపో గడువు పొడిగింపు సమాచారం సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర పున ర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు మరో రెండు వారాల గడువు ఇచ్చేందుకు కేంద్ర హోం శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రపతి వాస్తవంగా ఇచ్చిన గడువు ఈ నెల 23తో ముగియనుండగా.. చర్చకు మరో నెల రోజులు సమయం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అరుుతే రెండు వారాలు మాత్రమే గడువు పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ హోం శాఖ సోమవారం రాష్ట్రపతికి నివేదించినట్లు రాష్ట్ర అధికారులకు సమాచారం అందింది. గడువు పొడిగించాలని కోరుతూ సీఎస్ రాసిన లేఖతో పాటు మరో అనుబంధ లేఖను కూడా రాష్ట్రపతికి పంపింది. గడువు పెంచుతూ మంగళ లేదా బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఇలావుండగా.. మంగళవారం ఢిల్లీలో జరగనున్న సిబ్బంది శిక్షణ విభాగం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎస్, ఆ సమావేశానంతరం గడువు అంశంపై హోంశాఖ ముఖ్య అధికారులతో సమావేశమవుతారని తెలిసింది. రాజ్యసభ ఎన్నికల కోసమేనా..! రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల గండాన్ని గట్టెక్కించుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్చ గడువు పొడిగించాలన్న ఆలోచన చేసినట్టు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. బిల్లుపై చర్చకు గడువును 2 వారాలు పొడిగిస్తే అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 6 వరకు కొనసాగే అవకాశాలున్నాయని సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురికంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉంటే వచ్చే నెల 7న పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతల మద్దతు తప్పనిసరి. అందువల్లే వారు కోరిన విధంగా బిల్లుపై చర్చకు గడువు పొడిగించాలని అధిష్టానం నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
చర్చ పొడిగిస్తే ప్రతిఘటన: కోదండరాం
సీమాంధ్రుల కుట్రలో కేంద్రం భాగస్వామి అయినట్టే అసెంబ్లీ ముట్టడితో విధ్వంసం: టీజేఏసీ చైర్మన్ కోదండరాం తాండూరు/వికారాబాద్ న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుపై ఈనెల 23వ తేదీలోగా అసెంబ్లీలో చర్చను ముగించాలని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. అలా కాకుండా సీమాంధ్రనాయకుల లాబీయింగ్, కుట్రలకు లొంగి కేంద్రం మరో పదిరోజుల గడువు పొడిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవేళ చర్చకు గడువు ఇచ్చి సరైన సమయానికి బిల్లును పంపకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా కుట్రలో భాగస్వామి అయినట్టేనని చెప్పారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా తాండూరు, వికారాబాద్‌లలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 21వ తేదీన సీమాంధ్రులు పెద్ద ఎత్తుగడతోనే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారని తెలిపారు. దీనివల్ల ైెహ దరాబాద్‌లో అల్లర్లు సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అనుమతి ఇవ్వరాదని కోరారు. అంతకుముందు కోదండరాం తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ రెండేళ్లు సరిపోతుందని, పదేళ్లు అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ సీమాంధ్రుల ఆస్తులపై గానీ, వారిైపైగానీ ఉద్యమకారులు దాడులు చేయలేదని, అలాంటప్పుడు శాంతిభద్రతల విషయం గవర్నరుకు అప్పగించడం ఎందుకని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తాము అడ్డు కాదని, ఇస్తే ఇవ్వండని చెప్పిన కొన్ని పార్టీలు నేడు వాటి మనుగడ కోసమే కొత్త నాటకాలాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయాక కూడా సీమాంధ్రులు ఇంకా దానిని ఆపుతామనడం పిల్లచేష్టలని పేర్కొన్నారు. బిల్లు ప్రతులను భోగిమంటల్లో తగులబెట్టడం సరైనపద్ధతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగే పరిస్థితి వస్తుందన్నారు. దూరదృష్టి క లిగిన నాయకులు ఇలాంటి పనులు చేయకూడదన్నారు. తెలంగాణకు, సీమాంధ్రకు హైకోర్టులు వేర్వేరుగా ఉండాలన్నారు. పింఛన్లపంపిణీ,కార్పొరేషన్ల ఏర్పాటు, ఉమ్మడి పరీక్షలు, తదితర విషయాలపై అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీకి తామిచ్చిన సమగ్రమైన నివేదిక తెలంగాణ బిల్లు రూపకల్పనలో ఎంతో సహకరించిందని, అక్కడ తమదే బెస్టు రిపోర్టు అని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక వికారాబాద్ జిల్లా కేంద్రం అవుతుందని హామీ ఇచ్చారు.