Assembly history
-
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో దుర్దినం
దోచుకునేందుకే బిల్లుల సవరణ ప్రధాన ప్రతిపక్షం లేకుండా బిల్లులు ఆమోదించిన ఘనత చంద్రబాబుదే ధ్వజమెత్తిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళగిరి : ప్రధాన ప్రతిపక్షం లేకుండా రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే కీలక బిల్లులను ఆమోదించుకోవడం దేశచరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని, రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో సోమవారం ఒక దుర్దినమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ అతికీలకమైన ఇన్ఫ్ట్రాక్స్ర్ డెవ లప్మెంట్ 2001 బిల్లులో మార్పులు చేర్పులు చేయడం వెనుక ప్రభుత్వ భూములను తనకు ఇష్టం వచ్చిన వారికి (విదేశీసంస్థలకు) కట్టబెట్టి దోచుకునే కుట్ర దాగివుందని విమర్శించారు. ఇప్పటివరకు రాజధాని ముసుగులో రైతులు, కౌలు రైతులు, కూలీలు, చేతివృత్తిదారులను మోసగించిన చంద్రబాబు బిల్లులను సవరించుట ద్వారా తెలుగజాతి యావత్తును ఆయా విదేశీసంస్థలకు 99 సంవత్సారాలు పాటు బానిసలుగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఇలాంటి బిల్లుల సవరణ వల్ల అధికారంలోకి ఎవరు వచ్చినా 99 సంవత్సరాల పాటు భూములు తీసుకున్న వారికే సర్వహక్కులు, అధికారాలు దక్కుతాయని, అప్పుడు ఎవరూ ఏమి చేయలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అసలైన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లక్షల కోట్ల దోపిడీకి తెచ్చిన బిల్లును వైఎస్సార్ సీపీ కోర్టును ఆశ్రయించి అయినా అడ్డుకుంటుందన్నారు. విదేశీయులకు ఇక కప్పం కట్టాల్సిందే.. ఇక రాజధాని ప్రాంతంలో చిన్న ఇళ్ళు నిర్మించాలన్నా, నీరు తాగాలన్నా, కనీసం గాలి పీల్చాలన్నా విదేశీసంస్థలకు డెవలప్మెంట్ చార్జీలు, యూజర్ చార్జీల పేరుతో కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో ఇరుక్కుపోయిన అధికార పార్టీ నేతలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అవుటర్ రింగ్‌రోడ్డు పేరుతో మరో 8 వేల ఎకరాలను భూసేకరణ చేస్తామని మంత్రి నారాయణ చెప్పడం ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా పేరొందిన గుంటూరు, కృష్ణా జిల్లాలలో పంటలను లేకుండా చేయడమేనన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలన్నింటిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. -
10న రాష్ట్ర బంద్
- ప్రతిపక్షం మొత్తాన్నీ సస్పెండ్ చేస్తారా?: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ - అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు - అధికారపక్షం నిరంకుశంగా వ్యవహరిస్తోంది - నేటి నుంచి రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలన్నందుకు ప్రతిపక్షాలన్నింటినీ సస్పెండ్ చేసిన ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్టు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం విపక్షాల సభ్యులను సమావేశాలు మొత్తానికీ సస్పెండ్ చేసిన ఘటనలు చరిత్రలోనే లేవని, ఇది శాసనసభ చరిత్రలో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, దాసోజు శ్రవణ్, వేణుగోపాల్, అద్దంకి దయాకర్లతో కలసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రూ.లక్షలోపు పంటరుణాలను మాఫీ చేస్తామన్న హామీని అమలుచేయాలని కోరడమే తప్పు అన్నట్టుగా అధికార టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఒకేసారి మొత్తం రుణమాఫీ చేయాలని కోరితే శాసనసభలో ఉన్న ప్రతిపక్షాల సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. ఇలా మొత్తం ప్రతిపక్ష సభ్యులను, సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేసిన ఘట నలు చరిత్రలోనే లేవని.. సభ చరిత్రలో ఇది బ్లాక్‌డే(చీకటిరోజు) అని ఉత్తమ్ వ్యాఖ్యానిం చారు. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, ఒకేసారి మొత్తం రుణమాఫీ చేయాలని కోరితే ప్రభుత్వం భయపడుతోందన్నారు. సభను వాయిదా వేసుకుని ఒకసారి, విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి మరోసారి ప్రభుత్వం పారిపోతోందన్నారు. ఎన్నికల్లో చెప్పిన విషయాన్నే అమలుచేయాలని కోరితే.. అమలు సాధ్యం కాని కోరిక అని కేసీఆర్ ఎలా మాట్లాడతారని నిలదీశారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు మద్దతు ధర, బోనస్‌ను అడిగామని... వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రతిపక్షం గొంతును నొక్కుతోందన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 10న బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుతూ, రైతుల్లో భరోసా కల్పించడానికి ఈ నెల 6 నుంచి జిల్లాల్లో రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 6న మహబూబ్‌నగర్, 7న మెదక్, 8న ఖమ్మం, 9న వరంగల్, 11న నిజామాబాద్ జిల్లాల్లో యాత్ర నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాలన్నీ కలసి ఈ నెల 10న బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఉండవనుకుంటే... ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్ర సమస్యల్లోకి కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. పాలకుల చేతకానితనం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. -
అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు: ఎర్రబెల్లి
-
అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు: ఎర్రబెల్లి
కిందపడేసి కొట్టారు: ఎర్రబెల్లి హైదరాబాద్: తెలంగాణ ఉభయసభల్లో అధికారపక్షం వ్యవహరించిన తీరును టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు తప్పుబట్టారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజన వ్యాఖ్యానించారు. తమ పార్టీ సభ్యులపై టీఆర్ఎస్ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. తమ సభ్యులను కిందపడేసి కొట్టారని చెప్పారు. టీఆర్ఎస్ గుండాలు తమపై దాడి చేయడం ప్రజాస్వామ్యం విలువలకు గొడ్డలిపెట్టు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ టీఆర్ఎస్ గుండాల సభగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమపై దాడి చేసిన వారిని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకునేవరకు అసెంబ్లీని నడవనీయబోమన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.