
అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు: ఎర్రబెల్లి
కిందపడేసి కొట్టారు: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ఉభయసభల్లో అధికారపక్షం వ్యవహరించిన తీరును టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు తప్పుబట్టారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజన వ్యాఖ్యానించారు. తమ పార్టీ సభ్యులపై టీఆర్ఎస్ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. తమ సభ్యులను కిందపడేసి కొట్టారని చెప్పారు.
టీఆర్ఎస్ గుండాలు తమపై దాడి చేయడం ప్రజాస్వామ్యం విలువలకు గొడ్డలిపెట్టు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ టీఆర్ఎస్ గుండాల సభగా మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమపై దాడి చేసిన వారిని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకునేవరకు అసెంబ్లీని నడవనీయబోమన్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.