‘ఓపెన్ ’గా మాస్ కాపీయింగ్
పేపర్ ఇచ్చి 10 నిమిషాలు కాకముందే కాపీ కొట్టుడు షురూ..!
రంగశాయిపేట హైస్కూల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షల దుస్థితి
కరీమాబాద్ : తెలంగాణ విద్యాశాఖ ద్వారా నడుస్తున్న ఓపెన్ స్కూల్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓపెన్ ఇంటర్ పరీక్ష సెంటర్లో మొదటి రోజు తెలుగు, హిందీ పరీక్ష రాసేవారు 176 మంది వివిధ మండలాలకు చెందిన వారున్నా రు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. కాగా పరీక్ష రాసే అభ్యర్థులను గేటు ముందు సంబంధిత సిబ్బంది చెక్ చేసి లోపలికి పంపించారు. అయితే పరీక్ష హాల్లో పరీక్ష పేపర్లు ఇచ్చి పది నిమిషాలు కూడా కాలేదు.. కొందరు అభ్యర్థులు తమ వద్ద ఉన్న చిట్టీలను బయటికి తీసి రాయడం మొదలుపెట్టారు. ఇంకాకొందరు డెస్క్ లోపల నుంచి చిట్టీలు తీయడం కనిపిం చింది. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలంటే అంతా ‘ఓపెన్’ అన్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని ఇన్విజిలేట ర్లు గమనించకపోవడమో.. లేదా చూసీచూడనట్లువదిలేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎలాంటి కాపీరుుంగ్ జరగలేదు : శ్రీనివాస్‌రెడ్డి చీఫ్ కస్టోడియన్
రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఎలాంటి కాపీరుుంగ్ జరగలేదు. ప్రతి పరీక్ష హాల్‌కు వెళ్లి ఎవరి వద్దరుునా చిట్టీ లు, బుక్స్ ఉంటే స్వాధీనం చేసుకున్నాం. స్ట్రిక్ట్‌గానే చూశాం. డిప్యూటీ డీఈఓ వాసంతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.