ASSINED LANDS
-
అమరావతిలో టీడీపీ అసైన్డ్ దందా
-
అసైన్డ్ భూములకు హక్కులపై మరింత స్పష్టత
-
ఆంధ్రప్రదేశ్‌లో మారిన అసైన్డ్ భూముల తలరాత.. భూములపై పేదలకు సంపూర్ణ హక్కులు..ఇంకా ఇతర అప్డేట్స్
-
అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
‘అసైన్డ్’ బదలాయింపులో ప్రజలకు మేలు జరగాలి
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరిగి, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా అసైన్డ్ భూముల బదలాయింపునకు మెరుగైన సిఫారసులు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేలను కోరారు. అసైన్డ్ భూములపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం శుక్రవారం మంగళగిరిలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం చట్టాలను ప్రభుత్వం కాలానుగుణంగా సమీక్షించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరువిడతల భూ పంపిణీకి తాను నేతృత్వం వహించానని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు భూమి మరింత అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం అన్నివిధాలా కృషిచేస్తున్నారని తెలిపారు. భూమి వ్యవసాయం, ఇతర రంగాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. వ్యవసాయ భూమి తమ చేతుల్లో ఉంటే రైతుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, అదే ఆత్మవిశ్వాసం అసైన్డ్ భూములున్నవారికి సైతం కలిగించేలా కమిటీ కృషిచేయాలని కోరారు. గతంలో మాదిరిగా గ్రామాల్లో పెత్తందారులు పేదవర్గాల నుంచి భూములు లాక్కునేందుకు వీల్లేదన్నారు. అసైన్మెంట్దారులైన పేదవారికి బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పక్క రాష్ట్రాలతో పోల్చి అసైన్డ్ భూములకు సంబంధించి రైతులు పొందిన ప్రయోజనాలు పరిశీలించాలన్నారు. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు. కమిటీ సభ్యురాలైన హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పట్టా భూముల మధ్యలో అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు కోర్టులో కేసులు వేస్తున్నారని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని నియమించడం గొప్ప పరిణామమన్నారు. ఈ సమావేశంలో తొలుత అసైన్డ్ భూములపై చట్టాలు, సవరణలు, కలెక్టర్ల నివేదికలు, గత కమిటీ సిఫార్సులు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సీసీఎల్ఏ, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ కమిటీకి వివరించారు. అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్, సీసీఎల్ఏ ల్యాండ్స్ జాయింట్ సెక్రటరీ జి.గణేష్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
పాత రికార్డుల పరిశీలన.. ఆక్రమణలపై ఆరా
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ శివారు దేవరయాంజాల్‌లోని శ్రీరామచంద్ర స్వామి దేవాలయ భూముల వ్యవహారంపై ఐఏఎస్‌ల ఉన్నతస్థాయి కమిటీ నాలుగోరోజూ విచారణ కొనసాగించింది. రికార్డులు, ఫైళ్లను పరిశీలించింది. ల్యాండ్ సర్వే శాఖకు చెందిన ముగ్గురు అధికారులు, 19 మంది సర్వేయర్లు, ఎనిమిది మంది తహసీల్దార్ల ఆధ్వర్యంలోని 8 బృందాలు నిర్వహించిన సర్వే నాలుగు రోజుల అనంతరం గురువారం ముగిసింది. ఐఏఎస్‌ల కమిటీ దేవరయాంజాల్ ఆలయపూజారితో మాట్లాడి పలు అంశాలను అడిగి తెలుసుకుంది. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ల వద్ద నుంచి ఆలయానికి సంబంధించిన పాత రికార్డులు, ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూపత్రాల్లో 1,531 ఎకరాల భూములు సీతారామస్వామి ఆలయం పేరిట ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. పాత రికార్డులు, నక్ష, పహాణీలు, మ్యాప్‌లను కమిటీకి అందజేశారు. ఆలయ భూముల వివాదానికి సంబంధించి అప్పట్లో వేసిన వెంకట్రాంరెడ్డి, దివాన్ కమిటీల గురించి ఆరా తీయటంతోపాటు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, పత్రాలు, ఫైళ్లను కమిటీ పరిశీలించింది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం పేరు కాస్తా... సీతారామరెడ్డిగా, సీతారామారావుగా, సీతారామయ్యగా, సీతారాములుగా రకరకాల పేర్లతో మారి... చివరికి కబ్జాదారుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కినట్లు దేవాదాయ శాఖ అధికారులు కమిటీకి వివరించారు. దేవాలయ భూములు అమ్మేందుకు వీలులేదని, వాటిని చట్టపరంగా స్వాధీనం చేసుకునేందుకు అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. హెచ్ఎండీఏ అనుమతి పొందినవి మూడు మాత్రమే.. ఆలయ భూముల్లో గోదాములు, కమర్షియల్ షెడ్లు, ఫామ్‌హౌస్‌లు, కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలు అన్నీ కలిపి 178 వరకు ఉన్నప్పటికీ, సర్వే లెక్కల్లో మాత్రం తేడా ఉన్నట్లు సమాచారం. తూముకుంట మున్సిపాలిటీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 129 నిర్మాణాలు (గోదాములు, కమర్షియల్ షెడ్లు) ఉన్నప్పటికీ, ఇందులో మూడింటికి మాత్రమే హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తూముకుంట మున్సిపాలిటీ, అప్పటి పంచాయతీల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులను కమిటీ విచారించింది. నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలను అరికట్టని సంబంధిత ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలకు కూడా కమిటీ సిఫారసు చేసే అవకాశమున్నట్లు చర్చ సాగుతోంది. రాజకీయ పలుకుబడితోనే అక్రమ కట్టడాలు ఆలయ భూముల్లో 2007 నుంచి ఇప్పటివరకు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న విషయం ఐఏఎస్‌ల కమిటీ పరిశీలనలో తేలింది. మాజీమంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునకు సంబంధించిన కట్టడాలు, రాజకీయ పలుకుడి కలిగిన వ్యక్తులతోపాటు అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధుల నిర్మాణాలు కూడా ఆలయ భూముల్లో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈటల, ఆయన బినామీల అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో సేకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సమర్పించే నివేదిక సమగ్రంగా ఉండేలా అన్ని కోణాల నుంచి కమిటీ పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించింది. ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు భేటీ ఐఏఎస్‌ల కమిటీ దేవాలయ ప్రాంగణంలో సమావేశమైంది. 8 బృందాలు నిర్వహించిన సర్వే నివేదికలతోపాటు దేవాదాయ, రెవెన్యూ, విజిలెన్స్ శాఖలు, రైతులు, కబ్జాదారులు, నిర్మాణదారుల నుంచి సేకరించిన రికార్డులు, పత్రాలు, మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వానికి శనివారంలోగా నివేదిక సమర్పించే అవకాశముండటంతో మదింపు కోసం కమిటీ అన్ని రికార్డులను పరిశీలించి తుది సమాలోచనలు చేసింది. పత్రాలు అందజేసిన కబ్జాదారులు ఐఏఎస్‌ల ఉన్నత స్థాయి కమిటీకి కబ్జాదారులు, రైతులు తమ భూరికార్డులు, గోదాములు, కమర్షియల్ షెడ్లకు సంబంధించిన పత్రాలను చూపించారు. 1953లో ఈ భూములను కొనుగోలు చేసినట్లు పలువురు వివరణ ఇచ్చారు. గోదాములు, షెడ్లు నిర్మించుకోవటానికి గ్రామ పంచాయతీ నుంచి తీసుకున్న అనుమతి పత్రాలు, చెల్లిస్తున్న పన్నులు, భూమి శిస్తుకు సంబంధించిన పాత వివరాలను కూడా కమిటీకి చూపించారు. -
‘చంద్రబాబుకు దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలి’
అమరావతి: అమరావతిలో దళితుల భూములను ఇన్సైడ్ ట్రేడింగ్ జరిపి చంద్రబాబు అక్రమంగా కాజేశారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఎదుర్కొవాలని బొత్స డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే అమరావతి భూకుంభ కోణంపై ప్రశ్నిస్తుందని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. అయితే తమ ప్రభుత్వానికి చంద్రబాబుపై కక్ష సాధించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ చంద్రబాబు ఇన్సైడ్ ట్రేడింగ్ జరపనట్టైతే విచారణ ఎదుర్కొవాలిగానీ..కోర్టులకు వెళ్ళి అడ్డదారిలో స్టేలు తెచ్చుకోవడమేంటని బొత్స ప్రశ్నించారు. ఈ సందర్భంగా బొత్స , వైఎస్సార్సీపీవై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. తాము అధికారంలోకి వచ్చి రెండేళ్ళయ్యిందని ఒకవేళ మేము తప్పుచేస్తే ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకొలేక చంద్రబాబు బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాగా, దళితులకు అన్యాయం జరిగితే ఎవరైన ఫిర్యాదు చేయవచ్చని, కేవలం దళితుడే కావాల్సిన అవసరం లేదని గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. అయితే, రాజధాని భూఅక్రమాలపై ఆర్కే ఫిర్యాదుచేస్తే తప్పేంటని ప్రశ్నించారు. చదవండి: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు -
ఆ విషయం కూడా తలసానికి తెలియదా?
సాక్షి, హైదరాబాద్ : ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రైవేట్ కంపెనీల కోసం పేదల భూముల్ని లాక్కొంటున్నారని మండిపడ్డారు. దళిత, గిరిజనుల కు మూడు ఎకరాలు ఇస్తామంటూ చెప్పి అవి ఇవ్వకపోగా వారి అసైన్డ్ భూములనే ప్రభుత్వం తీసుకుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వ భూములను ఫార్మాసిటీ పేరుతో దాదాపు 8వేల ఎకరాలను ప్రభుత్వం ఆక్రమణలోకి తీసుకుందని భట్టి వ్యాఖ్యానించారు. అసలు ఫార్మాసిటీ ద్వారా ఎలాంటి ప్రజా ప్రయోజనాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్టీనేషనల్ కంపెనీలు సామన్య ప్రజలకు ఎలా ఉపయోగపడతాయని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కోవడం దుర్మార్గమన్న భట్టి ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తే సహించమన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి తరపున కాంగ్రెస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. (తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు.. చంద్రబాబుకు లేఖ) ఫార్మా వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. ఫార్మాసిటీ ని మొత్తం ప్రభుత్వం బ్రోకరేజ్ గా మార్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2.68 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు 2016-17లో నిర్మిస్తామని కేసీఆర్ సభలో వాగ్దానం చేసి మరిచారని విమర్శించారు. ఇప్పుడు అసలు వాటి జాడే లేదని, ఫీల్డ్‌లో ఉన్న 3428 ఇళ్లు మాత్రమే చూపించారని దుయ్యబట్టారు. మంత్రి తలసానికి కూడా ప్రభుత్వం లక్ష ఇళ్లు కూడా కట్టలేదన్న సంగతి తెలియనట్లుందని, కేవలం కాగితపు లెక్కలే చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ పార్టీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోని సైతం తొలిగించిదని తెలిపారు. (ఆ పార్టీలు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి) -
ప్రభుత్వ భూములపై దృష్టి సారించిన యంత్రాంగం
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ప్రభుత్వ భూములెన్ని.. వివిధ అవసరాల నిమిత్తం ఎంత అసైన్డ్ చేశారు.. ప్రస్తుతం ఉన్నదెంత.. లేకపోతే ఎటుపోయింది.. లెక్క తేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ భూముల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరడంతో ఆ మేరకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా హైదరాబాద్ శివారులో గల మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వీటితో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆక్రమణకు గురయ్యాయి. దీంతో లెక్కలు తేల్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వెంచర్లుగా మారిన ప్రభుత్వ భూములు వ్యవసాయం, గృహ, సామూహిక ప్రజా అవసరాలు, ప్రభుత్వ అవసరాలకోసం ప్రభుత్వ భూములను అసైన్ చేశారు. ఇందులో వ్యవ సాయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవడమే కాకుండా క్రయవిక్రయాలు జరిగాయి. జిల్లాలో వైటీడీఏ, బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతోంది. పునరావాసం కింద బాధితులకు తిరిగి ప్రభుత్వం భూములను ఇవ్వాల్సి ఉంది. మరో వైపు ఇప్పటికే అసైన్ చేసిన భూములు కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. రియల్ఎస్టేట్ వ్యాపారం ముసుగులో భారీగా ప్రభుత్వ అసెన్ భూములు కొల్లగొట్టారు. ఆక్రమణలను అడ్డగించేవారు లేకపోవడంతో కోట్లాది రూపాయల విలువగల భూములను రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసి విక్రయించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో గల ప్రభుత్వ అసైన్డ్ భూములను రియల్టర్లు కబ్జా చేసి ఓపెన్ప్లాట్ల వ్యాపారం చేశారు. నిరోధించాల్సిన యంత్రాంగ చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమాలు యథేచ్ఛగా జరిగిపోయాయి. ప్రభుత్వం గతంలో భూముల లెక్కలు తేల్చడానికి సర్వే చేపడితే వందకోట్ల రూపాయలు విలువ చేసే భూములు కబ్జా, ,క్రయవిక్రయాలు జరిగినట్లు తేలింది. క్షేత్రస్థాయిలో సరైన రక్షణ లేకపోవడంతో జిల్లాలోని 17 మండలాల్లో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేసి అందినకాడికి ఆక్రమించి అమ్ముకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.100కోట్లకు పైగా విలువ చేసే 3,370 ఎకరాల భూములను ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. రూ.కోట్లల్లో డిమాండ్ హెచ్ఎండీఏ, మూసీ పరివాహక ప్రాంతం, యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి రెండు జాతీయ రహదారులు ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎకరం భూమి ధర రూ.కోట్లకు చేరింది. చౌటుప్పల్ డివిజన్లో పరిధిలో 33.608, భువనగిరి డివిజన్లో 49.604 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చౌటుప్పల్ డివిజన్లో 14,140.32 ఎకరాల భూమిని, భువనగిరి డివిజన్లో 23693 ఎకరాల భూమిని రైతులకు అసైన్డ్ చేశారు. సగానికి పైనే అన్యాక్రాంతం ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములు సగానికి పైగా అన్యాక్రాంతమయ్యాయి. ఆభూముల పక్కనే గల భూములను కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమించారు. గతంలో నిర్వహించిన ప్రభుత్వ భూముల సర్వేలో భూ ఆక్రమణలు బయటపడ్డాయి. ఈమేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపారు. రాజకీయ వత్తిడులు, కొందరు ఉన్నతాధికారులప్రమేయంతో ఖబ్జాభూములపై నివేదికలన ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కేసులు నమోదు అసైన్ చేసిన భూ ముల క్రయవిక్రయాలు జరిగితే పీఓటీ కేసులు నమోదు చేస్తాం. అలాగే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం హైదరాబాద్ శివారులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తోంది. ప్రభుత్వం లెక్కలు తీస్తున్న జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా లేదు. ఇక్కడ బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వ భూములు అవసరం ఉన్నాయి. –రమేశ్, జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ భూముల వివరాలు ఎకరాల్లో మండలం మొత్తం ఏరియా వ్యవసాయానికి కేటాయింపు ఆలేరు 3794.08 1457.22 ఆత్మకూరు 8512.05 4302.09 భువనగిరి 8450.05 3341.19 బీబీనగర్ 5544.21 1884.07 బి.రామారం 6698.16 1831.06 మోత్కూర్ 8997.10 4426.23 రాజాపేట 4358.17 2346.34 తుర్కపల్లి 10920.03 4078.29 యాదగిరిగుట్ట 4618.22 1938.24 చౌటుప్పల్ 8057.33 2748.14 పోచంపల్లి 6707.15 5767.74 గుండాల 6094.06 2492.07 రామన్నపేట 7561.02 2830.26 వలిగొండ 7351.345 3218.03 మొత్తం 97665.18 39664.08 -
శ్రవణ్‌కుమార్‌పై మండిపడ్డ రైతులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధాని అంశం విషయంలో ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళితుల సమావేశం పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే శ్రవణ్ అక్కడికి రావడానికి ముందే ఆయన అనుచరులు ప్రభుత్వంపై విషం చిమ్ముతూ ప్రసంగించారు. ఈ క్రమంలో సమావేశ స్థలికి చేరుకున్న అసైన్డ్ భూముల రైతులు వారిని అడ్డుకుని శ్రవణ్ కుమార్ దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా దళితుల్ని చంద్రబాబు చిత్రహింసలు పెట్టినప్పుడు శ్రవణ్ కుమార్ ఎక్కడికి పోయాడని, దళితులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినప్పుడు శ్రవణ్ కుమార్ ఏం చేశాడంటూ రైతులు ప్రశ్నించారు. జీవో నెంబర్ 41తో దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే అప్పుడు మాట్లాడని శ్రవణ్ కుమార్ ఇప్పుడు ఏం మాట్లాడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దళిత రైతులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గొడవ సద్దుమణిగేలా చేశారు. -
టీడీపీ- కాంగ్రెస్‌ల పొత్తా?.. సిగ్గుచేటు!
సాక్షి, అమరావతి: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఒక్కటైన కాంగ్రెస్-టీడీపీలపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అడగడుగునా అవమాన పరిచి, వివక్షకు గురిచేసిన టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. దళితులను రాజధాని ప్రాంతం నుంచి వెళ్లగొట్టడానికి టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంలో జరుగుతున్న దోపిడిపై కోర్టుకు వెళ్తానని స్పష్టంచేశారు. రాజధాని ప్రాంతంలో సోమవారం పర్యటించిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితులు సాగుచేస్తున్న అసైన్డ్ భూముల్ని ఏపీ మంత్రులు బెదిరించి, అక్రమంగా కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల రైతులకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని.. అంతేకాకుండా పట్టా భూముల రైతులకు ఇచ్చే ప్యాకేజీలు కూడా వారికి వర్తింపచేసేలా చూడాలని డిమాండ్ చేశారు. పదిహేను రోజుల్లో అసైన్డ్ భూముల రైతులకు న్యాయం జరగకపోతే అమరావతిలోనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. ఏపీ రాజధాని అంతర్జాతీయ ఆర్థిక నేరం చంద్రబాబు ఏపీని సింగపూర్ కంపెనీలకు అమ్మేశారని హర్షకుమార్ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా అమ్మడం దారుణమన్నారు. అమరావతి నిర్మాణం పేరిట జరుగుతున్న దోపిడిపై ప్రధానికి పిర్యాదు చేస్తానని తెలిపారు. సీఎం బినామీలు, పార్టీ నాయకుల కోసమనే విధంగా రాజధాని నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను కబ్జాలు చేసి, టీడీపీ ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాలుపడుతోందని ధ్వజమెత్తారు. -
పేదల భూములు.. పెద్దల సొంతం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పేదల భూములపై అధి కార పార్టీ పెద్దల కన్నుపడింది. సుమారు రూ.5 కోట్ల విలువైన రెండెకరాల భూమిని అడ్డదారిలో సొంతం చేసుకున్నారు. దానిని ప్లాట్లుగా విభజించి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించేందుకు రంగం సిద్ధం చేశారు. అధికార పార్టీ నేత అండదండలతోనే ఈ తంతు నడుస్తోంది. దళితులకు కేటాయించిన అస్సైన్డ్ భూముల క్రయ విక్రయాలకు అవకాశం లేకపోయినా పంచాయతీ సిబ్బంది నిర్వాకంతో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహా రం సాగిపోతోంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు మండలం వెంకటాపురం çపంచాయతీ పరిధిలోని సుంకరవారి తోటలో సుమారు 20 ఏళ్ల క్రితం నిరుపేద ఎస్సీ, బీసీ కుటుంబాలకు ప్రభుత్వం వ్యవసాయం భూమి పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి 25 సెంట్ల చొప్పున మొత్తం 8 మందికి రెండెకరాల భూమిని అధికారులు అందించారు. వ్యవసాయం చేసుకోవాలని పేదలకు సూచించారు. కొన్నేళ్ల తర్వాత ఈ భూముల చుట్టూ ప్రభుత్వ, ప్రైవేట్ లేఅవుట్లు వెలిశాయి. దీంతో అక్కడి భూముల ధరలు పెరగడంతో కొందరు వ్యక్తుల కళ్లు ఈ భూమిపై పడింది. పేద కష్టాలను ఆసరా చేసుకుని తక్కువ మొత్తానికే ఆ భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసి ఎస్సీ, బీసీ నాయకులమంటూ కొందరు రంగంలోకి దిగారు. అస్సైన్డ్ భూముల కొనుగోలు నేరమంటూ బ్లాక్మెయిల్ చేసి సొమ్ములు గుంజుకున్నారు. ఇలా భూములు చేతులు మారాయి. ఇప్పుడు ఆ భూమిని లే–అవుట్ చేసి ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయం నుంచి లే–అవుట్ అనుమతులు సైతం పొందారు. నిజానికి అస్సైన్డ్ భూముల్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. అధికార పార్టీ కనుసన్నల్లో.. ఇప్పుడు ఈ వ్యవహారమంతా అధికార పార్టీ నేత చేతుల్లోకి వెళ్లింది. అస్సైన్డ్ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్ముకోవాలంటే.. తనకు పర్సంటేజీ ఇవ్వాలని తన అనుచరుల ద్వారా ఆ నాయకుడు డిమాండ్ చేసినట్టు సమాచారం. నెల రోజులపాటు తర్జనభర్జనల అనంతరం ఆ భూమిని ప్లాట్లుగా విభజిస్తున్న వ్యక్తులు మాజీ ప్రజాప్రతి నిధి ద్వారా టీడీపీ నేతలకు మొత్తం లాభంలో 25 శాతం కమీషన్ ఇచ్చేం దుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటివరకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. పనులు వేగం పుంజుకున్నాయి. భూమిని పూడ్చటానికి మట్టి తోలకాలు చురుగ్గా సాగుతున్నాయి. కలెక్టర్‌కు ఫిర్యాదు తమ భూములను అక్రమంగా లే–అవుట్ చేసి విక్రయించేందుకు కొం దరు వ్యక్తులు ఏర్పాట్లు చేస్తున్నారని, ఆ భూములను తమకు తిరిగి ఇప్పించాలంటూ గతంలో భూములు పొందిన కొందరు కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ నంబర్ 903–1బీ4లో ప్రభుత్వం 25 సెంట్ల చొప్పున భూమిని కేటాయిం చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, వెంకటాపురం పంచాయతీ సిబ్బంది కలిసి లే–అవుట్ చేసినట్టుగా పత్రాలు సృష్టించి తమ భూముల్ని కాజేస్తున్నారని వాపోయారు. ఇదేమని అడిగితే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని లబ్ధిదారులు కొత్తపల్లి కుటుంబరావు, ముల్లంగి వెంకటేశ్వరరావు, ఇమ్మల జ్యోతి తదితరులు కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.