లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి పవర్ సబ్‌స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని బొందల్పాడ్ గ్రామానికి చెందిన రైతు కందాల వెంకట్‌రెడ్డి నుంచి నార్కట్‌పల్లి పవర్ సబ్‌స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ అఫ్జల్ బాబా రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇప్పిస్తానని చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్నీ ఏఈని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.