లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి | acb caught corrupted officer | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

Published Wed, Mar 25 2015 4:00 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

acb caught corrupted officer

నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి పవర్ సబ్‌స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని బొందల్‌పాడ్ గ్రామానికి చెందిన రైతు కందాల వెంకట్‌రెడ్డి నుంచి నార్కట్‌పల్లి పవర్ సబ్‌స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ అఫ్జల్ బాబా రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.

డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇప్పిస్తానని చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్నీ ఏఈని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement