Asthana
-
చిత్తంతో చిత్రప్రయాణం
ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగికి ఆఫీస్‌కు అవతలి ప్రపంచంపై దృష్టి మళ్లదు. పనే ప్రపంచం అవుతుంది. దీప్తి ఆస్థాన మాత్రం ఆఫీస్ క్యూబికల్‌కు ఆవలి ప్రపంచాన్ని చూడాలనుకుంది. కెమెరా తన నేస్తం అయింది. దేశమంతా తిరుగుతూ స్త్రీల జీవితంలోని ఎన్నో కోణాలను కెమెరా కంటితో ఆవిష్కరిస్తోంది... సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం నుంచి సెల్ఫ్ లెర్నింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రయాణం దీప్తి అస్థాన జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు క్యూబికల్ అవతల తనకు తెలియని ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంది. ఎక్కడికి ప్రయాణం చేసినా కెమెరా తనతోపాటు వచ్చేది. సంభాషించేది. కెమెరా ద్వారా ప్రయాణాలలో లోతైన అర్థాన్ని, సామాజిక ప్రయోజ నాన్ని కనుగొంది దీప్తి. మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, తాను కలుసుకున్న వ్యక్తుల జీవిత కథలను ప్రపంచంతో పంచుకోవడానికి ఫొటోగ్రఫీ దీప్తికి బలమైన మాధ్యమంలా ఉపయోగపడింది. సాధారణంగా దూర ప్రయాణాలు అనగానే ప్రముఖ, ప్రసిద్ధ స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ దీప్తి మాత్రం అనామక, అంతగా ఎవరూ పట్టించుకోనిప్రాంతాలకు వెళ్లేది. ఆప్రాంతాల గురించి ఎవరూ పనిగట్టుకొని ఫొటోలు తీసి ఉండరు. నాలుగు ముక్కలు రాసి ఉండరు. ఆ పని దీప్తి చేసింది. ఆ తరువాత...‘ఉమెన్ ఇండియా’ప్రాజెక్ట్‌తో తన ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇది ఒకటి రెండు నెలల పరిమిత కాల ప్రయాణం కాదు. సంవత్సరాలుగా సాగిన ప్రయాణం. పట్టణాల్లోని మార్పుల సంగతి ఎలా ఉన్నా, పల్లెప్రజలు మాత్రం గతంలోనే ఉన్నారని గ్రహించింది దీప్తి. బాల్య వివాహాల నుంచి ఆడపిల్లలు చదువుకు దూరం కావడం వరకు కెమెరా కంటితో ఎన్నో సమస్యలను లోకం దృష్టికి తీసుకువచ్చి మహిళలు తమ గళం విప్పడానికి ఒక వేదికను నిర్మించింది. సోషల్ మీడియా దృష్టిలో పడని మహిళల సమస్యలను అదే మీడియా ద్వారా నలుగురి దృష్టికి తీసుకు వచ్చింది. సమస్యల గురించి మాత్రమే కాకుండా వివిధప్రాంతాలలోని సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టింది. ‘నా ప్రాజెక్ట్‌లో అన్ని కథలు మనుగడ కోసం చేసే పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాదు. జీవితాన్ని, సంస్కృతిని సెలబ్రెట్ చేసుకునేవి కూడా’ అంటుంది దీప్తి. స్ఫూర్తిదాయకమైన కథలు మార్పు తీసుకురాగలవా?’ అని అడిగితే ‘అందుకు నేనే ఉదాహరణ. ఆ మార్పు ముందు నాలోనే వచ్చింది’ అంటుంది దీప్తి. తాను షూట్ చేయడానికి ఎంచుకునే ప్రదేశాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. గుజరాత్‌లోని మిధాపూర్లో పన్నెండేళ్ల భారతితో మాట్లాడింది దీప్తి. ఆ అమ్మాయి ఎప్పుడూ బడి ముఖం చూడలేదు. కొంతకాలం ఇంటిపట్టునే ఉన్న భారతి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు కూలిపనికి వెళుతుంది. ఈ చిన్నారి పెద్ద పెద్ద తట్టలను మోస్తున్న దృశ్యం చూసి దీప్తికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘భారతి అందమైన, చురుకైన అమ్మాయి. ఆమె భవిష్యత్ కూలిపనులకు పరిమితం కావాల్పిందేనా? అనే బాధ కలిగింది. కెమెరా గురించి భారతి ఆసక్తిగా తెలుసుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఇలాంటి పిల్లలకు కొత్త దారి చూపితే పురోగమించగలరు’ అంటుంది దీప్తి. భారతి లాంటి ఎంతోమంది పిల్లల కథలను లోకం దృష్టికి తీసుకువచ్చింది. పట్టణ ప్రాం తాలలో పెరిగిన దీప్తి దేశ విదేశాల్లో ఎన్నో మెట్రోపాలిటన్ నగరాలలో పనిచేసింది. ‘సమాజ నిర్మాణంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సమాన అవకాశాలు లేవు’ అనే ఎరుక ఆమెను ఎప్పటికప్పుడు కొత్తప్రాంతాలకు తీసుకు వెళుతుంది. కొత్త జీవితాలను ఆవిష్కరించేలా చేస్తున్న దీప్తి ప్రస్తుతం గోవాలో ఉంటోంది. లక్ష్యంతో కూడిన ప్రయాణం భావాలను వ్యక్తీకరించడానికి పుస్తకం రాయడం, ఉపన్యాసం చేయడం లాగే ఫొటోగ్రఫీ కూడా ఒక సాధనం. నేను తీసిన చిత్రాలు నా భావాలకు అద్దం పట్టేలా ఉంటాయి. ఒక మహిళగా ఇతర మహిళలు, పిల్లలతో మాట్లాడడం నాకు సులువు అయింది. సోలోగా ట్రావెల్ చేయడంలో లైఫ్‌స్కిల్స్ క్రమక్రమంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ప్రయాణానికి ఒక లక్ష్యం తోడైతే అది అద్భుతంగా ఉంటుంది. – దీప్తి అస్థాన వారి జీవితంలో భాగం అవుతాను కెమెరా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తి జీవితపు లోతు అప్పటికప్పుడు ఆవిష్కారం కాదు. వారితో సరిగ్గా కనెక్ట్ కాగలగాలి. మనం వారిని అర్థం చేసుకున్నట్లే వారూ మనల్ని అర్థం చేసుకోవాలి. తమ గురించి తెలుసుకోవడంలో, కెమెరా ఉపయోగించడంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదనే భావన వారికి కలగాలి. ఇదేమంత సులభం కాదు. అలా అని జటిలం కాదు. మన ఓపిక, ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఫోటోలు తీసుకున్నప్పుడు వారి జీవితంలో భాగం అవుతాను. వారు నాలో భాగం అవుతారు. కలిసి భోజనం చేస్తాం. సరదా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటాం. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా తమలో భాగంగా చూసుకున్నారు. ఆత్మీయత పంచారు. ఇది నా అదృష్టం. – దీప్తి అస్థాన -
భయభ్రాంత భారతమా? భయమే ఆయుధమా?
దేశం ఎన్నో విషయాలకు ఉలిక్కిపడు తోంది. అవి 140 పదాల ట్వీట్లు కావొచ్చు, వాట్సాప్ సందేశాలు కావొచ్చు, ఫేస్బుక్ పోస్టులు, ఈ-మెయిల్స్, ఆర్టికల్స్, పుస్తకాలు, పాటలు, నాటకాలు, సినిమాలు... అసలు దేశాన్ని అస్థిరపరచనిది అంటూ ఏదీ లేదు. దేశద్రోహం, మతపరమైన లేదా వర్గపరమైన సెంటిమెంట్లను దెబ్బకొట్టడం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులను గనక సంకేతంగా భావిస్తే దేశం వినా శనానికి దగ్గరగా ఉన్నట్టు. ప్రపంచంలోని ఇంకే దేశమూ రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు చేశారని ఆరోపిస్తూ తన సొంత పౌరుల మీద ఇన్ని కేసులు పెట్టదు. ఒకవేళ ఈ కేసులన్నీ వాస్తవమైనవే అయితే, స్పష్టంగా ఈ దేశంలో ఏదో లోపం ఉందని అర్థం. నిర్మాణం లోపభూయిష్టం అయివుండాలి, లేదా ఇక్కడి ప్రజలకు దేశం పట్ల ప్రేమ లేద నుకోవాలి. అలా కానట్టయితే, ‘ఇతరులు’ అనుకునే వాళ్లందరి తోనూ రాజకీయ లెక్కలు సరిచూసుకుంటున్నట్టు. సాధారణంగా ఈ ఇతరులు అనేవాళ్లు ముస్లింలు, వామపక్షీయులు, అర్బన్ నక్సలైట్లు, విద్యార్థులు, ఇంకా ఇతర విస్మృత వర్గాలకు చెందిన కార్యకర్తలు. ఇంకోలా చెప్పాలంటే, ఎవరి అభిప్రాయం అత్యధిక ప్రజలను రెచ్చగొట్టేట్టుగా ఉందో వాళ్లు దేశ వ్యతిరే కులు అవుతారు, వాళ్లను రాజ్యపు సర్వశక్తులతో వేటాడుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2017–19 మధ్య రాజ్యానికి వ్యతిరేకంగా నమోదైన కేసులు 25,118. సగటున ఏడాదికి 8,533. ఈ రాజ్య వ్యతిరేక నేరాల్లో 93 కేసులు దేశ ద్రోహం(సెక్షన్ 124ఎ); 73 కేసులు దేశం మీద యుద్ధం తల పెట్టినవి(సెక్షన్ 121 లాంటివి); 58 కేసులు దేశ సమగ్రతకు సంబంధించినవి(సెక్షన్ 153బి); 1,226 కేసులు ‘ఉపా’. నిజ మైన తీవ్రవాద దాడి ఒక్కటి కూడా దేశంలో జరగని కాలంలో ‘ఉపా’, ‘దేశద్రోహం’ కేసుల్లో వందల మంది అరెస్టయ్యారు. దేశంలో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారా? ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని హింసామార్గంలో కూలదోయాలని మాట్లా డటం విన్నామా? కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాదులు దేశం నుంచి విడిపోవాలని కోరుకున్నారు. కానీ వాళ్లెప్పుడూ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయాలని మాట్లాడలేదు. 2004లో సీపీఐ (మావోయిస్ట్) సభ్యులు విప్లవం అన్నారు. వాళ్ల ప్రయత్నంలోని నిరర్థకత అర్థమై వాళ్లు కూడా దాని గురించి మాట్లా డటం మానేశారు. దేశంలో ఇంతమంది తీవ్రవాదులు ఉన్నారంటే, ప్రభుత్వంలో తీవ్ర లోపం ఉందని అర్థం. సుదీర్ఘ కాలంగా ఈ పరిపాలన నడుస్తున్న తీరు ఎంతోమంది యువ కులు, పరిశోధక విద్యార్థులను తీవ్రవాదులుగా మార్చేస్తోందని అర్థం. లేదా ఈ మొత్తం విషయమే ఒక ప్రహసనం. ప్రపంచంలో బహుశా మన ఒక్కదేశంలోనే 73 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా అన్ని రాజకీయ పక్షాల నాయకులు దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునివ్వడంలో ఎంత మాత్రమూ అలసిపోరు. ఇక్కడ పాఠశాలల్లో ప్రారంభం నుంచే దేశభక్తిని ప్రబోధిస్తాం, అయినా చాలామంది దేశానికి అశుభం కోరుకుంటారని తలుస్తాం. నిరంకుశత్వం అనే భావన భారత రాజ్యాన్ని పట్టిపీడిస్తోంది. ఏమాత్రం భిన్నాభిప్రాయం పొడ సూపినా మన రాజకీయ నాయకులు తీవ్రమైన అభద్రతకు లోనవుతున్నారు. నిర్మాణాత్మకంగా ఏమీచేయనప్పుడు, వాళ్లు చూపగలిగేది రాజకీయ వ్యూహమే. ‘ఒక్కరిని చంపు, పదివేల మందిని భయపెట్టు’ అంటాడు గొప్ప చైనా వ్యూహకర్త సన్ ట్జూ. ‘ఒక్కరిని తప్పుడు కేసులో ఇరికించు, పదివేలమందిని భయపెట్టు’ అని భారతదేశం దీన్ని నవీకరించింది. 2017–19 మధ్య 6,250 కేసులు భిన్న వర్గాల మధ్య వైరాన్ని పెంచడం అన్న కారణంతో నమోదైనవి. ఇవన్నీ కూడా సెంటిమెంట్లను దెబ్బతీశారని పెట్టినవి. విశ్వగురువుగా చెప్పు కునే దేశంలోని ప్రజలు ఇంత అతిసున్నిత మనస్కులు అయ్యారా? దైవదూషణ చట్టం మన దగ్గర లేదుగానీ 153ఎ, 295ఎ సెక్షన్లను మితిమీరి వాడటం పరిస్థితిని దానికంటే దిగ జారుస్తోంది. అనుద్దేశపూర్వకంగా ఏదైనా మతాన్ని అవమా నిస్తే అదేమీ నేరం కాదని 1957 నాటి రామ్‌జీ లాల్ మోదీ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా, ద్వేషంతో చేసేదే నేరం. వీళ్లు చాలడం లేదని ఈమధ్య మనకు ‘అంతర్జాతీయ కుట్రదారులు’ కూడా తయారయ్యారు. 1976లో ఒక కేసులో తీర్పిస్తూ వి.ఆర్.కృష్ణ అయ్యర్ తన మద్దతుదారులకంటే విమర్శకుల నుంచే ఎక్కువగా ప్రభుత్వం నేర్చుకోగలదని వ్యాఖ్యానించారు. అలాంటిది తేలికపాటి హాస్యానికి కూడా పోలీసు కేసులు పెట్టే రోజులొచ్చాయి. అంటే దేశం ‘భయభ్రాంత భారత్’ అవుతోందని అర్థం. లేదంటే, తన ప్రజలను పాలించడానికి భయం అనే ఆయుధాన్ని వాడుతోం దని అనుకోవాలి. ఎన్.సి. ఆస్థానా వ్యాసకర్త విశ్రాంత ఐపీఎస్ అధికారి, కేరళ మాజీ డీజీపీ -
అస్థానా తరహాలో అమరావతి
- రాజధాని నిర్మాణంలో మార్పులు - వాణిజ్య, సర్కారు జోన్లో గృహ సముదాయాలు - కజికిస్థాన్ పర్యటన అనంతరం సీఎం ఆలోచనలు సాక్షి, హైదరాబాద్ : కజకిస్తాన్ రాజధాని అస్థానా తరహాలో ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏ రంగానికి కేటాయించిన జోన్లో ఆ నిర్మాణాలే జరగాలనే నిబంధనల్లో కొంతమేర సడలింపులు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ జోన్లో ఇతర కార్యకలాపాలకు అనుమతించకూడదని ఇప్పటివరకూ భావించారు. అలా చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల సమయం ముగిసిన తరువాత ఆ ప్రాంతంలో జన సంచారం లేకపోవడమే కాకుండా ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల జోన్ పరిధిలో కొంతభాగం గృహ సముదాయాలకు అనుమతించాలని, అలాగే మరికొంత భాగంలో వాణిజ్య సముదాయాలకు అనుమతించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే వాణిజ్య జోన్లో ఇతర కార్యకలాపాలకు, నివాసాలకు అనుమతించకూడదనే ఆలోచనను మార్చుకుం టున్నట్లు వెల్లడించారు. వాణిజ్య జోన్‌లోనూ నివాస సముదాయాలకు కొంతమేర అనుమతించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భూగర్భ పార్కింగ్ వసతి అస్థానాలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఒక భవనం నుంచి మరో భవనానికి నడిచి వెళ్లేందుకు కారిడార్లు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. అమరావతిలోకూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. అక్కడ అంతా భూగర్భ పార్కింగేనని ఇలాంటి ఏర్పాటే ఉండాలని సీఎం యోచిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టపక్కల పూల వనాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు.