atacks
-
రెడ్ బుక్ కాదది బ్లడ్ బుక్
సాక్షి, అమరావతి : ‘పోలింగ్, కౌంటింగ్ మధ్య రెడ్ బుక్ టీజర్ చూపించాం.. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత రెడ్ బుక్ ట్రైలర్ చూపించాం.. అంతటితో అయిపోలేదు.. అసలు రెడ్ బుక్ సినిమా ముందుంది’ అని టీడీపీ రౌడీ మూకలు బరి తెగిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అధికార గూండాగిరీకి పోలీసు శాఖ దాసోహమవడంతో టీడీపీ రెడ్‌బుక్ ఏకంగా బ్లడ్ బుక్‌గా రూపాంతరం చెంది విశృంఖలత్వం సృష్టిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో రక్తపుటేరులు పారిస్తూ టీడీపీ నేతల రక్తదాహం తీరుస్తోంది. అయినా సరే ఇది చాలదు.. అంతకు మించి అంటూ ప్రభుత్వ నేతే వ్యాఖ్యానించడంతో పచ్చ మూకలు మరింతగా మరణ మృదంగం మోగించేందుకు బరి తెగిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారం, ఆపై హత్యలు.. 16 అత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రం హడలెత్తిపోతోంది. అరాచకం రాజ్యం చేస్తుంటే రాక్షస గణం గంగవెర్రులెత్తిపోతూ సృష్టిస్తున్న విధ్వంసకాండకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలు మౌన సాక్షిగా మిగిలి పోతుండటం పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది.ఎదురు దాడి చేయండని మంత్రులకు ఆదేశంహత్యలు, హత్యాయత్నాలు, దాడులతో రాష్ట్రం అట్టుడుకుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం బాధ్యతాయుతంగా స్పందించనే లేదు. పోలీసు ఉన్నతాధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించ లేదు. పైగా విధ్వంసకాండను వెనకేసుకొచ్చే రీతిలో మంత్రి మండలి సమావేశంలో మాట్లాడటం విభ్రాంతి కలిగించింది. హత్యలు జరుగుతున్నా జరగలేదన్నట్టుగా మాట్లాడాలి కదా.. అని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయడం విస్మయ పరుస్తోంది. అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ఎందుకు ప్రశ్నించలేదని కూడా ఆయన మంత్రులను నిలదీశారు. వినుకొండలో వైఎస్సార్సీపీకి చెందిన రషీద్‌ను టీడీపీ వర్గీయుడు జిలానీ.. నడి వీధిలో దారుణంగా హత్య చేస్తే, అది అసలు రాజకీయ హత్యేకాదని వితండవాదం చేయడం టీడీపీకే చెల్లింది. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్న జిలానీ, అసలు తమ పార్టీకి చెందిన వ్యక్తే కాదని అడ్డగోలు వాదన చేయడం విడ్డూరం. అతను టీడీపీ ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆమెకు కేకు తినిపిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చినా సరే తమ పార్టీ నేత కాదనడం కంటే బుకాయింపు ఇంకేముంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే హోమ్ మంత్రి అనిత ఆదివారం హడావిడిగా మీడియా సమావేశం నిర్వహించి, అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ప్రశ్నించడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం.దాడులు, విధ్వంసానికి చంద్రబాబు ‘పచ్చ’జెండాపచ్చ మూకలు 45 రోజులకుపైగా యథేచ్ఛగా సాగిస్తున్న విధ్వంసకాండతో చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందినట్టు లేదు. అందుకే ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు బాధితుల ఫిర్యాదులే స్వీకరించడం లేదు. హత్యలు, హత్యాయత్నాలు, విధ్వంసం సృష్టిస్తున్న టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెట్టే ధైర్యం పోలీసులకు లేదన్నది సుస్పష్టం. తద్వారా దాడులు కొనసాగించండి.. మేమున్నాం.. అనే రీతిలో టీడీపీ గూండాలను ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. వినుకొండలో నడి వీధిలో హత్య చేసిన టీడీపీ వర్గీయుడు జిలానీని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని అరెస్ట్ చూపిస్తూ పోలీసులు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్ట లేదు! ప్రెస్ మీట్ పెడితే ఎందుకు హత్య చేశారని మీడియా ప్రతినిధులు అతన్ని, పోలీసులను అడుగుతారు. అప్పుడు రాజకీయ కక్షతోనే హత్య చేశాడనే విషయం చెప్పాల్సి వస్తుంది. అందుకే గోప్యంగా రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ గూండాలు 37 ప్రదేశాల్లో రాళ్ల దాడులతో బీభత్సం సృష్టించారు. ఆ దాడుల్లో పాల్గొన్న ఒక్క టీడీపీ నేత, కార్యకర్త మీద కూడా కేసు నమోదు చేయనే లేదు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా బాధితులైన ఎంపీ మిథున్‌రెడ్డి, రెడ్డెప్పపైనే అక్రమ కేసులు బనాయించడం గమనార్హం. తిరుపతి జిల్లాలో టీడీపీ రౌడీ మూకలు 40 చోట్ల దాడులకు పాల్పడ్డాయి. ఒక్క సంఘటనలో కూడా టీడీపీ వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా బాధితులైన 35 మంది వైఎస్సార్సీపీ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్, ఆయన బంధువులపై దాడి చేస్తే.. ఆ కేసులో వైఎస్సార్సీపీ వర్గీయులు 13 మందిని అరెస్ట్ చేశారు. నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వందల సంఖ్యలో దాడులకు తెగబడినా సరే వారిపై కేసులు నమోదు చేయనే లేదు. ఇటువంటి ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా వందల్లో ఉన్నాయి. తద్వారా రానున్న రోజుల్లో మరింత పెను విధ్వంసం సృష్టించేందుకు.. దాడులతో తెగబడేందుకు.. పచ్చ రౌడీలకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, సామాన్యుల ప్రాణాలకు న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థలే అండగా నిలబడాలని వారు కోరుతున్నారు. -
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి శ్రేణులు చేస్తున్న దాడులు, విధ్వంసాలను అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరింది. వైఎస్సార్సీపీ నేతలు, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి, ఈమేరకు వినతిపత్రం అందించింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు పేట్రేగిపోతున్నాయని ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, అస్థిరత నెలకొందని వివరించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలిపింది. తక్షణమే జోక్యం చేసుకొని టీడీపీ అరాచకాలకు అడ్డకట్ట వేయాలని గవర్నర్‌ను వైఎస్సార్సీపీ బృందం కోరింది. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల ధ్వంసం జరుగుతున్నా సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం : వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 రోజులుగా టీడీపీ, జనసేన శ్రేణులు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైన, ఇళ్లపైన దాడులు చేస్తున్నారని, దారుణంగా అవమానిస్తున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు చేస్తున్నారని, పారీ్టకి చెందిన, వైఎస్సార్ పేరు ఉన్న శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదన్నారు. కనీసం కేసులు కూడా నమోదు చేయడంలేదని అన్నారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. అయినా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదన్నారు. దాడులు, విధ్వంసం కొనసాగుతూనే ఉందని అన్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లేసిన దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాలను కూడా తగలబెడుతున్నారని అన్నారు. పరిస్థితులు దారుణంగా ఉండటంతో తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. హింసాత్మక ధోరణి కొనసాగరాదు : ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తూ ఒక పద్ధతిలో ఓడిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చేలా ఉండాలని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 2014 –19లో చంద్రబాబు తెచ్చిన జీవో, నిబంధనల ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని తెలిపారు. నిబంధనల ప్రకారమే పార్టీ ఆఫీసుల నిర్మాణం జరుగుతోందని, ఇవి అక్రమ నిర్మాణాలు కాదని స్పష్టం చేశారు. అయినా వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందంటూ దు్రష్పచారం చేస్తున్నారన్నారు. ఒక్కో ఆఫీసు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, ఈరోజు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు ఉందన్నారు. అంటే ఒక్కో ఆఫీసు నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఇలా ఇప్పటి వరకు 18 ఆఫీసులకు దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. కానీ రూ.500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లు ప్రజాధనం దురి్వనియోగమైనట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్,, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ ఆఫీసుల్లోకి ప్రవేశించి బెదిరింపులు గతంలో టీడీపీ ప్రభుత్వంలో వాళ్ల పార్టీ భవనాలకు, బీజేపీ ఆఫీసులకు, కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు స్థలాలు మంజూరు చేసిన విధంగానే, ఆ నిబంధనల ప్రకారమే వైఎస్సార్సీపీ ఆఫీసులకు స్థలాలు తీసుకున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్నాక భవనాలు నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణం పూర్తయ్యే వాటి వద్దకు వెళ్లి టీడీపీ, జనసేన కార్యకర్తలు అక్కడున్న తమ కార్యకర్తలు, సిబ్బందిని బెదిరించి భవనాలను కూలగొడతామంటున్నారని, వీటన్నింటినీ అడ్డుకోవాలని గవర్నర్‌ని కోరామని తెలిపారు. వీటికి సంబంధించి ఫొటోలను కూడా గవర్నర్‌కు చూపించామన్నారు. కొన్ని ఫొటోలను చూసి ‘ఇంత దారుణంగా పరిస్థితి ఉందా’ అని గవర్నర్ చాలా ఆశ్చర్యపోయారని తెలిపారు. -
బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు
సాక్షి, అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు ‘ఈనాడు’ పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించేందుకు యత్నించింది. కరోనా విపత్కర వేళ ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయిన రోజుల్లో వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న 26 దుస్సంఘటనలను ఉదహరిస్తూ దానికీ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టింది. 2020 మార్చి 12 నుంచి 2021 ఏప్రిల్ 16వ తేదీ మధ్య కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకొని ఆలయాల్లో కొన్ని దురాగతాలకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆలయాల్లో స్వామివార్ల నిత్య పూజలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్పటికప్పుడే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో మరోచోట అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలతోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ఆలయాల్లో యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాత్రివేళల్లో ఆలయాల వద్ద పోలీసు గస్తీని పెంచింది. తద్వారా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండాచేసింది. కానీ చంద్రబాబుపై తనకున్న ‘స్వామి భక్తి’తో పూర్తిగా ఉన్మాదిగా మారిన ‘ఈనాడు’ ఇప్పుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. నాడు ఆలయాలు కూల్చేస్తే నోరెత్తలేదేమీ... టీడీపీ హయాంలో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో పవిత్ర దేవాలయాలను అధికారికంగా కూల్చేశారు. ఆ సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా.. ‘ఈనాడు’ కనీసం స్పందించనైనా లేదు. పైగా చంద్రబాబు ఓ గొప్ప విజనరీగా, దార్శనికుడిగా చూపిస్తూ ఆకాశానికెత్తేసింది. నాడు కూల్చేసిన ఆలయాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి పునరి్నర్మించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, కొత్తగా ఆలయాలు నిర్మించింది. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.దేవుడి ఆస్తుల రక్షణకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు » రాష్ట్రంలోని దేవుడి ఆస్తులు, విలువైన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు పెత్తందార్లు దర్జాగా వాటిని కైంకర్యం చేసేశారు. » అలాంటి దుశ్చర్యలను కట్టడి చేస్తూ జగన్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచి్చంది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి... వారం రోజుల తర్వాత ఆ భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా దేవదాయశాఖకు కట్టబెట్టింది. » ఇప్పటి వరకు ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ వేయాల్సి ఉండేది. ట్రిబ్యునల్ ఆక్రమణదారునికి సైతం తమ లాయర్ల ద్వారా వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చిoది. ట్రిబ్యునల్ దానిపై నిర్ణయం వెలువరించేవరకూ ఆ భూములు అనుభవించుకునే వెసులుబాటు ఆక్రమణదారులకే లభించేది. » ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పునిస్తే, దానిపై మళ్లీ అప్పీల్ చేసుకుని కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకుంది. దానివల్ల స్వాధీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేది కాదు. కొత్త చట్టంతో దానికి కళ్లెం వేయగలిగింది. » ఇంకోవైపు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి తొలిసారి ఆలయ అభివృద్ధి పనులకు నేరుగా నిధులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. » ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ కేవలం ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదంటే వంశపారంపర్య అర్చకులకు, ఇతర హిందూ ధారి్మక సంస్థలకు అప్పగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. -
చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన తమ్ముళ్లు
తిరుపతి: చిత్తూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులతో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేణిగుంట మండలం కొట్రమంగళం టీడీపీ గ్రామసర్పంచ్ దామోదర రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ దామోదర రెడ్డి చెక్ పవర్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేసిన గ్రామస్తులపై సర్పంచ్ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.