Atendar
-
మా డబ్బులు మాకివ్వాలి
చిట్యాల(నకిరేకల్) : చిట్యాల పశువైద్యశాలలో పనిచేసిన అటెండర్ సబ్సిడీ పరికరాలు ఇప్పిస్తామని, పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తామని రైతులు, పశువుల పెంపకందారుల నుంచి డబ్బులు వసూలు చేసి, ఊడాయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం బాధితులు చిట్యాల పశువైద్యశాల ఎదుట ఆందోళనకు దిగారు. చిట్యాల పశువైద్యశాలలో ఆరు నెలల క్రితం వరకు అటెండర్‌గా పనిచేసిన కిరణ్ మండలంలోని పదిమంది రైతుల వద్ద నుంచి సబ్సిడీపై ఇచ్చే గడ్డికోసే యంత్రాలను ఇప్పిస్తానని ఒక్కొక్క రి వద్ద నుంచి రూ.11 వేల చొప్పున వసూలు చే శాడు. అంతేకాకుండా సబ్సిడీపై కోళ్లు ఇప్పిస్తానని మరికొందరి దగ్గర నుంచి రూ. 15 వేలు వసూలు చేశాడు. పదుల సంఖ్యలోని రైతులకు చెందిన పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తామని ఒక్కోక్క పశువుకు రూ.290 చొప్పున వసూలు చేశాడు. డబ్బులు వసూలు చేసి పరికరాలు ఇవ్వకపోవడం, ఆ తర్వాత అకస్మాత్తుగా వేరే గ్రా మానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు. దీంతో కొద్దిరోజులుగా బాధితులు స్థానిక పశువైద్యాధికారి అమరేందర్‌కు తెలియజేసి తగిన న్యాయం చేయాలని కోరారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. చిట్యాల పశువైద్యాధికారి మరో రెండు మూడు రోజుల్లో బదిలీ కానున్నట్లు తెలియడంతో సోమవారం బాధితులు పశువైద్య శాల ఎదుట నిరసనకు దిగారు. అటెండర్ వద్ద నుంచి తమకు రావల్సిన డబ్బులు ఇప్పించాలని బాధితులు పశువుల డాక్టర్‌ను కోరారు. కాగా గడ్డి యంత్రం కోసం డబ్బులు ఇచ్చిన వారిలో చిట్యా ల జెడ్పీటీసీ శేపూరి రవీందర్ సైతం రూ.4వేలు ఇవ్వడం కొస మెరుపు. పశువైద్యాధికారి వివరణ అటెండర్ కిరణ్ గత ఆక్టోబర్ నెలలో బదిలీపై వేరే పశువైద్యాశాలకు వెళ్లాడని చిట్యాల పశువైద్యాధికారి జెల్లా అమరేందర్. పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తనకు తెలిపారని, అతనితో ఫోన్లో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించిన అందుబాటులోకి రావడం లేదన్నారు. జరిగిన విషయాన్ని పైఅధి కారులకు తెలియజేస్తానని తెలిపారు. -
అటెండర్ నుంచి సబ్‌రిజిస్ట్రార్ వరకు లంచం
-
అటెండరే డాక్టర్..
♦ ఇక్కడ ఆయనే పెద్ద దిక్కు ♦ ఇద్దరు డాక్టర్లున్నా వచ్చేది ఒక్కరే ♦ సమయపాలన పాటించని సిబ్బంది ♦ వైద్యం అందక అవస్థలు పడుతున్న రోగులు ఎవరూ లేనివారికి దేవుడే దిక్కు అన్నట్టు ఆసుపత్రిలో వైద్యులు లేనప్పుడు అటెండరే దిక్కు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యులు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. ఇక్కడ ఇద్దరు డాక్టర్లున్నా విధుల్లో ఉండేది ఒక్కరే. ఆ ఒక్కరు కూడా సమయపాలన పాటించరు. ఫార్మాసిస్ట్ ఉన్నా అటెండర్ ద్వారానే మందులు ఇప్పిస్తున్నారు. ఇంత అధ్వానంగా మారిన ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఆ దేవుడే బాగు చేయాలి. పుల్కల్ మండల కేంద్రమైన పుల్కల్తోపాటు 16 గ్రామాలకు ఈ ఆసుపత్రి అం దుబాటులో ఉండటంతోపాటు రవాణా సౌకర్యం ఉన్నందున వివిధ గ్రామాలు, తండాల నుంచి నిత్యం సుమారు రెండు వందల మందికి పైగా రోగులు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఉదయం 10 గంటలైనా సిబ్బంది లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో వచ్చే వారంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఓ ఫా ర్మాసిస్టు, ఏఎన్ఎం, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ ఇద్దరు డాక్టర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు రికార్డులో ఉన్నా ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తారు. ప్ర సవం కోసం వచ్చే వారికి సూచనలు, అ త్యవసరమైన సమయంలో డెలివరీ చేయడం కోసం మహిళా డాక్టర్‌ను నియమించారు. ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదని స్థానికులంటున్నారు. ఆపరేషన్ థియేటర్ తెరుచుకోకపోవడంతో పరికరాలు మూలనపడ్డాయి. ఎప్పుడొస్తారో తెలియదు... పుల్కల్ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సమయపాలన పాటిం చడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది సంగారెడ్డి, జోగిపేట నుంచి వచ్చి రాకపోకలు సాగిస్తుంటా రు. దీంతో బస్సులు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి మధ్యాహ్నం సైతం 3 గంటలకే తిరిగి వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. డాక్టరుతోపాటు సిబ్బంది సైతం సమయానికి రాకపోవడంతో అక్కడ కాం ట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అటెండరే పెద్ద దిక్కయ్యారు. ఇటీవల సమయానికి ఎవ్వరూ లేకపోవడంతో బైకుపై నుంచి పడి గాయపడిన యువకుడికి అతనే వైద్యం చేశారు. ఆసుపత్రితో సంబంధం లేని వ్యక్తులు సైతం ఇక్కడ రోగులకు మందులు ఇస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరో అధికారులకే తెలియాలి. -
నా క్యారెక్టర్ మంచిది కాదని ఆఫీస్‌లో ప్రచారం...
బెదిరింపులు కూడా శిక్షార్హమైన నేరమే! లీగల్ కౌన్సెలింగ్ నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ నా భర్తకు చేదోడు వాదోడుగా ఉన్నాను. మాకు ఒక్కరే సంతానం. ఉన్నంతలో పొదుపు చేసుకుంటూ హాయిగా ఉన్నాము. మేడమ్, మా ఆఫీస్‌లో ఒక అటెండర్ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలనుండి అతను తెలుసు నాకు. ఉద్యోగంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. ఒకరోజు వ్యాపారంలో నష్టమొచ్చిందని, ఒకరికి యాభైవేలు తక్షణం చెల్లించాలని చెప్పి కళ్లనీళ్ల పర్యంతమైనాడు. నన్ను డబ్బు ఏర్పాటు చేయమని ఎన్నోరకాలుగా ప్రాధేయపడ్డాడు. జాలిపడి నేను సర్దుబాటు చేశాను. నెలలో తిరిగి ఇస్తానని అన్నాడు. డబ్బు తీసుకొని మూడునెలలైంది. ఎంతో బతిమాలితే అడిగితే ఇరవై వేలు వాపసు చేశాడు. ముప్ఫైవేలు ఎగ్గొట్టాడు. నేను అతన్ని నమ్మి, జాలిపడి ఇంట్లో తెలీకుండా ఇచ్చాను. మిగిలిన డబ్బు ఇమ్మని ఎన్నోసార్లు అడిగాను. అతను ఇవ్వకపోగా, నన్ను బెదిరిస్తున్నాడు. నా క్యారెక్టర్ మంచిది కాదని ఆఫీస్‌లో ప్రచారం చేస్తానని, నా భర్తకు తెలియజేస్తానని, తీవ్రమైన మాటలతో వేధిస్తున్నాడు. ఆఫీస్‌లో నా ఫైల్స్ ధ్వంసం చేస్తానని బెదిరిస్తున్నాడు. దయచేసి నాకు పరిష్కారం తెలపండి. - బాలామణి, హైదరాబాద్ మీరు అంతపెద్దమొత్తం చేబదులు ఇచ్చినప్పుడు మీ ఇంట్లో చెప్పి ఉండవలసింది. లేకుంటే కనీసం మీ కొలీగ్స్ సమక్షంలోనైనా ఇచ్చి ఉండవలసింది. ఇలాటి బెదిరింపులనే ఐపీసీ సెక్షన్ 506 ప్రకారం నేరపూర్వక బెదిరింపులు లేదా క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. ఒక మహిళ శీలవతి కాదు అని ప్రచారం చేస్తానని బెదిరించి, భయపెడితే, ఏవైనా వస్తువులను ధ్వంసం చేస్తానని బెదిరిస్తే అది నేరమౌతుంది. రెండు నుంచి ఏడు సంవత్సరాల జైలుశిక్షపడుతుంది. ముందు మీ కుటుంబ సభ్యులకు విషయం చెప్పి, వారి సహకారం తీసుకుని క్రిమినల్ కేస్ పెట్టండి. ఇకపై ఇలాంటి వ్యవహారాల్లో జాలి, దయలను విడనాడండి. మేడమ్, మేము సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులం. మీకు చెప్పుకోవాలంటేనే బాధగా, సిగ్గుగా ఉంది. మా భార్యాభర్తలమిరువురం మా వృత్తులలో క్షణం తీరికలేకుండా ఉంటాము. మాకు ఒక్కడే బాబు. తొమ్మిది సంవత్సరాలు నిండాయి. కార్పొరేట్ స్కూల్లో వేశాం. ప్రత్యేకంగా కారు, డ్రైవర్‌ను ఏర్పాటు చేశాం. ఇంట్లో బాబు వ్యవహారాలు చూడటానికి ఒక ముప్ఫైసంవత్సరాల వ్యక్తిని పెట్టాం. అంటే కేర్‌టేకర్‌గా అన్నమాట. అతన్ని పూర్తిగా నమ్మి మేం నిశ్చింతగా ఉన్నాం. ఇటీవల బాబు తరచు అతని గురించి మాకు ఫిర్యాదులు చేస్తున్నాడు. అతను మంచివాడు కాదని చెబుతున్నాడు. మేం పట్టించుకోలేదు. బహుశా బాబును హోమ్‌వర్క్ చేసుకోమని, తినమని, ఆటలు తగ్గించి చదువుకోమని అంటున్నాడేమో అందుకని బాబుకు అతను నచ్చలేదని అనుకున్నాము. ఇంతలో మాకు మా అబ్బాయి ఒకరోజు పిడుగులాంటి మాటలు చెప్పాడు. అతను మా బాబు ప్రైవేట్ పార్ట్స్ తాకుతున్నాడని, ఎక్కడెక్కడో చేతులు వేసి హింసిస్తున్నాడని, తనకు భయమేస్తోందని, కొన్నిసార్లు కొడుతున్నాడని చెప్పాడు. బాబుపై లైంగిక దాడి జరుగుతోందని మాకు అర్థమైంది. మేం ఇన్నాళ్లూ వాడి ఫిర్యాదులు పట్టించుకోనందుకు సిగ్గుతో చితికిపోతున్నాము. మేము కేసు వేయవచ్చా? ఒక యువకుడు ఒక బాలుడి పట్ల ఇలా ప్రవర్తిస్తే అది నేరమౌతుందా? - రంజని, సురేష్; సూర్యాపేట మీ అనుమానం అర్థమైంది. కేవలం బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తేనే అది లైంగికదాడి అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ బాలుర పట్ల కూడా ఆ రకంగా ప్రవర్తిస్తే అది కూడా సెక్సువల్ అసాల్ట్ అవుతుంది. అంటే పిల్లల పట్ల (బాలురు, బాలికల) అలాంటి హేయమైన చర్యలు ఎవరు చేసినా అది నేరమౌతుంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టముంది. అదే లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ చట్టం 2012. మీ బాబుపై జరుగుతున్నది లైంగిక దాడి. సెక్షన్ 7 ప్రకారం పిల్లల ప్రైవేట్ పార్ట్స్‌ను కానీ చెస్ట్‌ను కానీ, యానల్ భాగాలను కానీ లైంగిక ఉద్దేశ్యంతో తాకినా, లేక తమ వాటిని తాకేలా ప్రోత్సహించినా అది నేరమౌతుంది. అటువంటి వారికి మూడునుండి ఐదు సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా పడుతుంది. మీరు వెంటనే కేసు వేయండి. పిల్లలకు ప్రత్యేక న్యాయస్థానాలున్నాయి. మీరు ఇకపై ఎవరినీ గుడ్డిగా నమ్మి, పిల్లల బాధ్యతను వారికి పూర్తిగా అప్పగించకండి. నేను లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నెలకోసారి నా చీరలను డ్రై క్లీనింగ్‌కి ఇస్తాను. నెలకిందట పదివిలువైన పట్టుచీరలు డ్రైక్లీనింగ్‌కి ఇచ్చాను. ఇచ్చిన వారం తర్వాత బట్టలు తెచ్చుకోవడానికి వెళ్లాను. నా చీరల్లో మూడుచీరలు దాదాపు కాలిపోయి ఉన్నాయి. షాప్ అతడిని నిలదీస్తే చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, అందువల్ల కాలిపోయాయని చెప్పాడు. అవి కొత్త చీరలు. కొని రెండు నెలలైనా కాలేదు. నా దగ్గర వాటి బిల్స్ కూడా ఉన్నాయి. వాటి విలువ చెల్లించమని అడిగాను. అతను చాలా నిర్లక్ష్యంగా వారిచ్చిన రశీదు వెనక భాగంలోని షరతులను చదవమన్నాడు. అందులో బట్టలు కాలిపోతే, దొంగతనంలో పోతే, మారిపోతే, ఆ దుస్తుల విషయంలో యజమాని బాధ్యత కేవల యాభై శాతం మాత్రమే అని ఉంది. ఇంకా అనేక షరతులు కూడా ముద్రించి ఉన్నాయి. మేడం, నిజంగా యజమాని బాధ్యత కొంతవరకేనా? నేను ఏం చేయలేనా? -డి.వరలక్ష్మి, హైదరాబాద్ సామాన్యంగా మనమెవరమూ రశీదుపై ఏం ప్రింట్ చేసి ఉందో, వెనక భాగంలో ఏమి ముద్రించి ఉందో ఏనాడూ చూడము. చూసే ప్రయత్నం చేసినా, అవి చాలా చిన్నరాతతో సూక్ష్మంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం కేసు వేయవచ్చు. మీ వద్ద రశీదు, దుస్తుల వివరాలు, వాటిని ఖరీదు చేసిన బిల్లులు ఉన్నాయి కదా! సరిగ్గా మీలాంటి కేసులోనే టిప్‌టాప్ డ్రైక్లీనర్స్ వర్సెస్ సునీల్ కుమార్ లో 2003 సంవత్సరంలో జాతీయ వినియోగదారుల కమిషన్ వారు రశీదు వెనక పక్క ఉన్న షరతులను వినియోగదారులపైన రుద్దడానికి వీలులేదని, వాటికి అతడు బద్ధుడు కాడని, ఏకపక్షంగా రాసుకున్న షరతుల వల్ల షాపు యజమానికి ఎలాంటి రక్షణా లభించదని తీర్పు చెప్పారు. మీకు చట్టప్రకారంగా షాపువారు దుస్తుల రేటును, నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి కనక మీ దుస్తుల ఖరీదు మీకు వస్తుంది. -
అటెండర్ హల్చల్ !
తప్పతాగి అధికార పార్టీ కార్యకర్త నంటూ ఆస్పత్రిలో వీరంగం చికిత్స కోసం వచ్చిన రోగులు, సిబ్బందిపై దురుసు ప్రవర్తన వైద్యాధికారికి ఫిర్యాదు, పోలీసులకు అప్పగింత పోలాకి:పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటెండర్‌గా పని చేస్తున్న లక్ష్మణదాస్ శుక్రవారం విధుల్లో ఉండగా నే తప్పతాగి ఆస్పత్రిలో హల్చల్ చేశా డు. నేను మినిస్టర్ మనిషినని.. నన్ను ఎవడూ ఏమీ పీకలేడంటూ కాసేపు వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళి తే... మధ్యాహ్నం ఒంటిగంట సమయం లో వెదుళ్లవలసకు చెందిన బేపల క్రిష్ణ తన కుమార్తె నాగమణి సహాయంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో పోలాకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న డి.లక్ష్మణరావు అక్కడకు వచ్చి సదరు రోగి పరిచయస్తుడు కావటంతో వారికి తోడుగా ఉన్నాడు. అప్పటికే తప్పతాగి ఉన్న అటెండర్ లక్ష్మణదాస్ ఆస్పత్రికి రావటానికి టైము..పాడు ఉండదా? అంటూ వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఉపాధ్యాయుడిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో అడ్డుకున్న సిబ్బందిపై కూడా బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. వైద్యాధికారి టేబుల్‌పై ఉన్న కాగితాలు చింపేయడమే కాకుండా..మీరే చింపేశారంటూ బెదిరిం చాడు. ఈ విషయాన్ని వైద్యాధికారి శిమ్మ ఇందుసింహకు లక్ష్మణరావు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మీడియా, వైద్యాధికారి సమక్షంలో కూడా నేను అధికార పార్టీ కార్యకర్తను అంటూ రెండువేళ్లు చూపుతూ అక్కడున్న చంద్రబాబు ఫొటో ముందు లక్ష్మణదాస్ డాన్స్ చేశాడు. కాసేపు వైద్యాధికారి గదిలోనే పడుకుని మత్తువదిలే వరకు ఉండి తరువాత బయటకు వచ్చాడు. అప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో తాగుబోతు అటెండరును పోలీసులకు అప్పగించారు. నిత్యం ఇదేతంతు సదరు అటెండర్ విధులకు రోజూ మద్యం సేవించి రావటమే కాకుండా దురుసుగా ప్రవ ర్తిస్తుంటాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఒక్కోసారి వైద్యాధికారిని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన సందర్భాలున్నాయని, అయినా భరిస్తూ వస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై లిఖితపూర్వంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని వైద్యాధికారి ఇందుసింహా తెలిపారు. ఖండించిన ఉపాధ్యాయ సంఘాలు మానవతా దృక్పథంతో ఆస్పత్రికి వెళ్లిన ఉపాధ్యాయుడిపై అక్కడి అటెండర్ తప్పతాగి దాడి చేయటాన్ని మండలంలోని ఉపాధ్యాయసంఘనాయకులంతా ఖండించారు. ఈ సంఘటనను సంబంధిత శాఖాధికారులు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ కార్యకర్తనంటూ బెదిరిస్తే ఊరుకునేదిలేదని సంఘ నాయకులు కె.ఆదినారాయణ, బాడాన రాజు అన్నారు. -
‘దొర’బాబులూ కొండ దిగాల్సిందే!
తిరుమల కొండపై తిష్టవేసిన దొరబాబుల బదిలీలకు రంగం సిద్ధం కీలక స్థానాల కోసం జోరందుకున్న పైరవీలు కుదరదంటున్న అధికారులు అటెండర్‌ను కదిలించాలన్నా అమాత్యుల నుంచి ఫోన్లు సాక్షి, తిరుమల : తిరుమల కొండపై దీర్ఘకాలంగా తిష్టవేసి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేం దుకు రంగం సిద్ధమైంది. ఇటీవల దర్శన వ్యాపారం చేస్తూ వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో ఇద్దరు ఉద్యోగులు, భక్తుల కానుకలు అపహరిస్తూ మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు పట్టుబడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆలయ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యల్ని వేగవంతం చేశారు. మరోవైపు తమ బదిలీలను ఆపుకునేందుకు, కొత్త పోస్టుల్లో తిష్టవేసేందుకు రాజధాని స్థాయి నుంచి పైరవీలు జోరందుకున్నాయి. అందుకు ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నా.. అనుకున్న విధంగా అమలు చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొండపై కీలక విభాగాల జాబితాపై ఉన్నతాధికారుల కసరతు తిరుమలలో ఇటీవల వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లో సూపరింటెండెంట్, మరో అసిస్టెంట్ షరాబు కాంట్రాక్టు ఉద్యోగితో కలిసి రూ.300 టికెట్లతో అక్రమ వ్యాపారాలు సాగిస్తూ పట్టుబడ్డారు. అలాగే స్వామి సన్నిధిలోనే భక్తులు వేసిన కానుకల్ని చాకచక్యంగా అపహరిస్తూ ఇద్దరు మహిళా ఉద్యోగులు సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. రిసెప్షన్ విభాగాల్లో ఉద్యోగులు కొం దరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ఆధారాలతోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వారు ఈ విషయాల్ని తీవ్రంగా పరిగణించి దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని భావించారు. ఈ నేపథ్యంలో దశలవారీగా ఉద్యోగులను బదిలీ చేయాలని కసరత్తు ఆరంభించారు. తిరుమలలో వివిధ శాఖల్లో ఆరోపణలు ఉన్నవారు, రెండేళ్ల పదవీ కాలం నిండినవారిని స్థాన చలనం చేయడం ఉత్తమమని భావిస్తున్నారు. దీని వల్ల అవినీతి ఆరోపణలు కొంతమేర తగ్గించడం, అక్రమాలకు అడ్డుకట్టవేసే అవకాశాలుంటాయనే భావనలో ఉన్నధికారులు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అటెండర్ స్థాయి నుంచి అధికారుల స్థాయి వరకు జాబితాను సిద్ధంచేసే పనిలో పడ్డారు. ఇదే రీతిలో పైరవీలూ జోరందుకున్నాయి. అందుకు ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నట్టు సమాచారం. కీలక స్థానాల్లో కదిలిస్తే అమాత్యుల స్థాయిలో పైరవీలు తిరుమలలో ప్రధానంగా శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంపెక్స్, రిసెప్షన్ విభాగం, ధర్మకర్తల మండలి చైర్మన్, బోర్డు సభ్యుల వద్ద పనిచేసేందుకే అధిక శాతం ఉద్యోగులు మొగ్గు చూపుతారు. ఇక్కడ సీటు సంపాదించేందుకు తమతమ సామాజిక వర్గాలకు చెందిన అమాత్యుల నుంచి రాష్ర్ట రాజధానిలోని ముఖ్య పేషీ వరకు పైరవీలు సాగిస్తారు. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో టీటీడీలో పెరిగిపోయింది. పోస్టులో చేరిన వ్యక్తి రెండు కాదు.. ఐదారేళ్లు ముగిసినా తిరిగి మరోచోటుకు బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో? అర్థమవుతోంది. కీలక స్థానాల్లో పనిచేసే కొందరిని కదిపితే తమ స్థానాలకే ఎసరు పెడతారేమో? అన్న సందేహాన్ని ఉన్నతాధికా ఒకరు వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శనం. అటెండర్ స్థాయి బదిలీ విషయంపై మాట్లాడితే ఏకంగా తన సెల్‌ఫోన్ నుంచే హైదరాబాద్‌లో ఉన్న మంత్రితోనో, మరో ముఖ్యపేషీలోని ఉన్నతాధికారితోనో నేరుగా మాట్లాడించే పరిస్థితి ఎదురువుతోంది.. అని మరో ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. తీవ్ర ఒత్తిడుల నడుమ పారదర్శకమైన బదిలీలు సాధ్యమా? అన్నదీ ప్రశ్నార్థకమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు అనుకున్న విధంగానే తిరుమలకొండపై తిష్టవేసిన దొరబాబులను కొండ దించుతారా? అన్నది వేచి చూడాలి మరి.