athreyapuram
-
రుచితో అదరగొట్టే మధురాలు, ఈ పూతరేకులు
-
అదో 'జాదూ' కుటుంబం
సాక్షి, ఆత్రేయపురం: చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా కళ్లప్పగించి సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ మధ్య మధ్య చప్పట్లు కొడుతూ ఆసక్తిగా తిలకించే ప్రదర్శన ఇంద్రజాలం. అతి ప్రాచీన భారతీయ కళ ఇది. కోల్‌కతాలో పుట్టి తన ఇంద్రజాలంతో ప్రపంచాన్ని సమ్మోహనం చేసిన సీనియర్ పీసీ సర్కార్ జయంతి ఆదివారం. ఈ రోజును అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సర్కార్‌ను ఆదర్శంగా తీసుకుని ధనంతో పని లేకుండా ఇంద్రజాలంతో సమాజ సేవ చేయవచ్చని నిరూపిస్తున్నారు ఆ ఇంద్రజాలికుల కుటుంబం. ఒక ఇంద్రజాలికుడి ప్రదర్శన తిలకించడమే అద్భుతమంటే.. ఇంటిల్లిపాదీ ఇంద్రజాలికులై వారి ప్రదర్శనలు చూడాలంటే రెండు కళ్లూ చాలవు కదూ. ఆ వేడుక చూడాలంటే జిల్లాలోని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో కేశవ స్వామి గుడి వీధిలోని ప్రముఖ ఇంద్రజాలికుడు శ్యామ్ జాదూగర్ ఇంటికి వెళ్లాల్సిందే. గ్రామానికి చెందిన చింతా శ్యామ్ కుమార్ లొల్ల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ. వారి సంతానం చింతా తేజశ్రీ రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయినిగా, కుమారుడు మోహిత్ ఫిజియోథెరపీలో డిగ్రీ చదువుతున్నాడు. శ్యామ్‌ను అభినందిస్తున్న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రదర్శనలు ఆంధ్రా పీసీ సర్కార్‌గా పేరు తెచ్చుకున్న చింతా శ్యామ్ కుమార్ ‘శ్యామ్ జాదూగర్’ వేదిక పేరుతో ఇంద్రజాల, మనస్తత్వ రంగాల్లో పలు ప్రపంచ రికార్డులను సాధించారు. ఇతని ప్రదర్శన అంటే సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విదేశీయులు, సినీ ప్రముఖులు ఆసక్తిగా తిలకిస్తూ మంత్ర ముగ్ధులవుతారు. ప్రపంచంలోనే అతి తక్కువ మందికి తెలిసిన బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ (కళ్లకు గంతలు కట్టుకుని వాహనాలు నడపడం, ఇంద్రజాల ప్రదర్శనలు చేయడం) ను ఉపయోగించి ఆయన సమాజాన్ని చైతన్యపరచడానికి కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లో మేధస్సును పెంచడానికి తన ఇంటిలో బ్రెయిన్ జిమ్‌ను నిర్వహిస్తున్నారు. శ్యామ్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమాజ సేవలో.. బాగా సంపాదించాక సమాజ సేవ చేద్దామనుకుంటారు చాలామంది. సమాజ సేవ డబ్బుతో కూడుకున్నదనే భావన చాలా మందిలో ఉంది. అది తప్పని.. కళ ద్వారా చేయవచ్చనని శ్యామ్ కుటుంబ సభ్యులు నిరూపిస్తున్నారు. తమ ఇంట్లో నిర్మించిన ‘అబ్రక దబ్ర’ కళా వేదిక ద్వారా ఎన్నో అవగాహన సదస్సులను నిర్వహించడంతో పాటు, మ్యాజిక్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా తాము దాచుకున్న మొత్తంలో కొంత వృద్ధులకు , పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు. బ్రెయిన్ జిమ్‌ను నిర్వహిస్తూ విద్యార్థుల్లో మైండ్ పవర్‌ను అభివృద్ధి చేయడంతో పాటు జీవితంలో సరైన లక్ష్యాలు నిర్దేశించుకోలేక ఆత్మహత్యలు చేసుకునే ఎంతో మందికి మంచి జీవితాన్ని ప్రసాదించారు. శ్యామ్‌ను అభినందిస్తున్న పాతపాటి కుటుంబ సభ్యులు రికార్డులు, అవార్డులు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు, అవార్డులతో పాటు సత్కారాలను అందుకున్నారు. అంతే కాకుండా వివిధ వైకల్యాలతో ఉన్న వారికి ఇంద్రజాలంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని కూడ రికార్డులోకి ఎక్కించిన ఘనత వీరిది. ఇప్పటి వరకూ శ్యామ్ సుమారు 20 రికార్డులు కైవసం చేసుకోగా మోహిత్ 3 రికార్డులు, తేజశ్రీ రెండు రికార్డులను కైవసం చేసుకున్నారు. శ్యామ్, మోహిత్, తేజశ్రీ వివిధ రకాల అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. కాగా మీరు మీ సమస్యలతో సతమతమవుతూ సరైన లక్ష్యాన్ని నిర్ణయించుకోలేక పోతున్నట్టయితే ప్రతి రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య 98663 72645 నంబర్‌కు ఫోన్ చేసి ఉచిత కౌన్సిలింగ్ పొందవచ్చని వారు అంటున్నారు. -
కనుమరుగవుతున్న లంక భూములు
సాక్షి, ఆత్రేయపురం(తూర్పుగోదావరి) : మండలంలో పలు గ్రామాల్లో విలువైన లంక భూములు నదీపాతానికి గురవుతున్నాయి. తద్వారా ఏటిగట్లు పటిష్టతకు విఘాతం ఏర్పడుతుందని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో బొబ్బర్లంక వద్ద గౌతమీ కుడిగట్టు, వశిష్టా ఎడమగట్టు ప్రాంతంలో లంక భూములు కోతకు గురవుతున్నాయి. అలాగే తాడిపూడి, వసంతవాడ, పులిదిండి, రాజవరం గ్రామాల్లో సైతం లంక భూములు అండలు జారి కనుమరుగవుతున్నాయి. ఈ భూముల్లో ఎందరో పేద రైతులు అరటి తదితర పంటలను పండించుకుని జీవనోపాధి పొందుతున్నారు. వెంటనే లంక భూములు కోతకు గురి కాకుండా గ్రోయిన్లు నిర్మించి పట్టిష్టతకు చర్యలు చేపట్టాలని ఈప్రాంత రైతులు కోరుతున్నారు. అలాగే గతంలో ఏటిగట్ల ఆధునికీకరణ పనుల్లో భాగంగా మండలంలో పేరవరం, వద్దిపర్రు, ఆత్రేయపురం, మెర్లపాలెం తదితర ప్రాంతాల్లో పనులు చేపట్టకపోవడంతో గట్లు బలహీనంగా ఉన్నాయని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గట్లపై గతంలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలించుకోవడానికి రోడ్లు అనువుగా ఉండేవి. కానీ ఇటీవల ఆధునికీకరణ పనుల అనంతరం ఏటిగట్లపై కనీసం నడవడానికి సైతం అనుకూలంగా లేవు. సుమారు 12 ఏళ్లుగా వరదలకు లంక భూములు నదీ కోతకు గురి కావడంతో విద్యుత్ మోటార్లతో పాటు కొబ్బరిచెట్లు నదికోతకు గురై నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మండలంలో సుమారు 300 ఎకరాల లంక భూములు నదీపాతానికి గురైనట్టు సమాచారం. అనేకసార్లు వరసగా వచ్చిన వరదలతో ఆత్రేయపురం మండంలో పలు గ్రామాల్లో లంక భూములు కోతకు గురై పంట పొలాలు గోదావరిలో కలిసిపోయాని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సారవంతమైన, ఉద్యాన పంటలు పండే భూముల్ని నదీపాతానికి గురికాకుండా ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతకు గురైన చోట గ్రోయిన్లు ఏర్పాటు చేసి ఏటిగట్లకు గ్రావెల్‌రోడ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం
ఆత్రేయపురం: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీకీ అనుకూల పవనాలు వీస్తున్నాయని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఆత్రేయపురం మండలం ర్యాలిలో ఇంటింటా పర్యటించి ప్రజలను ఫ్యాన్ గుర్తుపై తనను, ఎంపీ అభ్యర్థిగా చింతా అనురాధకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ పర్యటనలో జగ్గిరెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు. ర్యాలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు పాలన అవినీతిమయమన్నారు. పేద ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఏమాత్రం శ్రద్ధ చూపని చంద్రబాబు ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసి గెలవాలనుకుంటున్నారని ప్రజలు గ్రహించాలన్నారు. డ్వాక్రా గ్రూపుల మహిళలకు 1.92 లక్షలు ఎగ్గొట్టి కేవలం ప్రతి మహిళ ఖాతాలో రూ.10 వేలు దఫదఫాలుగా వేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అలాగే నియోజకవర్గంలో అధికార పార్టీనేతలు గ్రూపులుగా ఏర్పడి అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇతర సంక్షేమ పథకాలు కొల్లగొట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియా నడిపి ప్రజల సొమ్ములు దోచుకున్నారని ఆరోపించారు. గ్రామంలో పీఎస్‌రెడ్డి జయపాల్ స్వగృహం వద్ద దివంగతనేత వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే దళిత వాడలో వైఎస్సార్సీపీ మండల బూత్ కమిటీ మేనేజర్ కప్పల శ్రీధర్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మద్దూరి సుబ్బలక్ష్మి, మాజీ సర్పంచ్ పేర్చేర్ల పుల్లంరాజు వర్మ, రూరల్ బ్యాంక్ అధ్యక్షుడు పుల్లంరాజు, వైఎస్సార్సీపీ నాయకులు బోణం సాయిబాబు, మెర్ల వెంకటేశ్వరరావు, ఈలి శ్రీరామచంద్రమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ పార్టీల నుంచి వైఎస్సార్సీపీలో పలువురి చేరిక మండలంలోని ర్యాలిలో సోమవారం వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ర్యాలికి చెందిన పసలపూడి వెంకట్, నరుకుల నరసింహమూర్తి, వెలిగేటి దానయ్య, బుడ్డిగ వీరపండు, శ్రీను, దానయ్య, గోవిందు, అయ్య ప్ప, నర్సయ్య, నాగయ్య, రాంబాబుతో పాటు సుమారు 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరిని ఎమ్మె ల్యే చిర్ల జగ్గిరెడ్డి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బండారు స్వగ్రామంలో జగ్గిరెడ్డికి జన నీరాజనం వాడపాలెం (కొత్తపేట): వైఎస్సార్సీపీ నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు స్వగ్రామం వాడపాలెం ప్రజలు నీరాజనాలు పట్టారు. జగ్గిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడపాలెం చేరుకోగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఎదురేగి అఖండ స్వాగతం పలికారు. పూలమాలలతో ముంచెత్తి, బ్రహ్మరథం పట్టారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు గనిశెట్టి చంద్రశేఖర్, గ్రామ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సాగిన ప్రచారంలో అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు. ప్రధాన గ్రామాల్లోని రోడ్లలో ప్రచారరథంపై రోడ్‌షో నిర్వహించగా, పక్క వీధుల్లో కాలినడకన ఇంటింటి ప్రచారం చేసి ప్రజలకు జగ్గిరెడ్డి ముకుళిత హస్తాలతో నమస్కరిçస్తూ ఓట్లను అభ్యర్థించారు. పలు వీధుల్లో మహిళలు ఇళ్లు నుంచి బయటకు వచ్చి మరీ మద్దతు తెలిపారు. ట్రస్ట్ భూములు అమ్ముకోవడమే ప్రజాసేవా? జగ్గిరెడ్డి పేద ప్రజలు, విద్యార్థుల కోసం దాత జంపా వీరభద్రరావు ఇచ్చిన భూములను సెంటు రూ.3, 4 లక్షలకు అమ్ముకోవడమే స్థానిక టీడీపీ నాయకుడు ప్రజా సేవా? అని వైఎస్సార్సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి, టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావును ఉద్దేశించి విమర్శించారు. వాడపాలెం దేవీ సెంటర్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు అధికారానికి దూరం చేసినా, టీడీపీ ప్రభుత్వ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన తండ్రి సోమసుందరరెడ్డి హయాంలో ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. దాత ఇచ్చిన భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచకుండా స్థానిక టీడీపీ నేత కైంకర్యం చేశారని ఆరోపించారు. బిళ్లకుర్రు విద్యుత్ సబ్‌స్టేషన్ షిప్టు ఆపరేటర్ పోస్టులను రూ.5, 7 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో ఆఖరి ఏడాది వచ్చిన ఇళ్లు అర్హులకు మంజూరు కాలేదని, ఒకటీ, రెండూ ఇచ్చినా బిల్లులు కూడా ఇవ్వలేదన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో తన వెంట ఉన్న కాపులు ఉద్యమంలోకి వెళితే అడ్డుచెప్పలేదన్నారు. వారిపై టీడీపీ నేతలు కేసులు పెట్టించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమ ఫలి తంగా ఏర్పడిన కాపు కార్పొరేషన్ ద్వారా ఉద్యమ సమయంలో ఇంట్లో కూర్చు న్న వారికి, ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులను విమర్శించిన వారికి రుణాలు వచ్చాయని, కడుపుకాలిన కాపు సోదరులు రుణాలు కోరితే రూ.10, రూ.15 వేలు డిమాండ్ చేశారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జగన్ సీఎం అయ్యాక అర్హులైన కాపులకు, బీసీలకు రూ.వేల కోట్లతో రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటార ని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్సీపీ సం యుక్త కార్యదర్శి జి.డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎం.గం గాధరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, ఆ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ, బి.కృష్ణమూర్తి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎన్.భీమరాజు, పార్టీ నాయకులు మట్టా బాబ్జి, పెదపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక వానపల్లి సాంబశివపేట గ్రామంలో టీడీకి చెందిన పెచ్చెట్టి దుర్గాప్రసాద్, కోరిమిల్లి శ్రీనివాసరావు సహా 25 మంది వైఎస్సార్సీపీ నాయకుడు వనుము నాగేంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి జగ్గిరెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా స్వాగతం పలికారు. టీడీపీ కవ్వింపు చర్యలు.. పోలీసుల రంగ ప్రవేశం వాడపాలెంలో వైఎస్సార్సీపీ ప్రచార సమయంలో స్థానిక టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. జగ్గిరెడ్డి ప్రచారంలో, దేవీ సెంటర్లో ప్రసంగం సమయంలో టీడీపీ ప్రచార వాహనాలు అడ్డుగా మళ్లించడం, ఆ ప్రచార వాహనాలను అక్కడే నిలపి ఆ పాటలతో కవ్వింపుకు పాల్పడ్డారు. ఈ సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దాంతో టీడీపీ ప్రచార వాహనాలను అక్కడి నుంచి మళ్లించారు. టీడీపీ యువ నేతలు వైఎస్సార్సీపీలో చేరిక ఆలమూరు: గ్రామంలో పలువురు టీడీపీ యువజన విభాగం నేతలు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన టీడీపీ యాదవ సంఘం విభాగం అధ్యక్షుడు గంగుల ఫణీంద్రయాదవ్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా అహ్వానించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం జగన్ ప్రకటించిన నవరత్నాలు, నియోజకవర్గ సమస్యలపై జగ్గిరెడ్డి పోరాడుతున్న తీరు పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు ఎ.జయరామ్, వి.సతీష్ తెలిపారు. వైఎస్సార్సీపీ గెలుపునకు అహర్నిశలు శ్రమిస్తామని వారు హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, మేకా అబ్బు, చల్లా నానాజీ, ఇ.గణేష్, ఎస్కె.షరీఫ్, వనుం సూరిబాబు, ఎస్కే అజీజ్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలపై రైతు ఫిర్యాదు
ర్యాలి(ఆత్రేయపురం), న్యూస్‌లైన్ : సాగు చేసేందుకు కొనుగోలు చేసిన విత్తనాల్లో బియ్యం, ముక్కిపోయిన ధాన్యం ఉన్నాయని ఓ రైతు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ర్యాలి గ్రామానికి చెందిన రైతు గెడ్డం సత్తిబాబు ఆరు ఎకరాల వరి చేను కౌలుకు సాగు చేస్తున్నాడు. తుపాన్లు, భారీ వర్షాలతో రెండేళ్లుగా పంట నష్టపోయాడు. రబీకి నారుమడి వేసేందుకు రావులపాలెంలోని ప్రైవేట్ విత్తనాల షాపులో 30 కిలోల (8 బస్తాలు) విత్తనాలు కొనుగోలు చేశాడు. రెండు బస్తాల విత్తనాలను చేలో వేయగా, మిగలిన 6 బస్తాల్లోని రెండింటిలో నకిలీ విత్తనాలు ఉన్నాయి. వాటిని నానబెట్టినా మొలకొచ్చే పరిస్థితి లేదని గ్రహించి దీనిపై మండల వ్యవసాయాధికారి భార్గవ్ మహేష్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని ఏఓ మహేష్ హామీ ఇచ్చారు. అనేక మంది రైతులు డీలర్ల మోసాలకు తీవ్రంగా నష్టపోతున్నారని కొందరు రైతులు ‘న్యూస్‌లైన్’ దృష్టికి తీసుకొచ్చారు. ఏఓ భార్గవ్ మహేష్ మాట్లాడుతూ రైతులు ఎక్కడపడితే అక్కడ విత్తనాలు కొనుగోలు చేయకుండా, సర్టిఫై చేసిన విత్తనాలనే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.