The Atlantic Ocean
-
మహా సముద్రం అడుగున 10 రోజులు
వాషింగ్టన్: నలుగురు సభ్యుల బృందాన్ని 10 రోజులపాటు అట్లాంటిక్ మహాసముద్రం అడుగుకు పంపించి నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) పరిశోధనలు సాగించనుంది. ఈ పరిశోధన ద్వారా అంతరిక్షంలో అంగారక గ్రహంపై ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేసి, భవిష్యత్తు అంతరిక్ష కార్యక్రమాలకు సన్నద్ధం కానుంది. ఈ కార్యక్రమానికి నీమో (నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్)–22 అని పేరు పెట్టారు. సముద్రం అడుగున గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుందనీ, అక్కడ ఉంటే దాదాపు అంతరిక్షంలో ఉన్నట్లేనని దక్షిణ ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్షంలోలాగే సముద్రం అడుగున నడవడం తదితరాలను బృందంలోని సభ్యులు సాధన చేయనున్నారు. భవిష్యత్తులో అంతరిక్ష కార్యక్రమాలలో అనుసరించే విధానాలు, సాధనాలను ఇక్కడ పరీక్షించనున్నారు. జూన్ 18న ఈ బృందం సముద్రం అడుగుకు వెళ్తుంది. -
మురికివాడ.. మురికి నీటిలో..
ఇది నైజీరియాలోని లాగోస్‌లో ఉన్న మకోకో మురికివాడ. ఇలాంటి మురికివాడ ప్రపంచంలో మరెక్కడా లేదేమో.. ఎందుకంటే.. ఇది నీటిపై తేలియాడే మురికివాడ. ఇక్కడి ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు. ఎక్కువ మంది మత్స్యకారులే. 18వ శతాబ్దంలో చిన్న బెస్త గ్రామంగా మొదలైన మకోకో.. ఇప్పుడు భారీ మురికివాడగా మారిపోయింది. ఈ ఇళ్లన్నీ కర్రలతో కట్టినవే. ఇప్పుడక్కడ లక్షన్నర నుంచి 2 లక్షల మంది నివసిస్తున్నారు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలన్నా.. చిన్నచిన్న పడవలను ఆశ్రయించాల్సిందే. ఈ సరస్సు అట్లాంటిక్ సముద్రానికి సమీపంలో ఉంది. సరస్సు నీరంతా కలుషితమైపోయి.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంటుంది. పారిశుద్ధ్య సమస్యను కారణంగా చూపుతూ.. ఇవి అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ.. 2012లో అక్కడి ప్రభుత్వం ఈ మురికివాడలోని కొన్ని ఇళ్లను కూల్చివేసింది. తర్వాత మీడియాలో గగ్గోలు రేగడంతో ఆపేసింది. ఇటీవల వీరికి నీటిపై తేలియాడే స్కూలును సర్కారు కట్టించింది. త్వరలోనే వీరందరినీ వేరే చోటికి తరలించి, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
అత్యంత ఖరీదైన గాలింపు..!
-
అత్యంత ఖరీదైన గాలింపు..!
విమానం కోసం రూ.264 కోట్ల వ్యయం గల్లంతై నెలైనా ఆచూకీ లేని మలేసియా బోయింగ్ సిడ్నీ(ఆస్ట్రేలియా): సముద్రంలో కుప్పకూలినట్లు భావిస్తున్న మలేసియా బోయింగ్ ఎంహెచ్ 370 విమానం ఆచూకీ కోసం రూ.వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చవుతున్నాయి. భారీ యుద్ధనౌకలు, విమానాలతో నెల రోజులకుపైగా అన్వేషిస్తున్నా ఇంతవరకు ఫలితం దక్కకున్నా వ్యయం మాత్రం తడిసిమోపెడవుతోంది. ఈ గాలింపు వైమానికయాన చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్నారు. 26 దేశాలకు చెందిన యుద్ధవిమానాలు, నౌకలు, జలాంతర్గాములు, ఉపగ్రహాల సాయంతో దక్షిణ హిందూ మహాసముద్రాన్ని జల్లెడ పడుతుండడం తెలిసిందే. వీటిని మోహరించేందుకు ఇప్పటికే సుమారు రూ.264 కోట్లు ఖర్చయినట్లు రక్షణరంగ నిపుణుల అంచనా. ఇందులో సగాన్ని ఆస్ట్రేలియానే భరించింది. నెల కిందట గల్లంతైన ఈ విమానం ఆచూకీ కనిపెట్టేందుకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు గాలింపునకు నేతృత్వం వహిస్తున్న రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆంగస్ హ్యూస్టన్ చెప్పారు. అయితే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామనేది సమస్య కాదని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ఇప్పటికే స్పష్టం చేశారు. 2009లో అట్లాంటిక్ మహాసముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం బ్లాక్‌బాక్స్ వెలికితీతకు వెచ్చించిన డబ్బు కంటే తాజాగా రెట్టింపు ఖర్చయినట్లు భావిస్తున్నారు. గల్లంతైన విమాన ప్రయాణికుల్లో అత్యధికులు చైనా వారే కావడంతో ఆ దేశం 18 నౌకలు, 8 హెలికాప్టర్లతో గాలిస్తోంది. చైనా యుద్ధనౌకల కోసం రోజుకు రూ.62 లక్షలు ఖర్చవుతోంది. తాము రూ.18.6 కోట్లు వెచ్చించినట్లు అమెరికా తెలిపింది. కాగా, మంగళవారం గాలించిన నౌకలకు బ్లాక్స్బాక్స్లకు సంబంధించి ఎలాంటి సంకేతాలూ అందలేదు. మలేసియా విమానంలోని బ్లాక్స్‌బాక్స్ బ్యాటరీల 30 రోజుల జీవితకాలం ముగింపునకు చేరడంతో గాలింపును ముమ్మరం చేశారు.