మొహంపై సలసల కాగిన నూనె పోశాడు..
మీరట్: మద్యం మానివేయమని భార్య చెప్పిన మాటలు ఆ భర్తకు ఆగ్రహం తెప్పించింది. దాంతో తన ఇద్దరి స్నేహితులతో కలసి భర్త విజయ్‌పాల్ భార్య సంతోష్ మొహంపై సలసల కాగిన నూనె పోశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ మీరట్ ఉత్తమ్‌నగర్‌లోని గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విజయ్ పాల్ ఇంటికి చేరుకుని... సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తమ్‌నగర్‌లో నివసిస్తున్న విజయ్‌పాల్, సంతోష్ భార్యభర్తలు.
విజయ్‌పాల్ తాగుడు అలవాటు అయింది. ఆ క్రమంలో రోజు తప్ప తాగి ఇంటికి వస్తున్న భర్తపై ఆమె ఆగ్రహించింది. తాగుడు మానివేయాలని అతడిని కోరింది. ఎప్పటిలాగే గురువారం విజయ్‌పాల్ తప్పతాగి అతడి ఇద్దరు స్నేహితులు కృష్ణాపాల్, అశోక్‌తో ఇంటి వచ్చాడు. దీంతో సంతోష్‌తోపాటు అతడి స్నేహితులతో ఆమె వాగ్వివాదానికి దిగింది.
దాంతో ఆగ్రహించిన విజయ్ పాల్ అతడి స్నేహితుల కలసి సంతోష్ ముఖంపై వేడివేడి నూనె పోశాడు. అయితే ఈ ఘటనలో భర్త విజయ్‌పాల్, కృష్ణాపాల్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.