Auto driver attack
-
‘నీళ్లు ఇవ్వరా కొడకా’.. అన్నందుకు హత్య
కర్ణాటక (యశవంతపుర): నీళ్లు ఇవ్వరా కొడకా అన్నందుకు ఒక ఆటో డ్రైవర్‌పై మరొక డ్రైవర్ దాడిచేసి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన నగరంలో పీణ్య పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆటో డ్రైవర్ అజయ్ జాలహళ్లి క్రాస్ ఆటోస్టాండ్‌లో ఉండగా మరొక ఆటో డ్రైవర్ సిద్ధిక్ (23)వెళ్లి... ఏమిరా కొడకా, నీళ్లు ఉంటే ఇస్తావా అని అడిగాడు. తీవ్ర కోపానికి గురైన అజయ్ సిద్ధిక్‌తో గొడవ పడ్డాడు. నన్నే కొడకా అంటావా? అని దాడి చేశాడు. అజయ్ చాకుతో పొడవడంతో తీవ్ర గాయాలైన సిద్దిక్‌ను ఇతర ఆటో డ్రైవర్లు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. -
ఒంటరి మహిలళే వారి టార్గెట్!
సాక్షి, గుంటూరు: ఒంటరిగా రోడ్డుపై నిలిచి ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఆటోలో ప్రయాణికుల మాదిరిగా ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశాలకు తీసుకెళ్లి దోపిడీ, లైంగికదాడికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు, అతడికి సహకరించిన మరో ముగ్గురు ముఠా సభ్యులను కూడా గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసు స్టేషన్లో ఏఎస్పీ ఎస్.రాఘవ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సత్తెనపల్లికి చెందిన పల్లపు రమేష్, అతడి భార్య దుర్గ, స్నేహితులు తన్నీరు గోపి, నూర్‌బాషా ఖాశింలు ముఠాగా ఏర్పడ్డారు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. అందుకు ఆటోను ఎంచుకుని డ్రైవర్‌గా రమేష్, మిగిలిన ముగ్గురు ప్రయాణికుల్లా రోడ్డుపై వెళుతున్న ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఆటోలో ఎక్కించుకునేవారు. ఈ నెల 2వ తేదీన అమరావతి మండలం 14వ మైలుకు చెందిన ఓ మహిళ నిడుముక్కల గ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తున్న సమయంలో ఆటో ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, బంగారం చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, గురువారం నలుగురు నిందితులు గుంటూరులోని పూలమార్కెట్ సెంటర్లో బంగారం విక్రయించేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించడంతో వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు పల్లపు రమేష్‌పై సత్తెనపల్లి, తెనాలి, గుంటూరు అర్బన్ పరిధిలోని నల్లపాడు పోలీసు స్టేషన్లో మొత్తం 12 కేసులు నమోదయ్యాయని ఏఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకోవాడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీలక్ష్మి, సీఐలు శేషగిరిరావు, మల్లికార్జునరావు, వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
నీకు గతంలోనే చెప్పాను.. అయినా వినవా?
కమలాపురం: మండల పరిధిలోని లేటపల్లెకు చెందిన ఆటో డ్రైవర్‌పై కమలాపురం ఎస్ఐ మహమ్మద్ రఫీ దాడి చేశారు. వంగబెట్టి వీపుపై పిడిగుద్దులు గుద్దడంతో స్పృహ కోల్పోయిన ఆయనను రిమ్స్‌కు తరలించారు. బాధితుడి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ రాపూరి చంద్ర శుక్రవారం ఎటూరు సమీపంలో వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తున్న కూలీలను తన ఆటోలో ఎక్కించుకిని వస్తుండగా.. కుందూ వంతెనపై ఉన్న కమలాపురం ఎస్ఐ ఆపాడు. ‘నీకు గతంలోనే చెప్పాను.. కూలీలను ఎక్కించుకొని రావద్దని. అయినా వినవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి కూలీలను తీసుకు వచ్చావని నెపం పెడుతూ.. జుట్టు పట్టుకొని వంగ బెట్టి వీపుపై పిడి గుద్దులు గుద్దుతూ, వంతెన రక్షణ గోడకు తగిలించి కొట్టడంతో స్పృహ తప్పి పడి పోయాడు. కేవలం నలుగురే ప్రయాణికులు ఉన్నా.. ఎందుకు కొడుతున్నావని ఆటో డ్రైవర్ భార్య ఎస్ఐని ప్రశ్నించగా.. ఎక్కువ మాట్లాడితే నిన్ను ఏట్లో పడేస్తా అని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వారు ఏమీ మాట్లాడలేకపోయారు. బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ శనివారం మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. తనపై గతంలో రెండు సార్లు దాడి చేశాడని, ఇది మూడో సారి అని వాపోయాడు. అసలు తనపై ఎందుకు దాడి చేస్తున్నాడో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికైనా ఈ ఎస్ఐ పై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాగే ప్రవర్తిస్తే పోలీసులకు చెడ్డ పేరు వస్తుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కమలాపురం ఎస్ఐపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డిని వివరణ కోరగా విచారణచేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్ఐ ప్రవర్తన సరికాదు కమలాపురం అర్బన్ : కమలాపురం ఎస్ఐ మహమ్మద్‌రఫీ ప్రవర్తన సరికాదని ఎమ్మెల్యే పి.రవీంద్రనా«థ్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఎస్సై సామాన్య ప్రజలపై ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఆయన ఆక్షేపించారు. రోజురోజుకు ఎస్ఐ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. సివిల్ పంచాయతీలలో తలదూర్చి దళితుల పట్ల దురుసుగా వ్యవహరించి.. వారిపై చెయ్యి చేసుకోవడంతో గాయపడి ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఇటీవల గంగవరంలో దళిత మహిళ అయిన గంగాదేవిపై చెయ్యి చేసుకోవడంతో మనస్థాపానికి గురై అవమాన భారంతో విషద్రావణం తాగి ఆసుపత్రి పాలైందన్నారు. అయితే టీడీపీ నేతలు ఆ కేసును బలహీన పరచారన్నారు. అలాగే మీరాపరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రామిరెడ్డి ఛాతిపై బూటుకాలతో తన్ని, చిత్ర హింసల పాలు చేశారన్నారు. అంతేకాక శుక్రవారం పట్టణానికి సమీపంలో కుందూ నదీ వద్ద వినాయక నిమజ్జనం చేసేందుకు వచ్చిన లేటపల్లె గ్రామానికి చెందిన దళిత యువకుడి ఆటోను ఆపి.. డ్రైవర్‌ను చితక బాదడంతో తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలడంతో కడప రిమ్స్‌కు తరలించారన్నారు. లేటపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ చంద్ర రిమ్స్ ఔట్‌పోస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఆ కేసును బలహీన పరిచేందుకు కడప డివిజన్‌కు చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్‌పై ఎస్సై దాడి చేసిన సంఘటనకు సంబంధించి.. వెంటనే ఎస్సైని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా ఆటో డ్రైవర్ల యూనియన్, వామపక్షాల నేతలు స్థానిక మూడు రోడ్ల కూడలిలో ఆందోళనకు దిగారు. దీంతో సీఐ కొండారెడ్డి ఆటో యూనియన్ నేతల్ని స్టేషన్‌కు పిలిపించి.. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. పరామర్శించిన ఎమ్మెల్యే ఎస్సై దాడిలో గాయపడిన లేటపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ చంద్రను ఎమ్మెల్యే పి.రవీంద్రనాధ్‌రెడ్డి కడప రిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. కాగా పోలీసుల సంఘటనతో ఆందోళన చెందవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు...ఆదుకుంటాం...
విజయనగరం ఫోర్ట్: అధైర్యపడొద్దు...అన్ని విధాలా ఆదుకుంటామని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అన్నారు. ఉన్మాది ఆటో డ్రైవర్ దాడిలో గాయపడి కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువతులను, యాసిడ్ దాడికి గురై చికిత్స పొందుతున్న బాలుడును జాయింట్ కలెక్టర్ శుక్రవారం పరామర్శించారు. ఏమ్మా ఆరోగ్యం బాగుందా... ఆందోళన చెందవద్దు, ప్రభుత్వ పరంగా మీకు అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. యువతులకు, బాలుడికి ప్రత్యేక రోగులుగా భావించి వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్యం అందించడంలో రాజీ పడవద్దన్నారు. ముగ్గురికి ఇళ్ల స్థలాలు నిమత్తం ప్రతిపాదనలు పంపించాలని తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలని సీసీకి సూచించారు. ఆయన వెంట ఐసీడీఎస్ పీడీ ఏఈరాబర్ట్స్, కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు, జనరల్ సర్జన్ ఎన్.వేణుగోపాల్ , ఎన్టీఆర్ వైద్య సేవ కో–ఆర్డినేటర్ కె. సాయిరాం తదితరులు ఉన్నారు. -
నటి తండ్రిపై ఆటో డ్రైవర్ దాడి
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి సుమోన చక్రవర్తి తండ్రిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాల నటిగా కెరీర్‌ను ఆరంభించిన సుమోన.. కపిల్ శర్మ షోతోపాటు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. ముంబై మిర్రర్ కథనం ప్రకారం... అంధేరీ సెవెన్ హిల్స్ ఆస్పత్రి సమీపంలో వీరి కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఓరోజు సుమోన తండ్రి సుజిత్.. తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవటంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆటోను మాట్లాడుకునేందుకు రోడ్డు మీదకు రాగా.. ఒక ఆటో డ్రైవర్ ఎక్కువ డిమాండ్ చేయటంతో అతనితో సుజిత్ వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్ సుజిత్‌ను బండరాయితో మోది తీవ్రంగా గాయపరిచాడు. అది గమనించిన సుమోన తల్లి.. గాయపడిన సుజిత్‌ను స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పొవాయి పోలీసులు దృవీకరించారు కూడా. సుమోన, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకాగా, ప్రత్యక్ష సాక్ష్యుల స్టేట్మెంట్ మేరకు ఆటో డ్రైవర్ అమిత్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 5000 రూపాయల పూచీకత్తు మీద చివరకు అతనికి బెయిల్ లభించింది. -
ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడుతో దాడి
తిరువొత్తియూరు: ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేసిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాతచాకలిపేట భోజరాజ నగర్‌కు చెందిన వినోద్‌కుమార్ ఆటోడ్రైవర్. ఇతనికి వివాహమైంది. కాని అదే ప్రాంతంలో ఉన్న కళాశాల విద్యార్థిని వినోద్‌కుమార్ ప్రేమిస్తున్నట్టు తెలిసింది. విద్యార్థిని వద్ద ఇతను తన ప్రేమను తెలిపినప్పుడు విద్యార్థిని తిరస్కరించింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సమయంలో కళాశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థిని అడ్డుకున్న వినోద్‌కుమార్ తనను ప్రేమించమని ఒత్తిడి చేశాడు. కాని దీనికి విద్యార్థిని తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన వినోద్‌కుమార్ బ్లేడుతో విద్యార్థిని గొంతు కోయడానికి పయత్నించాడు. వెంటనే అతని నుంచి తప్పించుకున్న విద్యార్థిని పరిగెత్తింది కాని అతను వెంట పడి ఆమె చేతిపై బ్లేడుతో గాయపరచి పారిపోయాడు. గాయపడిన విద్యార్థినిని ఇరుగు పొరుగు వారు చికిత్స కోసం స్టాన్లీ ఆసుపత్రిలో అనుమతించారు. దీనిపై చాకలిపేట పోలీసులు సహాయ కమిషనర్ ఆనందకుమార్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ కాశియప్పన్ మీంజూరులో దాగివున్న వినోద్‌కుమార్‌ను అరెస్టు చేశారు.