ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడుతో దాడి | Auto driver attack on Student | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడుతో దాడి

Published Fri, Jul 22 2016 3:03 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడుతో దాడి - Sakshi

ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడుతో దాడి

తిరువొత్తియూరు: ప్రేమించలేదని విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేసిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాతచాకలిపేట భోజరాజ నగర్‌కు చెందిన వినోద్‌కుమార్ ఆటోడ్రైవర్. ఇతనికి వివాహమైంది. కాని అదే ప్రాంతంలో ఉన్న కళాశాల విద్యార్థిని వినోద్‌కుమార్ ప్రేమిస్తున్నట్టు తెలిసింది. విద్యార్థిని వద్ద ఇతను తన ప్రేమను తెలిపినప్పుడు విద్యార్థిని తిరస్కరించింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సమయంలో కళాశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థిని అడ్డుకున్న వినోద్‌కుమార్ తనను ప్రేమించమని ఒత్తిడి చేశాడు.
 
 కాని దీనికి విద్యార్థిని తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన వినోద్‌కుమార్ బ్లేడుతో విద్యార్థిని గొంతు కోయడానికి పయత్నించాడు. వెంటనే అతని నుంచి తప్పించుకున్న విద్యార్థిని పరిగెత్తింది కాని అతను వెంట పడి ఆమె చేతిపై బ్లేడుతో గాయపరచి పారిపోయాడు. గాయపడిన విద్యార్థినిని ఇరుగు పొరుగు వారు చికిత్స కోసం స్టాన్లీ ఆసుపత్రిలో అనుమతించారు. దీనిపై చాకలిపేట పోలీసులు సహాయ కమిషనర్ ఆనందకుమార్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ కాశియప్పన్ మీంజూరులో దాగివున్న వినోద్‌కుమార్‌ను అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement