
యువతులను పరామర్శిస్తున్న జేసీ లఠ్కర్
విజయనగరం ఫోర్ట్: అధైర్యపడొద్దు...అన్ని విధాలా ఆదుకుంటామని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అన్నారు. ఉన్మాది ఆటో డ్రైవర్ దాడిలో గాయపడి కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువతులను, యాసిడ్ దాడికి గురై చికిత్స పొందుతున్న బాలుడును జాయింట్ కలెక్టర్ శుక్రవారం పరామర్శించారు. ఏమ్మా ఆరోగ్యం బాగుందా... ఆందోళన చెందవద్దు, ప్రభుత్వ పరంగా మీకు అందాల్సిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. యువతులకు, బాలుడికి ప్రత్యేక రోగులుగా భావించి వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్యం అందించడంలో రాజీ పడవద్దన్నారు. ముగ్గురికి ఇళ్ల స్థలాలు నిమత్తం ప్రతిపాదనలు పంపించాలని తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలని సీసీకి సూచించారు. ఆయన వెంట ఐసీడీఎస్ పీడీ ఏఈరాబర్ట్స్, కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు, జనరల్ సర్జన్ ఎన్.వేణుగోపాల్ , ఎన్‌టీఆర్ వైద్య సేవ కో–ఆర్డినేటర్ కె. సాయిరాం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment