average assets
-
రాజ్యసభ అభ్యర్ధుల సగటు ఆస్తి ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన 63 మంది అభ్యర్ధుల్లో రూ 122 కోట్ల సగటు ఆస్తులతో 87 శాతం మంది కోటీశ్వరులే. 63 మంది అభ్యర్థుల్లో 55 మంది కోటీశ్వరులే (రూ కోటికి పైగా ఆస్తులు) అయినా కొద్దిమంది అత్యంత సంపన్నుల ఆస్తుల కారణంగా సగటు ఆస్తుల్లో భారీ పెరుగుదల చోటుచేసుకుందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. రాజ్యసభ అభ్యర్ధుల్లో జేడీ(యూ)కు చెందిన మహేంద్ర ప్రసాద్ రూ 4,078 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభ బరిలో ఉన్న జయాబచ్చన్ రూ 1001 కోట్ల ఆస్తులు ప్రకటించి తర్వాతి స్ధానంలో ఉన్నారు. కాగా కేవలం రూ 4 లక్షల ఆస్తులతో బిజూ జనతాదళ్‌కు చెదిన అచ్యుతానంద సమనంతా నిరుపేద అభ్యర్థి కావడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి సమీర్ ఓరాన్ రూ 18 లక్షల ఆస్తులతో ఆయన తర్వాత తక్కువ ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ప్రధాన పార్టీల్లో బీజేపీ తరపున పోటీలో ఉన్న 29 మందిలో 26, కాంగ్రెస్ నుంచి 11 మంది అభ్యర్ధుల్లో 10, తృణమూల్ అభ్యర్ధుల్లో నలుగురికి గాను ముగ్గురు, టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులూ , జేడీ(యూ)కు చెందిన ఇద్దరు అభ్యర్ధులూ రూ కోటికి పైగా ఆస్తులను ప్రకటించారు. ఇక పార్టీలవారీగా చూస్తూ ప్రతి అభ్యర్థి సగటు నికర ఆస్తులు బీజేపీ 29 మంది అభ్యర్ధుల సగటు ఆస్తి రూ 16 కోట్లు కాగా, 11 మంది కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ 66 కోట్లు, నలుగురు తృణమూల్ అభ్యర్ధుల సగటు ఆస్తులు అతి తక్కువగా రూ కోటి కావడం గమనార్హం. -
కుబేర మంత్రుల్లో నారాయణ టాప్
-
కుబేర మంత్రుల్లో నారాయణ టాప్
♦ ఆస్తుల సగటులోనూ ఏపీ మంత్రులదే మొదటి స్థానం ♦ మంత్రులపై క్రిమినల్ కేసుల్లో మూడోస్థానంలో తెలంగాణ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై ఓ సంస్థ చేసిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలపై విశ్లేషణ జరిపిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివరాలు తెలిపింది. మొత్తం 620 మంత్రుల్లో 609 మంది డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్(రూ. 251 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా మంత్రుల ఆస్తుల సగటు రూ.8.59 కోట్లు కాగా, ఏపీ మంత్రుల ఆస్తి సగటు రూ. 45.49 కోట్లు. తర్వాతి స్థానంలో కర్ణాటక, అరుణాచల్ ఉన్నాయి. ఆస్తుల అత్యల్ప సగటున్న రాష్ట్రంగా త్రిపుర(రూ. 31.67 లక్షలు)గా నిలిచింది. 34 శాతం రాష్ట్రాల మంత్రులు (210 మంది)లపై క్రిమినల్ కేసులున్నాయి. 113 మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్ర కేసులున్నాయి. ఈ జాబితాలో 18మంది మంత్రులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, బిహార్(11), తెలంగాణ(9), జార్ఖండ్ (9) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 609 మందిలో 51 మంది మహిళా మంత్రులుండగా.. వీరిలో అత్యధికం మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచే ఉన్నారు. అటు కేంద్ర మంత్రుల్లో 14 మందిపై క్రిమినల్ కేసులుండగా.. సగటు ఆస్తి రూ. 12.94 కోట్లుగా వెల్లడైంది.