Avian
-
అమెరికాలో ఎవియన్ ఫ్లూ... 5 కోట్ల కోళ్లు బలి
వాషింగ్టన్: అమెరికాలో ఎవియన్ ఫ్లూ అక్షరాలా విలయం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో ఏకంగా 5 కోట్ల కోళ్లు, పక్షులను బలి తీసుకుంది! ఇది దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన విపత్తని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా గుడ్లు, కోడి మాంసం తదితరాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనం జేబుకు మరింత చిల్లి పెడుతున్నాయి. హైలీ పాథోజెనిక్ ఎవియన్ ఇన్ఫ్లుయెంజా (హెచ్పీఏఐ)గా పిలిచే ఈ ఫ్లూ అడవి బాతుల వంటి వాటి వ్యర్థాలు, ఈకల ద్వారా సోకుతుంది. ఇది అమెరికాలో ఫిబ్రవరిలో వెలుగు చూసింది. చూస్తుండగానే కార్చిచ్చులా దేశమంతటా వ్యాపించి ఏకంగా 46 రాష్ట్రాలను చుట్టేసింది. దాంతో ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు లక్షలు, కోట్ల సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులను చంపేయాల్సి వచ్చింది! 2015లోనూ యూఎస్‌లో ఇలాగే దాదాపు 5 కోట్ల పక్షులు ఫ్లూకు బలయ్యాయి. బ్రిటన్‌తో సహా పలు యూరప్ దేశాల్లో కూడా ఎవియన్ ఫ్లూ విలయం సృష్టిస్తోంది. ఎంతలా అంటే బ్రిటన్‌లో పలు సూపర్ మార్కెట్లు ఒక్కో కస్టమర్ ఇన్ని గుడ్లు మాత్రమే కొనాలంటూ రేషన్ పెడుతున్నాయి! -
Bird Flu Strain H10N3: మనిషికి బర్డ్‌ఫ్లూ.. ఆందోళన అక్కర్లేదు!
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ మనిషికి బర్డ్‌ఫ్లూ వైరస్ సోకడం.. ఆ కేసు కూడా చైనాలో నమోదు అయ్యిందన్న కథనాలతో ప్రపంచం ఉలిక్కి పడింది. ఇది మరో మహమ్మారికి దారితీయబోతోందా?, అప్రమత్తం కావాల్సిన ఉందనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇంతకి ఇప్పుడు వినిపించే ఆ బర్డ్ ఫ్లూ వైరస్ కారకం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. న్యూఢిల్లీ: తూర్పు చైనాలోని జింగ్సూ ప్రావిన్స్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి కేసు తాజాగా నమోదు అయ్యింది. జెన్జియాంగ్కు చెందిన 41 ఏళ్ల ఆ వ్యక్తి బర్డ్‌ఫ్లూ వైరస్‌లోని హెచ్10ఎన్3 స్ట్రెయిన్ బారినపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ కేసు వివరాల్ని ధృవీకరిస్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక నివేదికను కూడా విడుదల చేసింది. దీంతో ప్రపంచంలో ఇదే మొదటిసారి మనిషికి వైరస్ సోకడం అంటూ కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే మనుషులు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాల బారినపడడం చాలా సాధారణమైన విషయమని, హెచ్10ఎన్3 స్ట్రెయిన్‌తో పక్షులతో పాటు మనుషులకూ ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. గతంలో.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా దేశంలో ఏడుగురు బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్8 స్ట్రెయిన్) బారినపడి కోలుకున్నారు. అలాగే పోయినేడాది డిసెంబర్లో చైనా హువాన్ ప్రావిన్స్‌లో ఓ బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్6 స్ట్రెయిన్) కేసు నమోదు అయ్యింది. ఇలా బర్డ్‌ఫ్లూ వైరస్ కారకాలతో ఇంతకు ముందు చాలానే కేసులు రికార్డ్ అయ్యాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) భరోసా ఇస్తోంది. ఇక ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో హెచ్5ఎన్1 మాత్రం కొంచెం రిస్క్ ఉన్న బర్డ్‌ఫ్లూ వైరస్. దీని రిస్క్ రేటు 40 నుంచి 50 శాతం దాకా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల 1997లో 455 మంది ప్రపంచం మొత్తంగా చనిపోయారు. అలాగే హెచ్7ఎన్9 స్ట్రెయిన్ కూడా చాలా ప్రమాదకరమని గుర్తు చేస్తున్నారు. 2016-17 శీతాకాలం టైంలో చైనాలో ఈ స్ట్రెయిన్ వల్ల 300 మంది చనిపోయారు. కానీ, బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకడం చాలా చాలా అరుదుగా జరిగే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఎలా సోకుతుందంటే.. సాధారణంగా బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషికి సోకడం చాలా అరుదు. పక్షులు, కోళ్లు, ఇతరత్రా పక్షుల పెంపక పరిశ్రమల ద్వారా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ తరహాలోనే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలు (హెచ్10ఎన్3 స్ట్రెయిన్ సహా) తుంపర్ల ద్వారా మనుషులకు సోకుతాయి. అయితే వీటితో(కొన్ని స్ట్రెయిన్లను మినహాయిస్తే) మనుషులకు రిస్క్ రేటు తక్కువ. త్వరగా కోలుకుంటారు కూడా. అలాగే పక్షులకు కూడా రిస్క్ రేటు తక్కువే అయినప్పటికీ ఒక్కోసారి అవి ఇన్ఫెక్షన్ తట్టుకోలేక చనిపోతుంటాయి. గతంలో రికార్డు అయిన మనుషులకు బర్డ్‌ఫ్లూ కేసులు కూడా ఫౌల్ట్రీతో దగ్గరి సంబంధాలు ఉన్నవే. ఆ టైంలో వాటికి దూరంగా ఉండడంతో పాటు చచ్చిన కోళ్లను మిగతా వాటి నుంచి త్వరగా వేరుచేయడం ద్వారా నష్టాన్ని నివారించొచ్చని సూచిస్తున్నారు. అలాగే బర్డ్‌ఫ్లూ ఇన్ఫెక్షన్లతో పక్షులకు జరిగే నష్టం కూడా చాలా అరుదని, కానీ, చాలామంది అప్రమత్తత పేరుతో వాటిని చంపుతుంటారని సైంటిస్టులు చెప్పారు. ఇక చైనాలో తాజాగా నమోదు అయిన కేసు కూడా ఈ కోవకే చెందుతుంది. ఇన్ఫెక్షన్కి గురైన పక్షుల ద్వారా ఆ వ్యక్తిని వైరస్ సోకి ఉంటుందని చైనా ఆరోగ్య కమిషన్ భావిస్తోంది. అంతేకాదు అతని వల్ల ఆ వైరస్ మరెవరికీ సోకలేదని నిర్ధారించింది కూడా. ప్రస్తుతం అతను కోలుకోవడంతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి రెడీగా ఉన్నాడని డబ్ల్యూహెచ్‌వోకు ఒక రిపోర్ట్ కూడా సమర్పించింది చైనా. చదవండి: బ్లాక్‌ఫంగస్ దానివల్ల రాదు వేరియెంట్లతో రిస్క్ ఛాన్స్! వైరస్ స్ట్రెయిన్లు వేరియంట్లను మార్పుకోవడం సాధారణం. కరోనా విషయంలో ఇది చూస్తున్నాం కూడా. అలాగే బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్స్ కూడా ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఎఫ్ఏవో ఎమర్జెన్సీ సెంటర్ సైంటిస్ట్ ఫిలిప్ క్లాయిస్ చెప్తున్నారు. గతంలో బర్డ్‌ఫ్లూ కేసుల్ని కొన్నింటిని ప్రస్తావించిన ఆయన.. మనుషుల నుంచి మనుషులకు ఆ వేరియెంట్ల వల్లే వ్యాపించిందన్న(అతికొద్ది ఇన్ఫెక్షన్ కేసులు) విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. ఇక ఫ్లూ వైరస్లు వేగంగా మ్యుటేంట్ కావడం, పక్షుల పెంపకం.. వలస పక్షుల వల్ల మనుషులకు రిస్క్ రేటు ఎక్కువగా ఉండొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్న హెచ్10ఎన్3 వేరియెంట్ జెనెటిక్ సీక్వెన్స్ తెలిస్తేనే తప్ప.. రిస్క్ తీవ్రతపై ఓ స్పష్టత రాదని ఆయన అంటున్నారు. చదవండి: Bird Flu Strain H10N3: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ -
కనులపండువగా వసంతోత్సవం
శేషవాహనంపై ఊరేగిన ఉత్సవమూర్తులు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మండలి కోడూరు : మంగళవాయిద్యాలు.. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శ్రీకల్యాణ వేంకటేశ్వరుడి వసంతోత్సవాన్ని శుక్రవారం కనులపండువగా నిర్వహించారు. కోడూరులోని శ్రీశ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామివారి 18వ వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో మహాపూర్ణాహూతి కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కోట పద్మావతి వరప్రసాద్, కృష్ణాపురానికి చెందిన ఇంకొల్లు మురళీకృష్ణ, ప్రముఖ వ్యాపారులు ఇమ్మడి రాంబాబు, రామకృష్ణప్రసాద్ దంపతులు ఈ కార్యక్రమానికి ఉత్సవకర్తలుగా వ్యవహరించారు. తిరుపతికి చెందిన వేదపండితులు కొగంటి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూర్ణాహూతి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తరలిరావడంతో ఆలయప్రాంగణంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. కోడూరు, ఇస్మాయిల్‌బేగ్‌పేట, కృష్ణాపురం, యర్రారెడ్డివారిపాలెం నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో గులాంలు, వివిధ రంగులు కలిపిన నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ భక్తిభావంతో ఉత్సాహంగా గడిపారు. శేషవాహనంపై ఊరేగిన వెంకటేశ్వరుడు.. బ్రహోత్సవాలను పురస్కరించుకుని వెంకటేశ్వరున్ని శేషవాహనంపై గ్రామాల వెంట ఊరేగిస్తూ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శేషవాహనానికి ఇంకొల్లు మురళీకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జరుగువానిపాలెంకు చెందిన శ్రీనివాసా భక్తసమాజం సభ్యుల భజన కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. రంగురాళ్లతో పొదిగిన వెండికవచం.. వెంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రత్యేకంగా చేయించిన రంగు రాళ్లతో పొదిగిన వెండికవచం అలంకరించారు. ఉత్సవాలను పురస్కరించకుని మద్దూరి కాంతారావు ఉత్సవమూర్తులకు రాళ్లకిరీటం, యండూరి యజ్ఞనాగవరప్రసాద్ దంపతులు రాళ్ల వక్షస్థలాన్ని బహుకరించారు. శనివారం ఉదయం స్వామివారి శాంతికల్యాణం నిర్వహించి, రాత్రికి సహస్ర దీపాలంకారసేవ నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి ద్వాదశ ప్రదక్షణులు చేయించి ఆలయ ప్రవేశం చేయించనున్నట్లు ధర్మకర్త కోట పద్మావతి వరప్రసాద్ తెలిపారు. మండలి ప్రత్యేక పూజలు.. బ్రహోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, పండితులు బుద్ధప్రసాద్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేడీసీసీ బ్యాంక్ డెరైక్టర్ ముద్దినేని చంద్రరావు, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కోట సంపత్‌కుమార్, గోగినేని సోమశేఖరరావు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.