'వైన్' లోపంతో జాక్పాట్
ముంబై: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఓపెన్ ప్రోగ్రాం 'వైన్' లో ఉన్న లోపాన్ని కనిపెట్టిన ఓ ఇండియన్ హ్యాకర్ జాక్ పాట్ కొట్టేశాడు. వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం వైన్ లోని 'బగ్' ను భారత సంతతికి చెందిన బగ్ హ్యాకర్ అవినాశ్ సింగ్ గుర్తించాడు. ఈ భద్రతా లోపం కనిపెట్టిన అతనికి ప్రోత్సాహకాన్ని ప్రకటించింది ట్విట్టర్. సుమారు 6.7 లక్షల రూపాయల (10,080 డాలర్ల) బహుమతి ప్రకటించింది.
వైన్ కు సంబంధించిన సోర్స్ కోడ్ పబ్లిక్ గా అందరికీ అందుబాటులో ఉండడాన్ని గమనించిన అవినాశ్ .. సాఫ్ట్ వేర్ లోపం కారణంగా ఇలా జరుగుతోందని గుర్తించి సంస్థకు వివరించాడు. ఈ సైట్ లో ప్రయివేటు వీడియోలను పబ్లిక్ గా షేర్ చేయడానికి వీల్లేదు. అయితే వైన్ లోని వీడియోలను నిఫ్టీ ఇంటర్నెట్ వైడ్ స్కానింగ్ టూల్ సెన్సిస్.ఎస్ ఐ అనే సెర్చ్ ఇంజిన్ లో వెతకినపుడు ప్రయివేట్ వీడియోలు సైతం పబ్లిక్ గా దర్శనమిస్తున్నాయి. ఇలా దాదాపు 80 ఇమేజెస్ ను డౌన్ చేయగలిగాడు. దీనికి 'డాకర్' అనే బగ్ ది బాధ్యత అని కనిపెట్టాడు. ఈ విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకురావడంతో దాన్ని 5 నిమిషాల్లోనే సవరించుకుంది.
సోషల్ మీడియా దిగ్గజాలు బగ్ నేరస్థులను వేటాడే నిపుణులైన బగ్ హ్యాకర్స్ పై దృష్టి పెట్టాయి. బిగ్ బగ్ హంటింగ్ కుర్రాళ్ళకు భారీగా నజరానాను ప్రకటిస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత్ లో హ్యాకర్స్ కు మంచి అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇటీవల, ఆనంద్ ప్రకాష్ అనే బెంగుళూర్ ఆధారిత ఫ్లిప్కార్ట్ ఉద్యోగి, ఫేస్బగ్ బగ్ ను కని పెట్టి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే. కాగా 2012 లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం వైన్ లో ఇటీవల వీడియోల నిడివిని పెంచింది. గతంలో 30 సెకండ్లకు మాత్రమే పరిమితమైన దీన్ని 140 సెకండ్లకు పెంచింది.