awarness programs
-
Animatronic Elephant: స్కూల్‌కు ఏనుగొచ్చింది
ఏనుగు స్కూల్‌కి వస్తే? పిల్లలు దానిని భయం లేకుండా తాకి, నిమిరి ఆనందిస్తే? ఆ ఏనుగు కళ్లార్పుతూ, చెవులు కదిలిస్తూ మాట్లాడుతూ తన గురించి చెప్పుకుంటే? ‘ఎలీ’ అనే యానిమెట్రానిక్ ఏనుగు ఇకపై దేశంలోని స్కూళ్లకు తిరుగుతూ పిల్లలకు ఏనుగుల జీవనంలో ఏది ఇష్టమో, ఏది కష్టమో చెప్పనుంది. ‘పెటా’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ‘ఎలీ’కి గొంతు ఇచ్చిన నటి దియా మిర్జా ఏనుగులపై జరుగుతున్న దాష్టీకాలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి నడుం కట్టింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం పిల్లలు, తల్లిదండ్రులు, జంతు ప్రేమికులు తప్పక ఆహ్వానించదగ్గది. సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ ‘ఏనుగు డాక్టర్’ అనే కథ రాశారు. మదుమలై అడవుల్లో ఏనుగుల డాక్టర్‌గా పని చేసిన ఒక వ్యక్తి అనుభవాలే ఆ కథ. అందులో ఆ డాక్టర్ అడవుల్లో పిక్నిక్ల పేరుతో తిరుగుతూ బీరు తాగి ఖాళీ సీసాలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విసిరేసే వాళ్ల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానికి కారణం బీరు సీసా మీద ఏనుగు కాలు పెట్టగానే అది పగులుతుంది. ఏనుగు పాదంలో దిగబడి పోతుంది. ఇక ఏనుగుకు నడవడం కష్టమైపోతుంది. అది తిరగలేదు. కూచోలేదు. లేవలేదు. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిలబడి పోతుంది. అలాగే వారం పదిరోజులు నిలబడి తిండి లేక కృశించి మరణిస్తుంది. ఇది ఎవరు జనానికి చెప్పాలి? ఎవరు ప్రచారం చేయాలి? ఎవరో ఒకరు లేదా అందరూ ఏదో ఒక మేరకు పూనుకోవాలి కదా. ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’ (పెటా) నిన్న (శుక్రవారం) ఏనుగులతో జనం మైత్రి కోసం ముఖ్యంగా పిల్లల్లో అవగాహన కోసం ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. అచ్చు నిజం ఏనుగులా కనిపించే యానిమెట్రానిక్ ఏనుగును తయారు చేయించి దాని ద్వారానే పిల్లల్లో చైతన్యం కలిగించనుంది. ఆ ఏనుగుకు ‘ఎలీ’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’లో అంబాసిడర్‌గా ఉన్న దియా మిర్జా తోడు నిలిచింది. ఆమె ఏనుగుకు తన కంఠం ఇచ్చింది. నేను... ఎలీని... నిజం ఏనుగులా అనిపించే ఎలీ ఇకపై ఊరూరా తిరుగుతూ స్కూల్‌కి వస్తుంది. అందులో రికార్డెడ్‌గా ఉన్న దియా మిర్జా కంఠంతో మాట్లాడుతుంది. ఇది యానిమెట్రానిక్ బొమ్మ కనుక కళ్లు కదల్చడం, చెవులు కదల్చడం లాంటి చిన్న చిన్న కదలికలతో నిజం ఏనుగునే భావన కలిగిస్తుంది. అది తన చుట్టూ మూగిన పిల్లలతో ఇలా చెబుతుంది. ‘నేను ఎలీని. నా వయసు 12 సంవత్సరాలు. నేను ఇంతకు ముందు ఒక సర్కస్‌లో పని చేసే దాన్ని. జనం నన్ను సర్కస్‌లో చూసి ఆనందించేవారు. కాని అలా ఉండటం నాకు ఆనందం కాదు. అడవిలో తిరిగే నన్ను కొందరు బంధించి సర్కస్‌కు అప్పజెప్పారు. సర్కస్ ఫీట్లు చేయడానికి నన్ను బాగా కొట్టేవారు. నన్ను గట్టి నేల మీద ఎప్పుడూ నిలబెట్టేవారు. అలా నిలబడితే నాకు కష్టంగా ఉంటుంది. అసలు జనం మధ్య తిరగడం, గోల వినడం ఇవన్నీ నాకు భయం. సర్కస్ లేనప్పుడు నన్ను గొలుసులతో కట్టేస్తారు. ఏనుగుల గుంపు నుంచి ఏనుగును విడదీస్తే అది ఎంతో బాధ పడుతుంది. కాని ఇప్పుడు నేను విముక్తమయ్యాను. నన్ను ఒక సంస్థ విడిపించి బాగా చూసుకుంటోంది. నేను హాయిగా ఉన్నాను’ అని తన కథను ముగిస్తుంది. కొనసాగుతున్న హింస ‘ఏనుగులు ప్రకృతిలో ఉండాలి. జనావాసాల్లో కాదు. ఒక తల్లిగా పిల్లలకు కొన్ని విషయాలు తెలియాలని కోరుకుంటాను. పెటాతో కలిసి బాలబాలికల్లో చైతన్యం కోసం పని చేయడం మూగజీవులకు, పిల్లలకు బంధం వేయడంగా భావిస్తాను’ అని దియా మిర్జా అంది. ఏనుగులను ఇవాళ్టికీ ఉత్సవాల్లో, పర్యాటక కేంద్రాల్లో, బరువుల మోతకు, వినోదానికి ఉపయోగిస్తున్నారు. మనుషుల ఆధీనంలో ఉన్న ఏనుగుకు ఎప్పుడూ కడుపు నిండా తిండి, నీరు దొరకవు. వాటిని గొలుసులతో బంధించి ఉంచడం వల్ల ఒక్కోసారి అవి అసహనానికి గురై మనుషుల మీద దాడి చేస్తాయి. ఎలిఫెంట్ సఫారీల వల్ల ఏనుగు వెన్ను సమస్యలతో బాధ పడుతుంది. ఇవన్నీ మన తోటి పర్యావరణ జీవులతో ఎలా మెలగాలో తెలియకపోవడం వల్ల జరుగుతున్న పనులేనని ‘పెటా’ వంటి సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు తెలియచేస్తున్నారు. ‘ఎలీ’ వంటి ఏనుగులు ప్రతి ఊరు వచ్చి పిల్లలతో, పెద్దలతో సంభాషిస్తే లేదా ఇలాంటి సంభాషణను ప్రతి స్కూల్లో వీడియోల ద్వారా అయినా ప్రదర్శిస్తే మార్పు తథ్యం. -
వినూత్న అవగాహన కార్యక్రమం... యాష్ట్రేల ప్రదర్శన
మద్దిలపాలెం (విశాఖతూర్పు) : ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మానడం లేదు. పొగచూరిపోతున్న యువతరాన్ని మేల్కోపేందుకు ఓ విశ్రాంతి ఉద్యోగి వినూత్న ప్రయాత్నానికి శ్రీకారం చుట్టారు. పూర్వం ధూమపానం ప్రియు లు వినియోగించే యాష్ ట్రేలను సేకరించి వాటిని ప్రతి ఏడాది పొగాకు రహిత దినోత్సవం నాడు ప్రదర్శిస్తున్నారు. పొగాకు వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నట్టు జేఆర్‌నగర్ కాలనీకి చెందిన విశ్రాంత జిల్లా సహకార బ్యాంకు మేనేజర్ జి.ఎస్.శివప్రకాష్ చెప్పారు. సోమవారం తన నివాసంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. యాష్ ట్రేలు వారి వ్యసనానికి సాక్షిగా నిలిచాయని నేటి తరానికి తెలియజేయడమే తన ఉద్దేశమన్నారు. ధూమపానం వలన పర్యావరణానికి ఎంతో చేటు కలుగుతుందని ఆ వ్యసానానికి దూరంగా యువతరం ఉండేలా తన వంతు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. పొగాకు నిర్మూలనతోనే వ్యాధుల నివారణ ఎంవీపీకాలనీ: పొగాకు నిర్మూలనతోనే నేడు సమాజాన్ని పీడిస్తున్న అనేక వ్యాధులకు నివారణ సాధ్యమవుతుందని మహాత్మగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని డబ్లుహెచ్‌ఓ ఈ ఏడాది నినాదం ‘పర్యావరణం కాపాడుదాం’ అంశంపై ఆయన సోమవారం ఎంవీపీ కాలనీలోని ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. సమాజంలో సంభవిస్తున్న ఎక్కువ వ్యాధులకు, మరణాలకు పొగాకే కారణంగా నిలుస్తోందన్నారు. క్యాన్సర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్, ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధులు ప్రస్తుతం ఎక్కువ అవుతున్నాయన్నారు. దీంతో పాటు సిగరెట్ పీకలలో వాడే మైక్రో ప్లాస్టిక్, నాన్ బయోడిగ్రేడబుల్ పౌచ్‌ల ద్వారా మట్టి పెద్ద ఎత్తున కలుషితం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నినాదం పర్యావరణం కాపాడుదాం విజయవంతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలన్నారు. దేశంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.18 వేల కోట్లు ఆదాయం వస్తుండగా వాటి వినియోగించడం ద్వారా వ్యాధుల భారిన పడుతున్న వారి చికిత్సకు రూ.లక్ష కోట్లు ఖర్చువుతుందన్నారు. క్యాన్సర్ మరణాలు అయితే 20శాతానికి పైగా పొగాకు వాడకం ద్వారానే వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు నిర్మూలపై ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పొగాకు పండించే రైతులకు పత్యామ్నాయమార్గాలు చూపించడం, పొగాకు వాడకం ద్వారా వచ్చే నష్టాలపై ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతం చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి తరఫున ఏటా పదుల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ ప్రజలను పొగాకు రహిత జీవనంపై చైతన్యం కలిగిస్తున్నట్లు తెలిపారు. -ఎంజీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ మురళీకృష్ణ (చదవండి: ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు’) -
మత్తు వదలరా... మద్యం మానేయాలంటూ హితభోధ!
సాక్షి, హైదరాబాద్: ‘టెన్త్‌లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చామని ముగ్గురం స్నేహితులం కలిసి బీరు కొనుక్కుని అందులో నీళ్లు పోసుకుని ట్యాంక్ బండ్ కింద ఫ్రెండ్ కారులో కూర్చుని తాగాం. అలా మొదలైన జర్నీ 33 సంవత్సరాలు నిరాటంకంగా నడిచింది. ఆఖరి 7 సంవత్సరాల్లో చివరి మూణ్నెళ్లు సూర్యుడ్ని చూడలేదంటే నమ్మండి’ అంటారు నగరానికి చెందిన కె.మూర్తి (62). ఆయనకు 36వ ఏటే హార్ట్ ఎటాక్ వచ్చి బైపాస్ సర్జరీ జరిగినా మద్యం మానని ఆయన ఇప్పుడు వ్యసనాలన్నీ వదిలేసి, అరవైలో ఇరవైలా హాయిగా ఉన్నారు. అంతేకాకుండా తనలాంటి మరికొందరి చేత తాగుడు మానిపించే పనిలో బిజీగా ఉన్నారు. నగరానికి చెందిన ఓ టాప్ లేడీ డాక్టర్...20 ఏళ్ల పాటు మద్యానికి బానిసయ్యారు. అర్జున్‌రెడ్డి సినిమాలో చూపించినట్టు ఆపరేషన్ థియేటర్స్‌కి కూడా తాగి వెళ్లేవారట. అలాంటి మహిళా వైద్యురాలు ఇప్పుడు అరవై ఏళ్ల వయసులో పూర్తిగా మందు మానేసి ఆల్కహాల్ వ్యసనాన్ని దూరం చేసే మందుగా మారారు. ...ఇలా తాగుడు మానాలని అనుకున్నవారు, విజయవంతంగా మానేసిన వారు..కొత్త పాత ఆల్కహాలిక్స్ కొందరు నగరంలో పలు చోట్ల సమావేశం అవుతున్నారు. తమను తాము సంస్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిని కలిపేందుకు వారధిగా మారింది ఆల్కహాలిక్స్ అనానిమస్ ఫెలోషిప్. అమెరికాలో పుట్టి...అంతర్జాతీయంగా మెట్టి... దాదాపుగా 90 ఏళ్ల వయసున్న ఆల్కహాలిక్ అనానిమస్ (ఎఎ) సంస్థ అమెరికాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఆల్కహాలిక్స్ను విముక్తుల్ని చేసేందుకు అవసరమైన చికిత్సలో వైద్యులకు కో థెరపీగా గుర్తింపు పొందింది. దీనిలో భాగంగానే ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. మహిళలు, పురుషులు ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడడానికి స్వచ్ఛందంగా ఇందులో భాగస్తులు అవుతారు. పరస్పరం ఆల్కహాలిజమ్ కు దూరమయ్యేందుకు సహకరించకుంటారు. ఫీజులు, రుసుములు ఏమీ ఉండవు. వ్యసనం నుంచి బయటపడాలనే ఆకాంక్ష ఒకటే అర్హత. మందులు, ఇతరత్రా ఉపయోగించరు. తాగుడు వ్యసనాన్ని దూరం చేసుకున్నవారిని సోబర్స్గా పిలుస్తారు. ఈ సోబర్స్.. బృందంలో చేరి ఆ విషయాలను విడమరచి చెప్పుకోవడం ఇందులో ప్రధానమైన విశేషం. వీరికి సంబంధించిన సమావేశాలు, ఇతరత్రా విషయాలన్నీ రహస్యంగానే ఉంచుతారు. వ్యసన పరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువు లు కూడా దీనికి అనుబంధంగా పనిచేస్తుంటారు. ట్విన్ సిటీస్‌లోనూ మీటింగ్స్.. ఈ సంస్థ గురించి తెలిసిన నగరవాసులు గతంలో ముంబై వెళ్లి సమావేశాల్లో పాల్గొనేవారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వారానికి 60, 70 దాకా సమావేశాలు జరుగుతున్నాయి. నగరంలోనూ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్, వైఎంసిఎ నారాయణగూడ, మాదాపూర్, దిల్సుఖ్నగర్, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో వారానికి డజను దాకా సదస్సులు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్లో పీక్స్.. ఈ సంస్థ కార్యకలాపాలు నగరంలో లాక్ డౌన్ టైమ్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆ సమయంలో ఆల్కహాలిక్స్, వారి బంధువుల నుంచి హెల్ప్‌లైన్స్‌కి కాల్స్ వెల్లువెత్తాయి. అయితే మీటింగ్స్ నిర్వహించే అవకాశం లేక పలువురికి సాయం చేయలేకపోయాం అంటున్నారీ గ్రూప్ సభ్యులు. రెగ్యులర్ మెంబర్స్‌కి మాత్రం ఆన్లైన్, ఫోన్ ఇన్, జూమ్ మీటింగ్స్ నిర్వహించామని చెప్పారు. ఈ సంస్థ సహకారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 96664 66118/119 (చదవండి: ‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!) -
‘మహమ్మారి’ని తరిమికొడదాం
ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ లోగో ఆకృతిలో నిల్చుని, ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే, జగ్గంపేటలోని స్వామి వివేకానంద స్కూల్లో కరస్పాండెంట్ ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యాన విద్యార్థులు రెడ్ రిబ్బ¯ŒS ఆకృతిగా ఏర్పడి, ప్రజలకు అవగాహన కల్పించారు. – అమలాపురం / జగ్గంపేట