axis bank atm
-
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చెలరేగిన మంటలు
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో మంగళవారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఏటీఎంలోని పర్నీచర్ దగ్దమైంది. మంటలు చెలరేగడంతో ఏటిఎం నుంచి బ్యాంకు ముంబాయి కంట్రోల్ రూమ్‌కు మెసెజ్ వెళ్లింది. చదవండి: Hyderabad: మూడేళ్ల క్రితం లైంగికదాడి, కామాంధునికి జీవిత ఖైదు అయితే ఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అర్థరాత్రి దాటాక ఏటీఎం వద్దకు ఇద్దరు వచ్చినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. చోరికి యత్నించిన వారే నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎం తెరుచుకోకపోవడంతోనే నిప్పు పెట్టినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు -
సులబ్ కాంప్లెక్స్‌లో డబ్బులపెట్టె పడేసి..
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద జరిగిన చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. చోరీకి పాల్పడింది తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్‌గా గుర్తించారు. 8 ప్రత్యేక బృందాలతో పోలీసులు రాంజీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, చోరీ అనంతరం మలక్‌పేట్‌లోని ఓ సులబ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లి డబ్బును సంచుల్లోకి మార్చుకుని పెట్టును పడేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉన్న నిందితుల కోసం తమిళనాడుతో పాటు 5రాష్ట్రాలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సేఫ్‌గార్డ్ సంస్థకు చెందిన వాహనంలోంచి రూ.58.97 లక్షలున్న నగదు పెట్టెను దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమచేయడానికి బేగంపేటకు చెందిన వైటర్ సేఫ్ గార్డ్ సంస్థకు చెందిన వాహనం నగదుతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరింది. మొదట అబిడ్స్, ఉస్మాన్‌గంజ్, దిల్సుఖ్నగర్లలో ఉన్న ఏటీఎంలలో నగదు జమ చేసి ఉదయం 10.20 గంటలకు విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న వనస్థలిపురం పనామా చౌరస్తాకు చేరుకుంది. వాహనంలో నుంచి 3 లక్షల రూపాయలను యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో జమ చేయడానికి కస్టోడియన్స్ మహ్మద్ థా, విజయ్‌లు లోనికి వెళ్లారు. డ్రైవర్ సత్తికుమార్ వాహనం దిగి పక్కకు వెళ్లగా, వాహనంలోనే సెక్యూరిటీ గార్డు నాగేందర్ కూర్చున్నాడు. ఏటీఎం నుంచి నగదు ఉన్న వాహనం వరకు వంద రూపాయల నోట్లు కింద పడిపోయి ఉన్నాయని ఓ గుర్తు తెలియనివ్యక్తి వచ్చి నాగేందర్‌కు చెప్పి దృష్టి మళ్లించాడు. దీంతో నాగేందర్ వాహనం దిగి డబ్బులను ఏరుకుంటూ ముందుకు వెళ్లాడు. వెంటనే గుర్తు తెలియనివ్యక్తి వాహనంలోకి చొరబడి అందులో ఉన్న నగదు పెట్టెను రెప్పపాటులో తీసుకుని రోడ్డు దాటి ప్యాసింజర్ ఆటో ఎక్కి పరారయ్యాడు. ఆ పెట్టెలో రూ.58.97 లక్షల నగదు ఉంది. అనుమానం వచ్చిన సెక్యూరిటీగార్డు వెంటనే వెనక్కి వచ్చి వాహనంలోకి వెళ్లి చూసేసరికి నగదు పెట్టె కనిపించలేదు. నగదు చోరీ తర్వాత రాంజీ గ్యాంగ్ సభ్యులు దిల్సుఖ్ నగర్ వరకు ఆటోలో వెళ్లారు. అక్కడి నుంచి ఆటో మారి చాదర్‌ఘాట్‌కు వెళ్లారు. చాదర్ ఘాట్‌లో మరోసారి ఆటో మారి పరారైనట్టు గుర్తించారు. మొత్తం మూడు ఆటోలు మారినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. గతంలో రాంజీ గ్యాంగ్‌పై పలు కేసులున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే రాంజీ గ్యాంగ్ పలుమార్లు దోపిడి చేసింది. దృష్టి మరల్చి దోపిడి చేయడంలో రాంజీగ్యాంగ్ దిట్ట. చోరీ జరిగిన విషయమై సెక్యూరిటీగార్డు, కస్టోడియన్స్ వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. -
దీపక్ గ్యాంగ్ పనేనా!
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పనామా గోడౌన్స్ వద్ద మంగళవారం పట్టపగలు రూ.58.97 లక్షలు ఎత్తుకుపోయింది తమిళనాడులోని రామ్‌జీనగర్‌కు చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం కేంద్రంలోని మిషన్లలో నగదు నింపడానికి వచ్చిన వాహనం సెక్యూరిటీ గార్డు దృష్టి మళ్లించిన ముఠా నగదు ఎత్తుకుపోయిన విషయం విదితమే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ నేరం చేయడానికి ముందు దుండగులు సమీపంలోని ఓ ఇరానీ హోటల్లో టీ తాగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ ఆధారంగా గుర్తించారు. ఆ హోటల్‌కు వెళ్లిన పోలీసులు అనుమానితుల ఫొటోలు సేకరించారు. వీటిని ఇప్పటి వరకు ఈ తరహా దృష్టి మళ్లించి దోచుకుపోయే నేరాల్లో అరెస్టయిన పాత నిందితుల ఫొటోలతో పోల్చి చూశారు. ఈ నేపథ్యంలోనే ఇది రామ్‌జీనగర్‌కు చెందిన దీపక్ గ్యాంగ్ పనిగా తేలింది. ఈ ముఠాకు చెందిన అనేక మంది పాత నేరగాళ్ల ఫొటోలతో సీసీ కెమెరా ఫీడ్ నుంచి తీసినవి సరిపోలాయి. వీటిని పోలీసులు బుధవారం మీడియాకు విడుదల చేశారు. రూ.1,650 వెదజల్లి.... మరోపక్క నగదు రవాణా వాహనం సెక్యూరిటీ గార్డు దృష్టి మళ్లించడానికి ఈ నేరగాళ్లు నగదు చల్లారు. ఆ వాహనం నుంచి కస్టోడియన్లు నగదు నింపడానికి వెళ్లిన ఏటీఎం కేంద్రం వరకు ఇలా చేశారు. ఈ మొత్తం రూ.1,650 అని లెక్కతేలింది. నేరగాళ్లు ఈ కరెన్సీ నోట్లతో పాటు కొంత మలేసియా కరెన్సీ కూడా కింద చల్లారు. దీన్ని బట్టి ఈ ముఠా ఇంతకు ముందు మరో నేరం చేసి ఆ డబ్బుతో మలేసియా వెళ్లి జల్సాలు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నా రు. కనీసం ఏడు నుంచి ఎనిమిది మంది ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు భావిస్తున్నారు. వారం పాటు ఓ ప్రాంతంలో బస చేసి, పక్కా రెక్కీ అనంతరమే ఈ గ్యాంగ్ పంజా విసిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం నిర్ధారించడానికి మూడు కమిషనరేట్లలో ఉన్న లాడ్జీలు, హోటళ్ల నుంచి రాచకొండ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను వాడుకుని.... నగరంలో సీసీ కెమెరాలు ఉన్నాయని తెలుసుకున్న నేరగాళ్లు తెలివిగా వ్యవహరించారు. రామ్జీనగర్ గ్యాంగ్ సొంత ద్విచక్ర వాహనాలు వాడుతుంది. ఈసారి మాత్రం ఘటనాస్థలి వరకు వేర్వేరు మార్గా ల్లో వచ్చిన నేరగాళ్లు నగదు ఉన్న ట్రంక్ పెట్టెను కొట్టేసిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించా రు. ఇలా చేస్తే తాము ప్రయాణించిన వాహనాన్ని గుర్తించే లోపు వీలైనంత దూరం వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతోనే ఇలా చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. దృష్టి మళ్లించడం ద్వారా కాజేసిన డబ్బు పెట్టెతో రోడ్డు దాటిన నేరగాళ్లు అక్కడ ఉన్న ఓ సెవెన్ సీటర్ ఆటో ఎక్కి ఎల్బీనగర్ వరకు వెళ్లారు. ఈ ప్రయాణం సాగుతున్నంత సేపు ఆటోడ్రైవర్‌తో ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో ఆటోలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. వీరంతా ఒకే ముఠా వారని నిర్ధారించారు. ఎల్బీనగర్ లో ఆటో దిగి డ్రైవర్‌కు రూ.100 ఇచ్చి రూ.50 తిరిగి తీసుకున్నారు. అక్కడ నుంచి మరో ఆటో ఎక్కి దిల్సుఖ్నగర్ వరకు, అట్నుంచి వేరే ఆటోలో మలక్‌పేట వరకు వెళ్లినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీళ్ల కోసం వేటాడుతూ పోలీసులు రామ్జీనగర్ వరకు వెళ్లినా ఈ ముఠా ఇంకా అక్కడకు చేరలేదని తెలిసింది. మరోపక్క వనస్థలిపురం పోలీసులు ఈ నేరం జరిగిన తీరును అధ్యయనం చేస్తూ బుధవారం క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. త్వరలోనే ముఠాను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. -
వనస్థలిపురం దోపిడీ గ్యాంగ్‌ను గుర్తించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను గుర్తించారు. ఏటీఎంలో డబ్బులు నింపడానికి వచ్చిన సేఫ్‌గార్డ్ సంస్థకు చెందిన వాహనంలోంచి రూ.58.97 లక్షలున్న నగదు పెట్టెను దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరీకి పాల్పడింది చెన్నైకి చెందిన రాంజీ గ్యాంగ్‌గా గుర్తించారు. నగదు చోరీ తర్వాత దిల్సుఖ్ నగర్ వరకు దుండగులు ఆటోలో వెళ్లారు. అక్కడి నుంచి ఆటో మారి చాదర్‌ఘాట్‌కు వెళ్లారు. చాదర్ ఘాట్‌లో మరోసారి ఆటో మారి పరారైనట్టు గుర్తించారు. మొత్తం మూడు ఆటోలు మారినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. 20 బృందాలతో రాంజీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెక్ పోస్టులు, టోల్గేట్లను పోలీసులు అలెర్ట్ చేశారు. గతంలో రాంజీ గ్యాంగ్‌పై పలు కేసులున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే రాంజీ గ్యాంగ్ పలుమార్లు దోపిడి చేసింది. దృష్టి మరల్చి దోపిడి చేయడంలో రాంజీగ్యాంగ్ దిట్ట. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమచేయడానికి బేగంపేటకు చెందిన వైటర్ సేఫ్ గార్డ్ సంస్థకు చెందిన వాహనం నగదుతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరింది. మొదట అబిడ్స్, ఉస్మాన్‌గంజ్, దిల్సుఖ్నగర్లలో ఉన్న ఏటీఎంలలో నగదు జమ చేసి ఉదయం 10.20 గంటలకు విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న వనస్థలిపురం పనామా చౌరస్తాకు చేరుకుంది. వాహనంలో నుంచి 3 లక్షల రూపాయలను యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో జమ చేయడానికి కస్టోడియన్స్ మహ్మద్ థా, విజయ్‌లు లోనికి వెళ్లారు. డ్రైవర్ సత్తికుమార్ వాహనం దిగి పక్కకు వెళ్లగా, వాహనంలోనే సెక్యూరిటీ గార్డు నాగేందర్ కూర్చున్నాడు. ఏటీఎం నుంచి నగదు ఉన్న వాహనం వరకు వంద రూపాయల నోట్లు కింద పడిపోయి ఉన్నాయని ఓ గుర్తు తెలియనివ్యక్తి వచ్చి నాగేందర్‌కు చెప్పి దృష్టి మళ్లించాడు. దీంతో నాగేందర్ వాహనం దిగి డబ్బులను ఏరుకుంటూ ముందుకు వెళ్లాడు. వెంటనే గుర్తు తెలియనివ్యక్తి వాహనంలోకి చొరబడి అందులో ఉన్న నగదు పెట్టెను రెప్పపాటులో తీసుకుని రోడ్డు దాటి ప్యాసింజర్ ఆటో ఎక్కి పరారయ్యాడు. ఆ పెట్టెలో రూ.58.97 లక్షల నగదు ఉంది. అనుమానం వచ్చిన సెక్యూరిటీగార్డు వెంటనే వెనక్కి వచ్చి వాహనంలోకి వెళ్లి చూసేసరికి నగదు పెట్టె కనిపించలేదు. చోరీ జరిగిన విషయమై సెక్యూరిటీగార్డు, కస్టోడియన్స్ వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. -
58.97 లక్షలు కొట్టేశారు
హైదరాబాద్: పట్టపగలు.. జనసమ్మర్ద ప్రాంతం.. ఆ పక్కనే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ.. అయినా దొంగలు అదురూబెదురూ లేకుండా చేతివాటం ప్రదర్శించారు. భారీ చోరీకి తెగబడ్డారు. పక్కా ప్రణాళికతో భారీ నగదు కాజేశారు. కాపలాదారు కన్నుగప్పి సేఫ్‌గార్డ్ సంస్థకు చెందిన వాహనంలోంచి రూ.58.97 లక్షలున్న నగదు పెట్టెను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మంగళవారం నగర శివారులోని వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద చోటు చేసుకుంది. పోలీసులు విడుదల చేసిన అనుమానితుల చిత్రాలు డబ్బులు పడిపోయాయని నమ్మించి.. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమచేయడానికి బేగంపేటకు చెందిన వైటర్ సేఫ్ గార్డ్ సంస్థకు చెందిన వాహనం నగదుతో మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరింది. మొదట అబిడ్స్, ఉస్మాన్‌గంజ్, దిల్సుఖ్నగర్లలో ఉన్న ఏటీఎంలలో నగదు జమ చేసి ఉదయం 10.20 గంటలకు విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న వనస్థలిపురం పనామా చౌరస్తాకు చేరుకుంది. వాహనంలో నుంచి 3 లక్షల రూపాయలను యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో జమ చేయడానికి కస్టోడియన్స్ మహ్మద్ థా, విజయ్‌లు లోనికి వెళ్లారు. డ్రైవర్ సత్తికుమార్ వాహనం దిగి పక్కకు వెళ్లగా, వాహనంలోనే సెక్యూరిటీ గార్డు నాగేందర్ కూర్చున్నాడు. ఈ వాహనం నుంచే నగదు పెట్టెను కొట్టేశారు.. ఏటీఎం నుంచి నగదు ఉన్న వాహనం వరకు వంద రూపాయల నోట్లు కింద పడిపోయి ఉన్నాయని ఓ గుర్తు తెలియనివ్యక్తి వచ్చి నాగేందర్‌కు చెప్పి దృష్టి మళ్లించాడు. దీంతో నాగేందర్ వాహనం దిగి డబ్బులను ఏరుకుంటూ ముందుకు వెళ్లాడు. వెంటనే గుర్తు తెలియనివ్యక్తి వాహనంలోకి చొరబడి అందులో ఉన్న నగదు పెట్టెను రెప్పపాటులో తీసుకుని రోడ్డు దాటి ప్యాసింజర్ ఆటో ఎక్కి పరారయ్యాడు. ఆ పెట్టెలో రూ.58.97 లక్షల నగదు ఉంది. అనుమానం వచ్చిన సెక్యూరిటీగార్డు వెంటనే వెనక్కి వచ్చి వాహనంలోకి వెళ్లి చూసేసరికి నగదు పెట్టె కనిపించలేదు. చోరీ జరిగిన విషయమై సెక్యూరిటీగార్డు, కస్టోడియన్స్ వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలన రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, సీఐ వెంకటయ్య సంఘటనాస్థలాన్ని సందర్శించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నగదు ఎత్తుకెళ్లిన దొంగల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇది అంతర్రాష్ట ముఠా పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పనామా చౌరస్తా నుంచి దిల్సుఖ్నగర్ వైపునకు వెళ్లిన ప్యాసింజర్ ఆటోను సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అయితే ప్యాసింజర్ ఆటోలో మరో నలుగురు ఉండటంతో ఈ దొంగతనంలో వారి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ, బ్యాంక్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టోడియన్ మహ్మద్థా ఫిర్యాదు మేరకు పోలీçసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. -
నగదు చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్: వనస్థలిపురంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్ద జరిగిన నగదు చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏటీఎంలో డబ్బులు వేయడానికి వచ్చిన సిబ్బందిని సుమారు 6 గంటలుగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆటో ఎక్కడ నుంచి వచ్చింది..దుండగులు ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారా లేక దొంగిలించిన ఆటోనా..అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఒకే నెంబర్‌పై రెండు ఆటోలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులు వేయడానికి వచ్చిన సిబ్బంది తీరుపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సిబ్బందిలోనే ఎవరైనా దుండుగులకు సమాచారమిచ్చి ఈ చోరీకి కుట్రపన్ని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేక టీంలతో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నగరమంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు. పురానా పూల్ బ్రిడ్జి వద్ద ఆటోను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనామా కూడలి వద్ద నున్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది నగదు పెట్టెలు తీసుకువచ్చిన సమయంలో వారి దృష్టి మరల్చి రూ.70 లక్షలున్న పెట్టె ఎత్తుకెళ్లిన సంగతి తెల్సిందే. -
ఆ ఏటీఎం చోరీకి విఫలయత్నం
భాగ్యనగర్ కాలనీ: గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంను కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశారు. కూకట్పల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం క్రైమ్ ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం... జయనగర్ కాలనీ లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్లోకి శనివారం రాత్రి మాస్కులు ధరించి ఉన్న దుండగులు ప్రవేశించారు. మిషిన్ ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అది తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరిం చారు. కేసు దర్యాప్తులో ఉంది.