Ayyanna
-
దళిత మహిళా చైర్‌పర్సన్‌ని అవమానించిన అయ్యన్న
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ బలంగా ఉన్న స్థానిక సంస్థలపై కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వాటిని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోంది. తాజాగా దళిత మహిళ అయిన నర్సీపట్నం చైర్‌పర్సన్‌ను అవమానించింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా నిబంధనలు ఉల్లంఘించి మరీ నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇద్దరూ అధ్యక్షత వహించకుండా స్థానిక ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి ఆధ్వర్యంలో నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని.. అందులోనూ బడ్జెట్ సమావేశాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించింది.పైగా, అయ్యన్నపాత్రుడు కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యునిగా మంగళవారమే ప్రమాణ స్వీకారం చేయడం, అధ్యక్ష స్థానంలో ఎవరూ లేకపోయినప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోనే సమావేశాన్ని నిర్వహించడం, బడ్జెట్ ఆమోదించాలని ఆయనే ఆదేశాలు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చైర్‌పర్సన్‌గా వైఎస్సార్సీపీ నియమించిన దళిత మహిళ సుబ్బలక్షిని అవమానపరిచేలా అయ్యన్న వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు.నిబంధనల ఉల్లంఘన!ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీ చట్టం–1965లోని సెక్షన్ 47 (బి), సెక్సన్ 51, సెక్షన్ 51 (1) బి, సెక్షన్ 50 (3) ప్రకారం.. మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించాలి. ఒకవేళ చైర్పర్సన్ అందుబాటులో లేకపోతే వైస్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో జరగాలి. ఇద్దరూ అందుబాటులోకి లేకుండా, మెజార్టీ సభ్యులు హాజరై కోరం ఉంటే.. ఆ సభ్యుల్లో నుంచి ఒకరిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుని, వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలి. అయితే, మంగళవారం జరిగిన నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి చైర్పర్సన్, దళిత మహిళ అయిన సుబ్బలక్ష్మి హాజరు కాలేదు.మాజీ ప్రధాని మన్మోహనసింగ్ మృతికి సంతాప దినాలైనందున సమావేశాన్ని వాయిదా వేయాలని ఆమె అధికారులను కోరారు. అయినా సమావేశాన్ని నిర్వహించారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సమావేశంలో లేరు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనే కౌన్సిల్ హాలులో సమావేశాన్ని నిర్వహించారు. కనీసం సభ్యుల నుంచి తాత్కాలిక అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేదు. నిబంధనలను విరుద్ధంగా సమావేశం జరుగుతున్నప్పటికీ అధికారులెవ్వరూ అడ్డుచెప్పలేదు. అంతేకాకుండా ఏకంగా బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయాలని ఆదేశించారు. పైగా స్పీకరు స్థానంలో ఉన్న తాను ప్రమాణ స్వీకారానికి వస్తున్నానని చెబితే... గైర్హాజరైన చైర్‌పర్సన్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా అధికారులను అయ్యన్న పాత్రుడు ఆదేశించడం గమనార్హం.స్థానిక సంస్థలపై కూటమి పెత్తనంవాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్థానిక సంస్థలపై పెత్తనం చలాయిస్తోంది. ఇటీవల వైఎస్సార్ జిల్లా కడప మునిసిపల్ సమావేశంలో సీటు కేటాయించాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఏకంగా మేయర్‌పైనే దాడి చేసినంత పని చేశారు. ఇప్పుడు నర్సీపట్నం కౌన్సిల్ సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ కూడా అయిన అయ్యన్నపాత్రుడే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం మరిన్ని విమర్శలకు దారితీసింది.వద్దని చెప్పినప్పటికీ.. కావాలనే సమావేశం పెట్టారుమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా సమావేశం వాయిదా వేయాలని చెప్పాను. అయినా కావాలనే సమావేశం పెట్టారు. మన్మోహన్సింగ్ సంతాప దినాలు ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి వేడుకలూ నిర్వహించవద్దని సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడే చెప్పారు. మరోపక్క రాజ్యాంగ పదవిలో ఉండి మొదటిసారిగా మున్సిపల్ సమావేశానికి విచ్చేస్తున్న స్పీకర్‌కు సముచిత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో సంతాప దినాల అనంతరం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను కోరాను. అయినా ఉద్దేశపూర్వకంగా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయం చేశారు. – మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి -
రేప్ కేసు ముద్దాయి.. లాటరైట్ ఖనిజం దోపిడీ
-
గంటా, అయ్యన్నల మధ్య ‘ల్యాండ్’మైన్
- సీఎంకు గంటా లేఖాస్త్రం! - అయ్యన్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు - విశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు - భూకుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలి సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీ భూ కుంభకోణం ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రగిలిస్తోంది. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న వైరం చినికి చినికి గాలివానగా మారుతోంది. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు చాన్నాళ్లుగా ఉప్పు, నిప్పులా ఉంటున్నారు. ఇటీవల విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంలో గంటా పాత్ర ఉందంటూ అయ్యన్నపాత్రుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భూకబ్జాలకు పాల్పడుతున్న వారిలో టీడీపీ నేతలు ఉన్నారంటూ గంటాను ఉద్దేశించి పత్రికా సమావేశాల్లోనూ చెప్పారు. ఈ నేపథ్యంలో గంటా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. అయ్యన్న వ్యాఖ్యల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి, విశాఖ ప్రతిష్ట దిగజారుతుందని అందులో స్పష్టం చేశారు. అయ్యన్న ఆరోపణలతో ప్రతిపక్షాలు టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీపై అపనమ్మకం కలుగజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ గాని, సీబీసీఐడీ, లేదా సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఇన్నాళ్లూ అయ్యన్న వ్యాఖ్యలపై బహిరంగంగా మాట్లాడని, లేఖల సంస్కృతికి దూరంగా ఉండే గంటా ఒక్కసారిగా సీఎంకు లేఖ రాయడం తెలుగుదేశం పార్టీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గంటా ముఖ్యమంత్రికి రాసిన ఈ లేఖ బుధవారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గంటా ఈ లేఖను ఈనెల 4న సీఎంకు రాసినా ఆలస్యంగా బుధవారం బయటకు వచ్చింది. మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖ రాసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఈ లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదని అంటున్నాయి. -
ఇసుక పట్లు
‘తాండవ’పై కన్నేసిన మంత్రులు టెండర్లకు సిద్ధమైన అయ్యన్న,యనమల అనుచరులు ఎలాగైనా చేజిక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు ఇసుక కోసం మంత్రుల అనుచరులు సిగపట్లు పడుతున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులో ఉన్న తాండవ రిజర్వాయర్‌లో పూడిక తీత ద్వారా వెలికితీయాలని నిర్ణయించిన ఇసుకను చేజిక్కించుకునేందుకు ఈ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు ఎత్తుకు పైఎత్తులేస్తున్నారు. అధికారికంగా వెల్లడించిన ఇసుక నిల్వలకంటే అధికంగా కొల్లగొట్టవచ్చనే యోచనలో అనుచరులు ఉన్నారు. విశాఖపట్నం: విశాఖ-తూర్పుగోదావరి జిల్లాలను వేరుచేసే తాండవ నదిలో ఇసుక పై ఇప్పటి వరకు తుని టీడీపీ నేతలే పెత్తనం చలాయించారు. నదీ తీరం ఇరువైపులా ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం తునికి చెందిన పచ్చనేతలే తవ్వుకుపోయేవారు. నిన్నటి వరకు డ్వాక్రా సంఘాల మాటున నదీ గర్భంలో ఇసుకను లూటీ చేసిన ఇసుకాసురులు ఇప్పుడు అధికారిక దోపిడి కోసం ఉవ్విళ్లూరుతున్నారు. పూర్తిగా విశాఖ జిల్లా పరిధిలో ఉండే తాండవ రిజర్వాయర్‌లో పేరుకుపోయిన ఇసుక వెలికి తీసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో దానిపై కూడా ఇరు జిల్లా నేతలే కన్నేశారు. తమ జిల్లా పరిధిలో ఉండే రిజర్వాయర్‌లో ఇసుక తమకే చెందాలన్న పట్టుదలతో ఈసారి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి అనుచరులు పావులు కదుపుతున్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు అయ్యన్న కీలక అనుచరుడు రంగం సిద్ధం చేసుకున్నారు. మరో పక్క ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు తన అనుచరులతో ఈ ఇసుక కోసం టెండర్ వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. రిజర్వాయర్‌కు తూట్లు... రిజర్వాయర్‌లో 62,470 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్టుగా అధికారులు లెక్క తేల్చారు. ఈ ఇసుకను వెలికితీసేందుకు వేలం పాటలు నిర్వహించేందుకు అధికారులు నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 28 వరకు టెండర్లు స్వీకరించి 29న తెరవనున్నారు. రిజర్వాయర్‌లో అధికారులు చెబుతున్న ఇసుకే కాకుండా పూడికతీత మాటున రిజర్వాయర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో లక్షన్నర క్యూబిక్ మీటర్ల ఇసుకను వెలికితీసే అవకాశాలున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే రిజర్వాయర్ ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదేరీతిలో ఇప్పటి వరకు తవ్వకాల పేరుతో తాండవ నదీతీరానికి నష్టం కలిగించారు. ఇప్పుడు రిజర్వాయర్‌కూ తూట్లు పొడిచేందుకు ఇసుకాసురులు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా నేటి నుంచి ప్రారంభం కానున్న టెండర్ల స్వీకరణలో విశాఖలోని వేలం వేస్తున్న ఏకైక రీచ్ కోసం మంత్రుల మధ్య సిగపట్లు తప్పేటట్టు కనిపించడం లేదు. నిన్నటికి నిన్న లేటరైట్ మైనింగ్ కోసం ఇరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడిచినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు తాండవ ఇసుక వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు మరింత ఆజ్యం పోసే సూచనలు లేక పోలేదని ఆ పార్టీ వారే అంటున్నారు. మంత్రుల అండదండలతోనే.. తాండవనదిలో ‘తూర్పు’ వైపు ఉన్న నోటి ఫైడ్ రీచ్‌లను దక్కించుకునేందుకు కృష్ణుడు అండ్ కో సర్వం సిద్ధం చేసుకుంది. ఈ రీచ్‌ల వేలం అనూహ్యంగా వాయిదాపడడంతో ఇప్పుడు వీరి కన్ను తాండవ రిజర్వాయర్‌లోని ఇసుకపై పడింది. ఎలాగైనా ఈ ఇసుకను చేజిక్కించు కోవాలని చాపకిందనీరులా ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో యనమల, అయ్యన్న అనుచరుల మధ్య నెలకొన్న పోటీ అధికారులకు తలనొప్పిగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. ఒక వైపు కృష్ణుడు తన అనుచరులతో రంగంలోకి దిగుతుంటే.. మరోపక్క అయ్యన్న ప్రధాన అనుచరుడు, నర్సీపట్నంలో పార్టీ బాధ్యతలు చూస్తున్న కీలకనేత పూడికతీత రీచ్‌ను చేజిక్కించుకోవాలని పావులు క దుపుతున్నారు. ఎవరికి వారు మంత్రుల ద్వారా అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. -
వాళ్లిద్దరూ కలసి పోయారా ?
-
గంటా,అయ్యన్న వర్గాల తిట్ల పురాణం