Azam Khans wife
-
సమాజ్ వాదీ నేత ఆజాం ఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజాంలకు యూపీలోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. 2019 నాటి నకిలీ జనన ధృవీకరణ పత్రాల కేసులో ఈ ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు విధిస్తూ శిక్షను ఖరారు చేశారు. నకిలీ ధ్రువపత్రాలపై బిజెపి ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్లో జనవరి 3, 2019న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. వారి కుమారుడు అబ్దుల్లా ఆజాంకు రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికేట్లు పొందేందుకు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా సహాయం చేశారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్ లక్నో నుంచి కాగా మరొకటి రాంపూర్ నుంచి పొందినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు. "కోర్టు తీర్పు తర్వాత, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు నుండే దోషులను జైలుకు తరలించారు" అని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా అన్నారు. ఛార్టిషీటు ప్రకారం అబ్దుల్లా ఆజాం జనవరి 1,1993న జన్మించినట్లు రాంపూర్ మున్సిపాలిటీ నుంచి ఒక ధ్రువపత్రాన్ని పొందగా.. మరొకటి సెప్టెంబర్ 30, 1990న జన్మించినట్లు లక్నో నుంచి పొందారు. నాలుగేళ్లపాటు విచారణ తర్వాత న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ -
ఆజం ఖాన్ భార్యపై ఎఫ్ఐఆర్
లక్నో : విద్యుత్ చోరీ ఆరోపణలపై ఎస్పీ నేత, ఎంపీ ఆజం ఖాన్ భార్యపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాంపూర్‌లో ఆజం ఖాన్ భార్య పేరిట ఉన్న రిసార్ట్‌పై దాడులు చేపట్టిన అధికారులు వారి విద్యుత్ మీటర్‌కు నిర్ధేశించిన విద్యుత్ కంటే అధికంగా అక్రమ పద్ధతుల్లో విద్యుత్‌ను వాడుకుంటున్నట్టు గుర్తించారు. ఈ రిసార్ట్ ఆజం ఖాన్ భార్య తజీన్ ఫాతిమా పేరిట ఉందని అధికారులు వెల్లడించారు. 5 కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్ మీటర్ ఉండగా వారు అక్రమ పరికరాలను బిగించి వారి విద్యుత్ మీటర్లలో రీడింగ్స్ నమోదు కాకుండా సామర్ధ్యానికి మించిన విద్యుత్‌ను అనధికారికంగా వాడినట్టు గుర్తించామని చెప్పారు. అధికారుల ఫిర్యాదుతో రాంపూర్ పోలీస్ స్టేషన్లో ఆజం ఖాన్ భార్య తజీన్ ఫాతిమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఆజం ఖాన్ గతంలో ములాయం, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వాల్లో మంత్రిగా వ్యవహరించారు. -
రాజ్యసభ సీటా... నాకొద్దుబాబు
ఎన్నికల్లో పార్టీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా నిలబడాలంటే ... అధిష్టానం మొప్పు పొందాలి. కరెన్సీ నోట్లు వెదజల్లాలి. ఇంకా మాట్లాడితే అదృష్టం కూడా కలసి రావాలి. నిద్రాహారాలు మాని ప్రచారం చేయాలి. ఇంత చేసి ఎన్నికల్లో గెలిస్తే ఓకే. ఓ వేళ ఓడిపోతే ఇంతే సంగతులు. ఈ కష్టం అంతా ఎందుకు రాజ్యసభ సీటు ఇస్తే ఏకంగా వెళ్లి పెద్దల సభలో కాలుమీద కాలు వేసుకుని కూర్చోవచ్చని పలువురు ఆశిస్తుంటారు. ఓ వేళ ఆ అవకాశం అదృష్టం కొద్ది తలుపు తడితే ఎవరైనా ఎగిరి గంతు వేస్తారు. కానీ ఓ పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం కేబినెట్లోని మంత్రిగారి భార్యకు రాజ్యసభ సీటుని ఆఫర్ చేసింది. అయితే ఆ ఆఫర్‌ను సదరు మంత్రిగారి భార్య తొసిపుచ్చింది. రాజ్యసభ సీటు ఆఫర్ చేసినందుకు ధన్యవాదాలు... కానీ రాజ్యసభ సీటు కంటే నా కుటుంబంతో గడపడమే నాకు అతి మఖ్యమని భావిస్తున్నానని ప్రకటించింది. దీంతో సదరు మంత్రిగారు భార్య నిర్ణయంతో పార్టీ అగ్రనాయకత్వం కంగుతింది. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అగ్ర నాయకత్వం ఆలోచనలో పడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రాష్ట్రంలో సీఎం అఖిలేష్ యాదవ్ కేబినెట్లోని అజాంఖాన్ సీనియర్ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన భార్య తంజీమ్ ఫాతిమాకు సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చి పంపాలని నిర్ణయించింది. ఆ ఆఫర్ ఆజాంఖాన్ భార్య నిర్ద్వందంగా తోసి పుచ్చింది.