B. Sriramulu
-
Karnataka: మాజీ మంత్రి శ్రీరాములు కాంగ్రెస్‌లో చేరుతున్నారా?
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బి.శ్రీరాములు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశారు. దీంతో శ్రీరాములు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ ఇటీవల నియమించింది. దీంతో ఈ పదవిని ఆశించిన శ్రీరాములుకు భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే శ్రీరాములు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు డీకే నివాసానికి వెళ్లినట్లు సమాచారం. శ్రీరాములు బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో 2021 ఆగస్టు నుండి 2023 మే వరకు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2020 అక్టోబర్ నుండి 2021 జూలై వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీరాములు ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లాలోని బళ్లారి రూరల్ మొలకల్మూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’
బెంగళూరు : కరోనా నుంచి ఆ దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడని కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల 100 శాతంగా ఉందని, వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం నిబంధనలు పాటించాలని తెలిపారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మనమందరం అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ సభ్యులు, ప్రతిపక్షం, ధనవంతులు, పేదవారు, పోలీసులు, వైద్యులు అంటూ వైరస్ వివక్ష చూపదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొన్నారు. (10 రోజుల చికిత్సకు రూ.9.09 లక్షలు) అయితే ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నయన్న ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. కర్ణాటక ప్రభుత్వం కొవిడ్-19పై అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని.. మంత్రుల నిర్లక్ష్యం వల్లనో, లేక అధికారులు, మంత్రుల మధ్య సమన్వయలోపం వల్లనో జరగడం లేదన్నారు. అలాగే దేవుడు మాత్రమే మనల్ని కరోనా నుండి రక్షించగలడని పేర్కొన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షం విరుచుకుపడుతోంది. దేవుడే కాపాడాలని మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసమర్థకు నిదర్శమని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పేర్కొన్నారు. వైరస్‌ను పరిష్కరించలేకపోతే ఇలాంటి ప్రభుత్వం తమకు అవసరమా అని నిలదీశారు. (ఇతనికి అవేమి పట్టవు.. ఏకంగా 163 సార్లు) అయితే విమర్శలపై స్పందించిన శ్రీరాములు అనంతరం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజల సహకారంతోపాటు దేవుడు దయ కూడా మనకు కావాలని తాను చెప్పినట్లు వెల్లడించారు. తన మాటలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చిత్రీకరించి ప్రసారం చేశాయని బుధవారం రాత్రి వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో 47,253 మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 928 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 2.75 లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు 1.51 లక్షలు, ఢిల్లీ 1.16 లక్షల కేసులతో మూడో స్థానంలో ఉంది. (మంత్రి భార్య, కుమారుడికి పాజిటివ్) -
‘ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో లేను’
సాక్షి, బళ్లారి: తాను ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో తాను లేనని, పార్టీ అధినాయకత్వం అప్పగించే ఏ బాధ్యత అయినా స్వీకరిస్తానని కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు, మొళకాల్మూరు ఎమ్మెల్యే బి.శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం బళ్లారిలో రాఘవ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను ఏ ఒక్క జిల్లాకో చెందిన వ్యక్తిని కానని, అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు తనను ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గత సంకీర్ణ సర్కార్‌పై జనం విసిగిపోయారన్నారు. ఆరు కోట్ల మంది కన్నడిగులు మద్దతు ఇవ్వడంతో యడియూరప్ప మళ్లీ సీఎం అయ్యారన్నారు. యడియూరప్ప సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యులు రాజీనామాలు చేసిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేసిన అంశం కోర్టు విచారణలో ఉన్నందున తాను ఏమీ మాట్లాడబోనన్నారు. అయితే అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే రాజీనామాలు చేసిన వారి బంధువులే ఎన్నికల బరిలో దిగుతారన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం తథ్యమన్నారు. బళ్లారి రాఘవ పేరుపై అవార్డులు అందజేసేందుకు కృషి చేస్తామని శ్రీరాములు పేర్కొన్నారు. కార్యక్రమంలో బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కర్నాటకలో 150 స్థానాల్లో మెజారిటీ సాధిస్తాం
-
'తుపాకీ కొనాల్సిన అవసరం నాకు లేదు'
అనంతపురం: తుపాకీ కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని బళ్లారి ఎంపీ బి శ్రీరాములు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... అసాంఘిక కార్యకలాపాల్లో ఏనాడు పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే అనంతపురం జిల్లా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. బళ్లారిలో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఓ ముఠాను రెండు రోజుల క్రితం అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుంచి ఎంపీ శ్రీరాములు తుపాకీ కొన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను శ్రీరాములు తోసిపుచ్చారు. -
6 తర్వాత బీజేపీలో బీఎస్సార్సీపీ విలీనం
సాక్షి, బళ్లారి(కర్ణాటక): ఈ నెల ఆరో తేదీ తర్వాత తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. శ్రీరాములు తెలిపారు. ఆయన ఆదివారం కంప్లిలో విలేకరులతో మాట్లాడారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటలతోనే రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేజేపీ విలీనంతో బీజేపీకి కొండంత బలం వచ్చిందని పేర్కొన్నారు. తర్వాత బళ్లారిలో విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి ఎంపీ శాంత, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, మిత్రులు గాలి జనార్దనరెడ్డి, గాలి సోమశేఖరరెడ్డి తదితర పార్టీ నేతలతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో పార్టీ విలీనంపై ప్రకటన చేస్తానన్నారు. తాను బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. -
బీజేపీ నుంచి నాకు ఆహ్వానం రాలేదు
నెలాఖరులో భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తా శ్రీరాములు స్పష్టీకరణ బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరాలని ఆ పార్టీ నుంచి ఏ విధమైన ఆహ్వానం నాకు రాలేదని బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాపకులు బీ.శ్రీరాములు స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ పార్టీలోకి చేరాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన అభిమానులు, మద్దతుదారులు, కార్యకర్తలు, పార్టీ నేతలతో ఈ నెలాఖరులో సమావేశ పరిచి చర్చించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయంలో మాజీ సీఎంలు జగదీశ్ శెట్టర్, డీవీ.సదానందగౌడలను తాను సంప్రదించాననడం ఊహాగానాలేనన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కేజేపీని బీజేపీలోకి విలీనం చేయడం మంచి నిర్ణయమన్నారు. దేశానికి సమగ్రత, శాంతి, సౌహార్ద్రత, ప్రామాణిక పాలన అందించేందుకు నరేంద్రమోడీ ప్రధాని కావడం అవసరమన్నారు. దేశం సుభద్రంగా ఉండాలనేదే తమ ఆశయమన్నారు. హంపి ఉత్సవాల ఏర్పాట్ల ముందస్తు సమావేశం గురించి తనకు ఎవరూ తెలియజేయలేదన్నారు. గతంలో దివంగత ఎంపీ ప్రకాష్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ పరిగణనలోకి తీసుకుని ఉత్సవాలు చేపట్టామని గుర్తు చేశారు. అయితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా మంత్రిగాని, అధికారులు గాని తమకు ఆహ్వానం పంపలేదన్నారు. జిల్లాలో కరువు సమీక్షపై కూడా తనను పరిగణలోకి తీసుకోలేదన్నారు.