వెంకన్న వెనుక పోదామా? వద్దా?
గోదావరిఖని(కరీంనగర్) : ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ బి.వెంకట్రావు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి నిర్ణయం తీసుకోవడంతో అయోమయంలో ఆ యూనియన్ కేడర్ ఉంది. సెప్టెంబర్ 1న వెంకట్రావు చేరికకు ముహూర్తం ఖరారు కావడంతో ఆయనతో ఉండాలా? లేక యూని యన్‌లో కొనసాగాలా? అనే మీమాంసలో కొట్టుమి ట్టాడుతున్నారు. సింగరేణితో 45 ఏళ్లుగా సుధీర్ఘ అను బంధం ఉన్న వెంకట్రావు రాజకీయంగా 1970 నుంచి 1980 వరకు పదేళ్ల పాటు ఆదిలాబాద్ జిల్లా రామ కృష్ణాపూర్ సమీపంలోని కేతనపల్లికి ఏకగ్రీవంగా కాంగ్రెస్ నుంచి సర్పంచ్‌గా పనిచేశారు.
ఆ తర్వాత తాండూర్ కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌లో పనిచే శారు. సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు అధ్యక్షుడిగా కొనసాగారు. సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా, కోల్ఇండియాలో వేజ్‌బోర్డు సభ్యుడిగా 25 ఏళ్ల పాటు కొనసాగారు. పార్టీ పరంగా యూత్ కాంగ్రెస్‌లో కొనసాగిన వెంకట్రావు ఆ తర్వాత పీసీసీ లేబర్ సెల్ చైర్మన్‌గా 2002 నుంచి 2007 వరకు పని చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా 2013 వరకు కొన సాగారు. ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. సింగరేణిలో ఐఎన్టీయూసీ అను బంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ ఎమ్మెల్సీగా గవ ర్నర్ కోటాలో ఆయన కొనసాగుతున్నారు. అయితే ఎమ్మెల్సీ, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెం కట్రావు టీఆర్ఎస్లో చేరడం ఖాయం కావడంతో ఆ యూనియన్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. పార్టీ పరంగా టీఆర్ఎస్లో కొనసాగడం, యూనియన్ తరఫున ఐఎన్టీయూసీలో పనిచేయడం ఎలా సాధ్య మవుతుందనే భావనతో వారున్నారు.
ఏదో ఒక వైపు ఉంటేనే పార్టీకి గానీ, యూనియన్‌కు గానీ సార్థకత చేకూరుతుందని, కానీ వెంకట్రావు నిర్ణయం ఎటూ పనిచేయకుండా ఉందని వారు ఆందోళన చెందుతు న్నారు. తాము ఎటు వైపు ఉండాలనే నిర్ణయాన్ని మా త్రం ముఖ్యమైన నాయకులు ఇంకా నిర్ణయం తీసు కోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా వెంకట్రావు టీఆర్ ఎస్‌లో చేరితే ఇప్పటికే ఆ పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న టీబీజీకెఎస్‌లో నాయకత్వం ఐఎన్టీయూ సీపై విమర్శలు చేస్తుందా? లేక ఐఎన్టీయూసీలో కొనసాగుతానన్న వెంకట్రావు టీబీజీకేఎస్ పట్ల సాను కూల వైఖరితో ఉంటాడా? అనే ప్రశ్నలు ఉదయిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ కేడర్ వెంక ట్రావుతో వెళ్లాలా.. లేక ఐఎన్టీయూసీలో కొనసా గాలా.. అనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇక పలువురు ఐఎన్టీయూసీ నాయకులకు మాజీమంతి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ జి.వివేక్ ఫోన్లు చేసి వెంకట్రావు వెంట వెళ్లొద్దని కోరినట్లు సమాచారం.