Baby laughs
-
ఇది చూసి హాయిగా నవ్వేయండి: అమితాబ్
స్త్రీలు రోజుకు అరవై రెండుసార్లు నవ్వుతారట. ఈ విషయంలో మగవాళ్లు మరీ పిసినారులు. వీళ్లు రోజుకు సగటున ఎనిమిది సార్లు మాత్రమే నవ్వుతారు. మరి పిల్లలు.. లెక్కలేనన్నిసార్లు కిలకిల నవ్వుతూనే ఉంటారు. ఇక్కడ ఉన్న బుడ్డోడు కూడా అలాంటి నవ్వుల రారాజే. వాడు పగలబడి నవ్వుతూనే మనల్నీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ వీడియోను బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'ప్రస్తుత పరిస్థితిలో మార్పు కోసం సరదాగా నవ్వేయండి' అంటూ క్యాప్షన్ జోడించాడు. వీడియో విషయానికొస్తే మిసిసిపికి చెందిన ఓ తల్లి తన కుమారుడికి తినిపిస్తోంది. (బాల్‌ను ఓ రేంజ్లో ఆడేసుకుందిగా..) ఈ సమయంలో ఆమె ఒక్కసారిగా తుమ్మింది. వెంటనే బుడ్డోడు పగలబడి మరీ నవ్వాడు. తల్లి తుమ్మిన ప్రతీసారి పకపకా నవ్వుతూనే ఉన్నాడు. మరి ఆమె తుమ్మే సమయంలో మాస్కు పెట్టకుందా లేదా వంటి ప్రశ్నలు అడగకండి. ఎందుకంటే ఆమె నిజంగా తుమ్మట్లేదు. కొడుకు నవ్వడం ఆపేసిన ప్రతీసారి వాడిని నవ్వించేందుకు మళ్లీ మళ్లీ తుమ్ము వచ్చినట్లు నటిస్తోంది. కాగా ఇది టిక్‌టాక్‌లో వైరల్ అయిన పాత వీడియోనే అయినప్పటికీ మరోసారి నెట్టింట హల్చల్ చేస్తోంది. లాక్డౌన్ టైంలో ఆ చిన్నోడి నవ్వులను ఆస్వాదిస్తూ మీరూ తనివితీరా నవ్వేయండి. (అరుదైన రెండు తలల తాబేలు ఇదే!) -
పాపాయి నవ్వులేవీ...!
* 1991 నుంచి తగ్గుతున్న ఆడపిల్లల జననం * పిల్లల శాతంలో అట్టడుగున వైఎస్సార్ జిల్లా సాక్షి, హైదరాబాద్: నట్టింట పాపాయి నవ్వులు వినిపించడం లేదు. ఆడపిల్లలను తల్లి గర్భంలోనే చిదిమేస్తున్నారు. ఒకవేళ పుట్టినప్పటికీ లింగ వివక్ష కారణంగా వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల శాతం ఏటికేటికీ తగ్గిపోతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా 1991 నుంచి ఇప్పటివరకు ఆరేళ్ల లోపు ఆడ పిల్లల శాతం భారీగా తగ్గుతూ వస్తోంది. తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మంది మగ పిల్లలకు 935 మంది మాత్రమే ఆడ పిల్లలు ఉన్నారు. 1991లో ఆరు సంవత్సరాలలోపు ఆడ పిల్లల శాతం 975 ఉండగా.. 2001లో 961కి పడిపోయింది. 2011లో మరింతగా 935కి దిగజారి పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది మగ పిల్లలకు 941 మంది ఆడ పిల్లలే ఉన్నారు. మొత్తంగా ఆరేళ్లలోపు ఆడ పిల్లల సంఖ్య 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 33 శాతం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో వైఎస్సార్ జిల్లా మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాలో ఆరేళ్లలోపు వెయ్యి మంది మగ పిల్లలకు 918 మంది ఆడ పిల్లలు మాత్రమే ఉన్నారు.