Bachampalli Santosh Kumar Sastry
-
దేశంలోని ప్రతీ నగరంలో గణపతికి సంబంధించిన ఆనవాళ్లున్నాయి
-
కాశీ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లో 56 గణేషుడి దేవాలయాలు
-
ఈసారీ మంచి వానలు
సాక్షి, హైదరాబాద్: ప్లవ నామ సంవత్సరంలో మంచి వానలు కురుస్తాయని, రైతుల మోములో చిరునవ్వు వస్తుందని శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణి కులు బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి చెప్పారు. కొత్త ఏడాది మహిళల ఆధిపత్యం అన్ని రంగాల్లో విస్తరిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వం–ప్రజల మధ్య సమన్వయం, సఖ్యత వల్ల పాలన సాఫీ సాగుతూ ప్రజలకు మేలు జరుగుతుం దని వివరించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ‘ప్లవ’నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో ఉన్న దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగాయి. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోషకుమార శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..‘‘ప్లవ అంటే పడవ. నీటి పక్షి అన్న అర్థం కూడా ఉంది. అగ్ని పురాణం ప్రకారం.. ఇప్పుడు ముగిసిన సంవత్సరం శార్వరి. శార్వతి అంటే చీకటి రాత్రి.. వచ్చే సంవత్సరం శుభకృతి అంటే శుభం. చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్లేదే ప్లవ నామ సంవత్సరం. ఈ ఏడాది పర్వతాకారం లాంటి నల్లని మేఘాలతో ఆకాశం ఆవృతమై ఉంటుంది. రాజు- ప్రజలు సమైక్యంగా జగతికి కాంతులనిస్తా రని శాస్త్రం చెబుతోంది. ధనధాన్యాల వృద్ధి అద్భు తంగా ఉంటుంది. వర్షాలు కురుస్తాయి, పంటలు పండేందుకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. విశేష శుభ ఫలితాలను పొందుతాం. ఈ సంవత్సరానికి దైవం రుద్రుడు. అందువల్ల ఈశ్వరారాధన శుభాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి బుధుడు, సేనాధిపతి కుజుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి గురువు, అర్ఘాధిపతి, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు. కుజుడికి ఆధిపత్యం రావటం, మేష లగ్నంలో సంవత్సరం ప్రారంభం కావడం వల్ల ప్రజలకు– ప్రభుత్వానికి మధ్య సానుకూలాంశాలు నెలకొంటాయి. సమర్థ పాలన మన రాష్ట్రాధిపతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకరీత్యా బుధ మహాదశలో పుట్టారు. ఆయనది మేష లగ్నం. ఆయన గ్రహస్థితిలో అద్భుతంగా యోగించిన కుజుడు ఈ సంవత్సరం రాజు కావడం.. ఈ పోలికల ఆధారంగా పంచాంగాన్ని విశ్లేషిస్తే.. సమర్థవంతమైన పాలన సాగుతుంది. శనికుజుల పరస్పర వీక్షణం వల్ల ముఖ్యమంత్రి వేగాన్ని మిగతా మంత్రులు, అధికారులు అందుకోలేకపోవచ్చు. దీనివల్ల సమన్వయ లోపం కొంత ఏర్పడి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి వ్యయస్థానంలో రవి బుధ చంద్రుల కలయిక వల్ల పాలనాపరమైన ఖర్చులు పెరుగుతాయి. ప్రజలు ఆడంబరాలకు పోయి స్థాయికి మించిన ఖర్చు చేస్తారు. అందుకే ప్లవ నామ సంవత్సరంలో ప్రజలు దుబారా, ఆడంబరాలను తగ్గించుకోవాలి. ప్రభుత్వానికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. రక్షణ శాఖ ఉత్సాహంగా పనిచేస్తుంది, కొత్త ఆయుధాల ఆవిష్కరణ జరుగుతుంది. ప్రభుత్వానికి ప్రజల అండ ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా ఉండదు. ప్రభుత్వానికి ప్రజల అండదండలు మెండుగా ఉంటాయి. రాజ్యాంగ నిర్ణయాలు ప్రజలకు సంతృప్తినిస్తాయి. ప్రస్తుత గ్రహస్థితి వల్ల జూలై 13 నుంచి ఆగస్టు 16 మధ్య ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. మే తర్వాత కరోనా ఉధృతి బాగా తగ్గుతుంది. కానీ ప్రజలు నిర్లక్ష్యాన్ని వదిలేయాలి. సెప్టెంబరు 14 నుంచి నవంబరు 20 మధ్య గురు శనిల కలయిక వల్ల మరోసారి భయాందోళన పరిస్థితి నెలకొంటుంది. డిసెంబరు 4 నుంచి కాలసర్పదోషం వల్ల కొన్ని అరిష్టాలు ఏర్పడుతాయి. మకర రాశిలో శనైశ్వర సంచారంతో భయం, అతివృష్టి ఏర్పడతాయి. 2022 మార్చి మొదటివారంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది. ముందుజాగ్రత్తలు అవసరం. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష పురోగతి ఉంటుంది. రియల్ ఎస్టేట్ పురోగమిస్తుంది కుజుడికి చాలా ఆధిపత్యాలు రావటంతో రియల్ ఎస్టేట్‌లో భారీ పురోగతి ఉంటుంది. భూముల ధరలు పెరుగుతాయి. 3,4 రియల్ ఎస్టేట్ సంబంధిత భూ కుంభకోణాలు వెలుగుచూస్తాయి. ప్రజలు భూములు కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది సింధూ పుష్కరాలు నవంబర్ 21 నుంచి డిసెంబరు 2 వరకు సింధూ నది పుష్కరాలు ఉంటాయి. మనదేశంలో తక్కువ ప్రాంతంలో ఆ నది ఉన్నందున సింధూ నదిని తలుచుకుని మిగతా నదుల్లో స్నానం చేస్తే పుష్కర పుణ్యం కలుగుతుంది. ఈ సంవత్సరం మనకు గ్రహణ ప్రభావాలు లేవు. ఈసారి ముహూర్తాలు ఎక్కువ గతేడాది మౌఢ్యముల వల్ల ముహూర్తాలు తక్కువగా ఉండటంతో జనం ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషంగా పెళ్లిళ్లు జరుగుతాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాలసర్పదోషం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉంటూ ఆధ్యాత్మిక భావనతో గడిపితే మంచి జరుగుతుంది. కాళేశ్వరం పరిపూర్ణంగా నిండి జలవనరులతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. యాదాద్రి దేవాలయం ప్రారంభమై దివ్యమంగళ దర్శనం కలుగుతుంది.’’ -
మంత్రి ప్రకటన: 13వ తేదీనే ఉగాది
సాక్షి, హైదరాబాద్: ప్రతిసారి తెలుగు నూతన సంవత్సరం ఉగాది విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ఈసారి అలాంటిదేమీ లేకున్నా ఉగాది పండుగ విషయంలో మత్రం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈనెల 13వ తేదీన ఉగాది పండుగ చేసుకోవాలని మంత్రి ప్రకటించారు. ఆ రోజుల ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం ఉగాది పండుగ నిర్వహణపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి కూడా ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన ఉగాది పర్వదినం పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి దేవస్థాన ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరిస్తామని వివరించారు. ఆరోజు ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. -
అనారోగ్యం ‘మస్తు’
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రజలు సమష్టిగా ముందడుగు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పాటిస్తే ఈ భయంకర సమస్య నుంచి బయటపడతాం. ప్రభుత్వ సూచనలే కాదు, పంచాంగం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కొత్త ఏడాదిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వికారి నామ సంవత్సరం పోతూపోతూ ‘కరోనా’ వికారాన్ని అంటగంటి వెళ్లింది. కొత్త ఏడాది మార్చి 30 నుంచి మే 4 వరకు మకరరాశిలో కుజుడు, శని, గురువు సంచారం ఉంది. ఒకే రాశిలో మూడు గ్రహాల సంచారం వల్ల ఘోర ఫలితాలు ఎదురుకావచ్చు’ అని ప్రముఖ పౌరాణికులు బాచంపల్లి సంతోష్‌కుమారశాస్త్రి అన్నారు. శ్రీ శార్వరి నామ సంవత్సరం కాలసర్పయోగంతో మొదలైందని, అటువంటి యోగాలు ఈ ఏడాదిలో 6 ఉన్నందున ప్రజలకు ఆరోగ్యపర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అయితే, జాగరూకతతో వ్యవహరిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చన్నారు. శార్వరి నామ ఉగాది వేడుకలు బుధవారం ఉదయం దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు ఉండటంతో సాధారణ ప్రజలు, మీడియా ప్రతినిధుల హాజరు లేకుండా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ సమక్షంలో అర్చకులు, ఇతర అధికారుల మధ్య వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగం ప్రకారం ఈ ఏడాది యోగఫలాల వివరాలు బాచంపల్లి మాటల్లోనే.. ఈ ఏడాది వానలే వానలు.. ఈ ఏడాది వానలు బాగా కురుస్తాయి. రైతాంగానికి మేలు కలుగుతుంది. సంవర్త పేరుతో మేఘాలు ఉన్నందున మూడు కుంచాల వాన కురుస్తుందని పంచాంగం చెబుతోంది. ఎరుపు నేలలు, ఎరుపు రంగు పంటలు లాభిస్తాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడటంతో భారీ వర్షాలు, అడపాదడపా భూకంపాలు సంభవిస్తాయి. ఆషాఢంలోనూ ఈసారి వానలు కురుస్తాయి. ఆగస్టు, సెప్టెంబరుల్లో దక్షిణ భారతంతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. చెన్నైలో భారీ వానలు కురుస్తాయి. హైదరాబాద్‌లో మంచి వానలుంటాయి. కాళేశ్వరం ఫలితాలు రాష్ట్రమంతా అందే అవకాశం ఉంటుంది. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర నదీ పుష్కరాలు.. ఈయేడు ఐదు గ్రహణాలు ఏర్పడుతున్నా, దేశంలో రెండు మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. అందులో జూన్ 21 ఆదివారం ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 1.44 వరకు చూడామణి కంకణ సూర్యగ్రహణం ఉంటుంది. మాంద్యమున్నా రాష్ట్రం నెట్టుకొస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా.. మన దేశం, మన రాష్ట్రం విజయవంతంగా నెట్టుకొస్తాయి. ఈ సంవత్సరం మన దేశ సర్వ ఆదాయం 105, సర్వ వ్యయం 96. మిగులు 9. దానితోనే కేంద్ర, రాష్ట్రాలు నెట్టుకురావాలి. ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రజలకందే కొన్ని సబ్సిడీలు దూరమవుతాయి. ఆర్థిక మాం ద్యం దృష్ట్యా ప్రజలు పొదుపు మంత్రం పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణతోనే మేలు కలుగుతుంది. తరచూ జాతీయస్థాయి విపత్తులు సంభవిస్తాయి. ధరలు పెరుగుతాయి. శని రసాధిపతిగా ఉన్నందున పెట్రోలు, డీజిల్ ధరలు తారస్థాయికి చేరుతాయి. బ్యాంకులపై ప్రజలకు నమ్మకం సడలుతుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఈ సంవత్సరం కత్తిమీద సామే.. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. విద్యారంగంలో సాధారణ ఫలితాలుం టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదమ్ముల్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండటం ప్రజలకు మేలు చేస్తుంది. క్రీడారంగం, మిలిటరీలో ఉత్సాహం అంతంతే. ఈ ఏడాది 384 రోజులు.. 13 నెలలు ఈయేడు నవ నాయకుల్లో నాలుగు శుభగ్రహాలకు, ఐదు పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది. ఉగాది బుధవారం వచ్చినందున బుధుడు రాజుగా ఉంటాడు. బుద్ధిమంతు డు, యుక్తాయుక్త వివేచన కలవాడు రాజుగా ఉండేం దుకు అవకాశం కలుగుతుంది. రియల్ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లో కొత్తపుంతలు తొక్కుతుంది. శాంతిభద్రతలు బాగుంటాయి. సేనాధిపతి రవి అయినందున ప్రజలకు రక్షణ అందించేందుకు పోలీసు శాఖ బాగా పనిచేస్తుంది. మీడియా ఇబ్బందులు, ఆర్థికచిక్కులతో అతలాకుతలం కాక తప్పదు. సంక్షేమ శాఖలు, పరిశోధన రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. ఓ ప్రఖ్యా త కళాకారుడు మృత్యువాత పడతారు. శార్వరి నామ సంవత్సరంలో 384 రోజులుంటాయి. ఆశ్వయుజ మాసం అధికమాసంగా వచ్చినందున 13 నెలలుంటా యి. ఈ సంవత్సరం దైవం భాస్కరుడు. ప్రజలు సూర్యోదయా న్ని, చంద్రోదయాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఆదివారం మాంసాహారాన్ని మానితే ఆరోగ్యానికి మేలు. మనో సంకల్పం నెరవేరుతుంది.. కేసీఆర్: కర్కాటకం ఆదాయం–11, వ్యయం–8 రాజపూజ్యం–5, అవమానం–4 గ్రహస్థితి రీత్యా మిశ్రమ ఫలితాలున్నా వ్యక్తిగత జాతకరీత్యా పరిస్థితి అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతం రాహు మహాదశ కొనసాగుతోంది. సూర్యుడి స్థితి దాటుతున్నందున మనో సంకల్పం నెరవేరుతుంది. జూలై నుంచి అక్టోబరు వరకు ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూల సంవత్సరం. గతంలో కంటే అనుకూల ఫలితాలు మోదీ: వృశ్చికం ఆదాయం–5, వ్యయం–5 రాజపూజ్యం–3, అవమానం–3 మిశ్రమ ఫలితాలుంటాయి. అయితే, శని బాగా యోగిస్తున్నాడు. గురువు కొద్దికాలం మాత్రమే యోగించటం, రాహుకేతువులు అనుకూలంగా లేనందున విజయం కోసం కష్టపడాలి. గతేడాది కంటే అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. శని మూడో స్థానంలో ఉన్నందున చేపట్టిన పనిలో విజయం సా«ధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
ఈ ఏడాది తీవ్రవాదుల ప్రభావం
⇔ పంచాంగ పఠనంలో బాచంపల్లి ⇔ ఆగస్టు–అక్టోబర్ మధ్య తెగబడొచ్చు ⇔ ఓ నేతకు ప్రమాదం పొంచి ఉంది ⇔ భద్రత వ్యవస్థ అప్రమత్తంగా పనిచేయాలి ⇔ ఈసారీ వానలు అనుకూలమే.. వరుణ యాగం చేస్తే మంచిది ⇔ తెలంగాణలో రైతులకు అనుకూల వాతావరణం ⇔ సాఫ్ట్‌వేర్‌లో మందగమనం.. ఔషధ కల్తీ.. మీడియాలో ఒడిదుడుకులు.. ⇔ దేశఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది ⇔ వ్యక్తిగతంగా మోదీ, కేసీఆర్‌కు మంచి యోగం సాక్షి, హైదరాబాద్: హేవళంబినామ సంవ త్సరంలో తీవ్రవాదుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని శృంగేరీ ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి హెచ్చరిం చారు. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో వారు తెగబడేందుకు అవ కాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర భద్రత వ్యవస్థ అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఓ నేతకు ప్రమాదం పొంచిఉందన్నారు. బుధవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్లో ‘జనహిత’ వేదిక మీదుగా ఆయన కొత్త సంవత్సర పంచాగ పఠనం చేశారు. గత సంవత్సరం విద్య, వైద్య శాఖల్లో తీవ్ర అవినీతి ఆరోపణలు వెలుగుచూస్తాయని రవీంద్రభారతిలో జరిగిన పంచాంగ పఠనంలో పేర్కొనడం.. చెప్పినట్టే ఈ రెండు శాఖలను అవినీతి ఆరోపణలు కుదిపేశాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏ శాఖలో పరిస్థితి బాగోలేదంటూ పలువురు ఆయన్ను కొద్ది రోజులుగా ప్రశ్నిస్తున్నారు. సంతోష్‌కుమార్ శాస్త్రి ఇదే విషయాన్ని ఉటంకిస్తూ.. ఈసారి హోంశాఖ చాలా అప్రమత్తంగా పని చేయా ల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పంచాంగ పఠనం తర్వాత సీఎం చంద్రశేఖరరావు తన ప్రసంగంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిం చారు. హోంమంత్రి నాయిని, పోలీసులు పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో రైతు అనుకూల వాతావరణం గత సంవత్సరం భారీ వర్షాలు కురిసి రైతు కళ్లల్లో ఆనందం నిండినట్టే ఈ ఏడాది కూడా వానలు సమృద్ధిగానే కురుస్తాయని సంతోష్‌కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. గత సంవత్సరం భారీ వర్షాలు కురిసినా అవి సరైన సమయంలో కురవలేదని, ఈసారి అవసరమైన సమయంలోనే కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ఆషాఢమాసం ప్రారంభంలోనే దేవాదాయ శాఖ వరుణ జపాలు, విరాట పర్వం పారాయణాలు నిర్వహిస్తే మంచి ఫలితాలుంటాయని, అది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సంవ త్సరం ఆది దేవుడు అగ్ని రూపంలోని సూర్యభగవానుడని, రాజు స్థానంలో బుధుడు, మంత్రి స్థానంలో శుక్రుడున్నాడని చెప్పారు. ఇది రాష్ట్రానికి మంచి చేస్తుందని, కొన్నిచోట్ల రాజకీయ అలజడులు, చోరులు, దుర్మార్గుల ఆగడాలు కనిపించినా దైవానుగ్రహంతో సర్దుకుంటాయని పేర్కొన్నారు. ధాన్యాల ధరలు స్థిరంగా ఉండటం రైతులకు ఉపయోగపడుతుందని, ధాన్యాధిపతిగా శని ఉన్నందున మినుములు, నల్ల నువ్వులు, అవిసెలు, ఇతర నల్ల పంటలు బాగా పండుతాయన్నారు. శ్రావణ మాసం వరకు మంచి వానలుంటాయని, అక్టోబర్‌లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయన్నారు. ఆషాఢమాసంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావం కనిపిస్తుందని, దాని వల్ల తెలంగాణకు పెద్దగా ఇబ్బంది ఉండదని చెప్పారు. దేశ కీర్తి మరింత పెరుగుతుంది భారత్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుందని, సాంకేతికంగా దేశం ముందడుగు వేస్తుందని, కొత్త ఆయుధాలను సొంతంగా రూపొం దించుకుంటుందని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. ప్రధాని మోదీకి కూడా మంచి యోగం ఉన్నందున ఈ సంవత్సరం ఆయన ప్రజారంజకంగా వ్యవహæరిస్తారన్నారు. మందకొడిగా సాఫ్ట్వేర్.. ఈ ఏడాది సాఫ్ట్వేర్ రంగం మందకొడిగా సాగుతుందని, ఇందులో కుంభకోణం వెలుగుచూసే అవకాశం ఉందని సంతోష్‌కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. ఔష ధాల్లో కల్తీలు ఎక్కువవుతాయన్నారు. మీడియా రంగంలోనూ ఒడిదుడుకులు కనిపిస్తాయని, రోగపీడల ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్నారు. ఈ సంవ త్సరం పుష్కరుడు కావేరీ నదిలో ఉంటాడని, ఆగస్టు 7న పాక్షిక చంద్ర గ్రహణం, జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటాయన్నారు. అయినా నవ నాయ కుల్లో ఆరుగురికి శుభాధిపత్యం, ఉప నాయకుల్లో 14 మందికి శుభాధిపత్యం ఉన్నందున మొత్తంగా హేవళంబి సంవత్సరం క్షేమకరమేనన్నారు. ప్రజల్లో విలా సాలు, వినోదాలపై కొంత ఆసక్తి పెరుగుతుందన్నారు. నిర్ణయాలు మగవారే తీసుకున్నా తెరవెనుక మహిళల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. అధికారులపై సీఎం అసంతృప్తి ఇప్పటి వరకు ఉగాది వేడుకలను రవీంద్రభారతి వేదికగా నిర్వహించగా.. తొలిసారి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. వేదికకు ఒక పక్కన మామిడి చెట్టు సెట్టింగ్ ఏర్పాటు చేసి దాని కిందే పంచాంగ పఠనం కోసం వేదిక రూపొందించారు. అయితే అది దూరంగా ఉండటంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేసి తమ ముందు పీఠం ఏర్పాటు చేయాలని ఆదేశించటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి సిద్ధం చేశారు. ఆహ్వాన పత్రాలున్నవారికే అవకాశం కల్పించారు. చూసేందుకు వచ్చిన వారిని పోలీసులు రోడ్డుపైనే నిలిపివేయటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాంగ పఠనం అనంతరం వివిధ దేవాలయాలకు చెందిన అర్చకులు, పండితులు, సిద్ధాంతులను వేదికపై సత్కరించారు. అనారోగ్యం కారణంగా ఒకరిని మాత్రమే సీఎం శాలువాతో సత్కరించగా.. మిగతావారిని మంత్రులు సన్మానించారు. సీఎంకు ఆదాయం 11.. ఖర్చు 8 ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరిస్థితి అనుకూలంగా ఉందని, గత సంవత్సరం కంటే ఇటు ఆదాయం, అటు గౌరవం (రాజపూజ్యం)లో మెరుగ్గా ఉంటుందని సంతోష్‌కుమార్ చెప్పారు. సీఎంది కర్కాటక రాశి అయినందున ఈ సంవత్సరం ఆదాయం 11 ఉంటే ఖర్చు 8 ఉంటుందని, రాజపూజ్యం 5 ఉంటే.. అవమానం 4గా ఉంటుందన్నారు. వృశ్చిక రాశిలో ఉన్న ప్రధాని మోదీకి కూడా ఈ ఫలితాలు 5–5, 3–3గా ఉంటాయన్నారు. విద్యుత్ రంగం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు పరిస్థితి అనుకూలంగా ఉందని తెలిపారు.