Bachchannapet
-
‘జనగామను జిల్లా చేయాలి’
జనగామ(వరంగల్): జనగామను జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తూ.. బచ్చన్నపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మానవహారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా జనగామను జిల్లాగా ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అఖిలపక్షం నాయకులు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
వరంగల్: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బచ్చన్నపేట గ్రామంలో ఈ దారణం జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.