back up
-
కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!
ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు క్లౌడ్ స్టోరేజ్‌ను పరిమితం చేస్తూ గూగుల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా యూజర్లు కేవలం 15 జీబీ వరకు మాత్రమే డేటాను క్లౌడ్‌లో స్టోర్చేసేందుకు గూగుల్ అనుమతిస్తుంది. అంతకుమించి క్లౌడ్ స్టోరేజ్ కావాలంటే కచ్చితంగా కొంత రుసమును చెల్లించాల్సిందే. ఇప్పుడు గూగుల్ మరో ఎత్తుతో యూజర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చదవండి: చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్..! వాట్సాప్‌లో పరిమిత సేవలు...! వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌లోని ఫోటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లను బ్యాకప్ చేసుకొనే సౌకర్యాన్ని యూజర్లకు వాట్సాప్ యాప్ కల్పిస్తోంది. వాట్సాప్ యూజర్లకు బ్యాకప్ విషయంలో నియంత్రణను కల్పించేలా కొత్త బ్యాకప్ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. బ్యాకప్‌పై నియంత్రణ ఉంచడంతో యూజర్లకు నచ్చిన వాటిని బ్యాకప్ చేసుకొనే వీలు ఉంటుంది. వాట్సాప్ బ్యాకప్ డేటా పూర్తిగా యూజర్ సంబంధిత గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతుంటుంది. గూగుల్ డ్రైవ్‌లో అపరిమితంగా వాట్సాప్ డేటాను బ్యాకప్ చేసుకోవచ్చును. తాజాగా వాట్సాప్ నిర్ధిష్ట బ్యాకప్ డేటాకు మాత్రమే ఆలో చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అపరిమిత వాట్సాప్ బ్యాకప్ డేటాకు త్వరలోనే కాలం చెల్లనుంది. రానున్న రోజుల్లో వాట్సాప్ అపరిమిత బ్యాకప్ డేటా వాడకం కోసం గూగుల్ ఛార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు వాట్సాప్ బ్యాకప్ డేటా పై 2000ఎమ్బీ వరకు పరిమితిని గూగుల్ విధించనుంది. కాగా ప్రస్తుతం వస్తోన్న వార్తలపై వాట్సాప్, గూగుల్ స్పందించలేదు. వాట్సాప్ బ్యాకప్ డేటా పరిమితిపై రానున్న రోజులే నిర్ణయించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. చదవండి: దేశీయ విమాన ప్రయాణీకులకు ఊరట -
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్
వాట్సాప్.. పర్సనల్ మెసేజింగ్ యాప్. ఇద్దరి మధ్యగానీ, గ్రూపులోగానీ సంభాషణలకు, వ్యక్తిగత కాల్స్‌కు ఇంటర్నెట్ స్వేచ్ఛతో అనుమతించ్చే యాప్. అయితే వాట్సాప్‌లో యూజర్ భద్రత గురించి బోలెడు అనుమానాలు ఉన్నాయి. దీనికితోడు ఈమధ్య కాలంలో ఫేస్బుక్ స్వయంగా వాట్సాప్ యూజర్ల డాటాపై కన్నేసిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో యూజర్ల కోసం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది వాట్సాప్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ చాట్ డాటాకు భద్రత భరోసా ఇస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో ప్రైవసీ అప్డేట్ ఇచ్చింది. చాట్ బ్యాకప్ల విషయంలోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వర్తిస్తుందని ప్రకటించింది. ‘‘ఒకవేళ ఎవరైనా వాట్సాప్ హిస్టరీని బ్యాక్ అప్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కోరుతుంది. అది కేవలం వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. సంబంధిత డ్రైవ్‌లోని సమాచారాన్ని ఎవరూ అన్‌లాక్ చేయలేరు’’ అని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ గురువారం వెల్లడించాడు. క్లిక్: ఫేస్బుక్ వల్లే న్యూడిటీ ప్రమోషనా? అయితే సంబంధిత డ్రైవ్‌ల్లో(ఐక్లౌడ్స్ లేదంటే గూగుల్ డ్రైవ్) ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కీ’ సాయంతో యాసెస్కి అనుమతి ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్ యూజర్‌కు అందుబాటులో రానుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. ఇది డిఫాల్ట్‌గా ఆన్ కాదు. పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసుకోవడం గానీ, 64 డిజిట్ ఎన్క్రిప్షన్ కీ మీద యూజర్ ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ గనుక మర్చిపోతే.. అకౌంట్ రికవరీకి వాట్సాప్ కూడా ఎలాంటి సాయం అందించలేదు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మందికి పైగా వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా.. భారత్‌లో యూజర్ల సంఖ్య 40 కోట్లకు పైనే అని ఓ అంచనా. చదవండి: ఫేస్బుక్ కాదు.. పక్కా ఫేక్ బుక్ -
వాట్సాప్ డేటాను కొత్త ఫోన్ లో తిరిగి పొందండిలా?
ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది అంటే అర్దం చేసుకోవచ్చు దానికి ఎంత అధరణ ఉంది అనేది. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. దీని ద్వారా చాటింగ్, వీడియో, ఆడియో, పీడీఎఫ్ లాంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి డేటా షేర్ చేసుకోవడానికి ప్రధాన సాధనంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైన మొబైల్ ఫోన్/ ఎవరైనా తస్కరించినప్పుడు అందులోని విలువైన డేటా పోతుంది. ఒకవేల మీ మొబైల్ ఇతరులకు చిక్కిన వాట్సాప్ ను ఆక్సెస్ చేయకుండా ఉండటానికి టూ-స్టెప్-వెరీఫికేషన్ ఆన్ చేసుకోవాలి. దీని వల్ల వారు మన డేటాను తస్కరించలేరు. ఒకవేల మనం డేటాను తిరిగి వేరే మొబైల్ లో లేదా పాత ఫోన్ లో ఉన్న డేటా కొత్త ఫోన్ లో ఉన్న డేటాను తిరిగి పొందలన్న కచ్చితంగా బ్యాకప్ చేసుకోవాలి. తద్వారా పోయిన మొబైల్ ఉన్న డేటాను తిరిగి పొందలన్న, మీరు కొత్త ఫోన్‌కు మారిన మీ డేటాను పునరుద్ధరించవచ్చు. వాట్సాప్ డేటా బ్యాకప్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి మీ ఫోన్లోని వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్‌ను ఎంచుకోండి. సెట్టింగ్స్‌లోని ‘చాట్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆపై ‘చాట్ బ్యాకప్’ తెరవండి. గూగుల్ డ్రైవ్ లో మీ చాటింగ్ మొత్తాన్ని బ్యాకప్ చేయడానికి ‘చాట్ బ్యాకప్’ ఆప్షన్ మీకు అనుమతిస్తుంది. రోజు, వారానికి, నెలకు ఒకసారి బ్యాకప్ చేసే అవకాశం ఉంటుంది. వారానికొకసారి చాట్ బ్యాకప్ చేయాలనుకుంటే ‘వీక్లీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వై-ఫై, సెల్యులార్ ద్వారా బ్యాకప్ చేసుకోవచ్చు. వీడియోలను కూడా బ్యాకప్ చేయాలనుకుంటే ‘ఇంక్లూడ్ వీడియోస్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. గూగుల్ డ్రైవ్ సెట్టింగులన్నింటినీ పూర్తి చేశాక తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న ‘బ్యాకప్’ ఐకాన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ అవుతుంది. కొత్త ఫోన్లో వాట్సప్ చాట్ బ్యాకప్ తిరిగి పొందడం ఎలా? వాట్సాప్ యాప్ కొత్త వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత, మీ మొబైల్లో కాంటాక్ట్స్, ఫోటోలు, మీడియాలు, ఫైల్స్‌ను యాక్సెస్ చేయడానికి వాట్సాప్‌కు అనుమతివ్వాలి. ఇప్పుడు ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి నెంబర్ వెరిఫికేషన్ పూర్తి చేయండి. ఆ తర్వాత మీకు ఫోన్లో 6-అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను మెసేజ్ ద్వారా వచ్చిన వెంటనే అది ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్ పూర్తవుతుంది. మీ వాట్సాప్ నెంబర్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత, ‘రీస్టోర్ బ్యాకప్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు గూగుల్ క్లౌడ్‌లోని ఉన్న మీ వాట్సాప్ డేటా పునరుద్ధరించబడతాయి. మీ పాత ఫోన్లో ఏదైతే గూగుల్ అకౌంట్ వాడారో అదే అకౌంట్‌తో కొత్త ఫోన్లో కూడా సైన్ ఇన్ అవ్వాలి. డేటా రీస్టోర్ అయిన తర్వాత ‘నెక్ట్స్’పై క్లిక్ చేయండి. ఇప్పుడు ‘ప్రొఫైల్ ఇన్ఫో’ విండోలో మీ పేరును టైప్ చేయండి. మీ పాత వాట్సాప్ లో ఉన్న డేటాను బ్యాకప్ పూర్తి కావడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది. మీ అన్ని పాత మెసేజెస్ పునరుద్ధరించబడతాయి. చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు -
వాట్సాప్‌లో మరో ఆకర్షణీయ ఫీచర్..
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానుంది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్‌ను జోడిస్తోంది. ఇకపై వాట్సాప్ యూజర్లు పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ద్వారా తమ చాట్ బ్యాక్ అప్ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్వర్డ్ ప్రొటెక్ట్ బ్యాక్ అప్స్ అనే ఫీచర్ పేరుతో న్యూ అప్డేట్ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. బీటా యూజర్లకే నూతన ఫీచర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు మారిన క్రమంలో వాట్సాప్ చాట్స్‌ను కలిగి ఉండటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. (సోషల్ మీడియా యాప్స్‌పై క్రిమినల్ కేసు) ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం తమ చాట్ బ్యాక్ అప్ను ఎన్క్రిప్టెడ్ ఫామ్‌లో సేవ్ చేసుకోగలుగుతున్నారు. ఇక ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్‌ను యూజర్లందరికీ వాట్సాప్ మంగళవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక యూజర్లు ఇప్పుడు తమ ఆండ్రాయిడ్ 10, ఐఓఎస్ 13 ఫోన్లలో డార్క్ మోడ్ ఆప్షన్‌కు మళ్లగానే ఆటోమేటిక్‌గా డార్క్ మోడ్ థీమ్ ఆన్ అవుతుంది. గత కొంతకాలంగా వాట్సాప్ పరీక్షిస్తున్న ఈ ఫీచర్ తాజాగా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. చదవండి : వాట్సాప్‌లో ఈ రహస్య ఫీచర్ తెలుసా? -
బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సెల్ చార్జింగ్ పెడుతున్నారా?
బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే చార్జర్లతో మీ మొబైల్ ను చార్జ్ చేసుకునే అలవాటు ఉందా? ఉంటే, ఇక ముందు అలా చేయకండి. చార్జింగ్ పెట్టిన ఫోన్ల లో నుంచి సమాచారాన్ని తస్కరించే మొబైల్ చార్జర్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీ సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న విషయం కూడా మీకు తెలియదంటే నమ్మండి.. వీటిని ఎంత జాగ్రత్తగా తయారు చేశారో..! సమాచారం ఎలా దొంగతనానికి గురవుతుంది మామూలు చార్జర్ల మాదిరి కాకుండా ఇలాంటి చార్జర్లలో ఒక ప్రత్యేకమైన సర్క్యూట్ ను అమర్చుతారు. ఒకసారి ఫోన్ ను ఈ చార్జర్ తో చార్జింగ్ పెట్టిన తర్వాత సర్క్యూట్ యాక్టివేట్ అయ్యి ఫోన్ ను యూఎస్బీ ఓటీజీ మోడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఈ తరహా మోడ్ యాక్టివేట్ అవగానే సమాచారాన్ని తస్కరించాలనుకునే వ్యక్తి ఇంటర్ నెట్ ద్వారా లేదా రేడియో ఫ్రీక్వెన్సీసిగ్నల్స్ ద్వారా ఫోన్ లోని డేటాను కాపీ చేసుకుంటారు. ఈ ప్రక్రియ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నా జరుగుతుందంటే ఎంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ వ్యవస్థను రూపొందించారో ఆలోచించండి. ఈ విధంగా పనిచేసే ఈ డివైజ్ పేరు 'మీమ్' దీనిని మొబైల్స్ నుంచి డేటాను ట్రాన్స్ ఫర్ చేయడానికి, చార్జింగ్, బిల్ట్ ఇన్ స్టోరేజ్ తదితరాలను రూపొందించారు. కొత్తగా స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసి ఉపయోగించుకునే వారి సౌకర్యార్ధం వీటిని మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 16, 32 జీబీల వేరింయట్లలో ఆన్ లైన్ లో లభ్యం అవుతోంది.