ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది అంటే అర్దం చేసుకోవచ్చు దానికి ఎంత అధరణ ఉంది అనేది. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. దీని ద్వారా చాటింగ్, వీడియో, ఆడియో, పీడీఎఫ్ లాంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి డేటా షేర్ చేసుకోవడానికి ప్రధాన సాధనంగా ఉపయోగపడుతుంది.
ఎప్పుడైన మొబైల్ ఫోన్/ ఎవరైనా తస్కరించినప్పుడు అందులోని విలువైన డేటా పోతుంది. ఒకవేల మీ మొబైల్ ఇతరులకు చిక్కిన వాట్సాప్ ను ఆక్సెస్ చేయకుండా ఉండటానికి టూ-స్టెప్-వెరీఫికేషన్ ఆన్ చేసుకోవాలి. దీని వల్ల వారు మన డేటాను తస్కరించలేరు. ఒకవేల మనం డేటాను తిరిగి వేరే మొబైల్ లో లేదా పాత ఫోన్ లో ఉన్న డేటా కొత్త ఫోన్ లో ఉన్న డేటాను తిరిగి పొందలన్న కచ్చితంగా బ్యాకప్ చేసుకోవాలి. తద్వారా పోయిన మొబైల్ ఉన్న డేటాను తిరిగి పొందలన్న, మీరు కొత్త ఫోన్‌కు మారిన మీ డేటాను పునరుద్ధరించవచ్చు.
వాట్సాప్ డేటా బ్యాకప్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
- మీ ఫోన్లోని వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- సెట్టింగ్స్‌లోని ‘చాట్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆపై ‘చాట్ బ్యాకప్’ తెరవండి. గూగుల్ డ్రైవ్ లో మీ చాటింగ్ మొత్తాన్ని బ్యాకప్ చేయడానికి ‘చాట్ బ్యాకప్’ ఆప్షన్ మీకు అనుమతిస్తుంది. రోజు, వారానికి, నెలకు ఒకసారి బ్యాకప్ చేసే అవకాశం ఉంటుంది.
- వారానికొకసారి చాట్ బ్యాకప్ చేయాలనుకుంటే ‘వీక్లీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- వై-ఫై, సెల్యులార్ ద్వారా బ్యాకప్ చేసుకోవచ్చు.
- వీడియోలను కూడా బ్యాకప్ చేయాలనుకుంటే ‘ఇంక్లూడ్ వీడియోస్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
- గూగుల్ డ్రైవ్ సెట్టింగులన్నింటినీ పూర్తి చేశాక తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న ‘బ్యాకప్’ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ అవుతుంది.
కొత్త ఫోన్‌లో వాట్సప్ చాట్ బ్యాకప్ తిరిగి పొందడం ఎలా?
- వాట్సాప్ యాప్ కొత్త వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత, మీ మొబైల్లో కాంటాక్ట్స్, ఫోటోలు, మీడియాలు, ఫైల్స్‌ను యాక్సెస్ చేయడానికి వాట్సాప్‌కు అనుమతివ్వాలి.
- ఇప్పుడు ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి నెంబర్ వెరిఫికేషన్ పూర్తి చేయండి.
- ఆ తర్వాత మీకు ఫోన్‌లో 6-అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను మెసేజ్ ద్వారా వచ్చిన వెంటనే అది ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్ పూర్తవుతుంది.
- మీ వాట్సాప్ నెంబర్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత, ‘రీస్టోర్ బ్యాకప్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు గూగుల్ క్లౌడ్‌లోని ఉన్న మీ వాట్సాప్ డేటా పునరుద్ధరించబడతాయి. మీ పాత ఫోన్‌లో ఏదైతే గూగుల్ అకౌంట్ వాడారో అదే అకౌంట్‌తో కొత్త ఫోన్‌లో కూడా సైన్ ఇన్ అవ్వాలి.
- డేటా రీస్టోర్ అయిన తర్వాత ‘నెక్ట్స్’పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ‘ప్రొఫైల్ ఇన్ఫో’ విండోలో మీ పేరును టైప్ చేయండి.
- మీ పాత వాట్సాప్ లో ఉన్న డేటాను బ్యాకప్ పూర్తి కావడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది.
- మీ అన్ని పాత మెసేజెస్ పునరుద్ధరించబడతాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment