వాట్సాప్‌లో మరో ఆకర్షణీయ ఫీచర్‌.. | Secure WhatsApp Chat Backups With A Password | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ చాట్‌ బ్యాక్ అప్‌ ఇక సేఫ్‌..

Published Wed, Mar 4 2020 4:05 PM | Last Updated on Wed, Mar 4 2020 4:25 PM

Secure WhatsApp Chat Backups With A Password - Sakshi

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానుంది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్‌ను జోడిస్తోంది. ఇకపై వాట్సాప్‌ యూజర్లు పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ద్వారా తమ చాట్‌ బ్యాక్ అప్ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్‌వర్డ్‌ ప్రొటెక్ట్‌ బ్యాక్ అప్స్‌ అనే ఫీచర్‌ పేరుతో న్యూ అప్‌డేట్‌ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. బీటా యూజర్లకే నూతన ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కు మారిన క్రమంలో వాట్సాప్‌ చాట్స్‌ను కలిగి ఉండటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. (సోషల్ మీడియా యాప్స్పై క్రిమినల్ కేసు)

ఆండ్రాయిడ్‌ యూజర్లు మాత్రం తమ చాట్‌ బ్యాక్ అప్ను ఎన్‌క్రిప్టెడ్‌ ఫామ్‌లో సేవ్‌ చేసుకోగలుగుతున్నారు. ఇక ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను యూజర్లందరికీ వాట్సాప్‌ మంగళవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక యూజర్లు ఇప్పుడు తమ ఆండ్రాయిడ్‌ 10, ఐఓఎస్‌ 13 ఫోన్లలో డార్క్‌ మోడ్‌ ఆప్షన్‌కు మళ‍్లగానే ఆటోమేటిక్‌గా డార్క్‌ మోడ్‌ థీమ్‌ ఆన్‌ అవుతుంది. గత కొంతకాలంగా వాట్సాప్‌ పరీక్షిస్తున్న ఈ ఫీచర్‌ తాజాగా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. చదవండి : వాట్సాప్‌లో ఈ రహస్య ఫీచర్‌ తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement