BackStab
-
నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతయుతంగా ఉంటానని స్పష్టం చేశారు. తాము 135 సీట్లు గెలిచామని, ఎవరినీ విడగొట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని డీకే స్పష్టం చేశారు. వెన్నుపోటు పొడవనని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయనని గాంధీ కుటుంబం పట్ల తన విధేయతను చాటుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తము ముందున్న సవాల్ అని డీకే తెలిపారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు. సీఎం ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లడానికి ముందు ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. రెండున్నరేళ్లు వద్దు..! కాగా.. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్యీ తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అంతిమ నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడిదేనని సీఎల్పీ ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే సీఎంగా ఇద్దరికీ చెరో రెండేళ్లు ఇస్తామని హైకమండ్ చేసిన ప్రతిపాదనకు డికే ససేమిరా అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలో రెండు రోజులుగా ఈ విషయంపై అదిష్ఠానం మంతనాలు జరుపుతోంది. సిద్ధరామయ్య కూడా ఢిల్లీలోనే ఉన్నారు. డీకే శివకుమార్‌ను కూడా సోమవారమే ఢిల్లీకి పిలిచినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ఆయన వెళ్లలేదు. ఒక రోజు ఆలస్యంగా మంగళవారం వెళ్తున్నారు. సాయంత్రంలోగా కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై స్పష్టత అవకాశం ఉంది. నూతన సీఎం ప్రమాణస్వీకారం గురువారం జరగనుంది. మంత్రులు కూడా ఆరోజే ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. మే 10 జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 135 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. అధికార బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19 సీట్లతో సరిపెట్టకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. చదవండి: గహ్లోత్‌కు సచిన్ పైలట్ అల్టిమేటం -
ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Rishi Sunak: వెన్నుపోటు ఫలితమే.. ఈ ఓటమి!
బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలనుకున్న రిషి సునాక్ కల చెదిరింది. ప్రధాని రేసులో లిజ్ ట్రస్ చేతిలో 21వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. అయితే.. ఈ ఎన్నిక ప్రక్రియ మొదలైన వెంటనే ముందుగా ప్రచారం ప్రారంభించింది రిషి సునాక్. పైగా ఆయన దూకుడు చూసి చాలామంది ఆయనే నెగ్గుతారని భావించారు కూడా. దీనికి తోడు.. విదేశాంగ మంత్రి అయిన ట్రస్‌కు.. టోరీ(కన్జర్వేటివ్) ఎంపీల సపోర్ట్ కూడా మొదట్లో తక్కువే ఉండేది. ఇది ఆయనకు కలిసొస్తుందని భావించారు రాజకీయ విశ్లేషకులు. కానీ, ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నికల సీన్ రివర్స్ అయ్యింది. ట్రస్‌కు క్రమక్రమంగా ఆధిక్యం పెరగుతూ వచ్చింది. మరోవైపు సర్వే ఫలితాలు కూడా ట్రస్‌కే మద్దతుగా వచ్చాయి. అయినప్పటికీ రిషి సునాక్ ధైర్యం వీడలేదు.. ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. అధికారంలోకి రాగానే.. పన్నుల భారాన్ని తగ్గిస్తానని ట్రస్ చెప్పగా, సునాక్ మాత్రం ఆమెది తప్పుడు నిర్ణయమని.. తాను మాత్రం ద్రవ్యోల్బణం కట్టడి మీదే ప్రధానంగా దృష్టిసారిస్తానని చెప్పడం చాలామందిని ఆకట్టుకుంది. అయితే పోటాపోటీగా ప్రచారం కార్యక్రమాలు సాగినా.. గ్రాండ్ ప్రచారంతో ఆకట్టుకున్నా.. రిషి సునాక్‌కు ‘ప్చ్’ ఓటమి మాత్రం తప్పలేదు. మరి ఈ మధ్యలో ఏం జరిగింది?.. రిషి సునాక్ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే.. నాయకత్వ పోటీలో తనను తాను ‘చిత్తశుద్ధి’ ఉన్న అభ్యర్థిగా నిలబెట్టుకోవాలని సునాక్ శతవిధాల ప్రయత్నించారు. కానీ, వెన్నుపోటుదారుడనే ముద్ర ఆయన్ని ముందుకు పోనివ్వలేదు. టోరీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్ జాన్సన్ విధేయులు కావడం.. పైగా ఛాన్సలర్‌గా రాజీనామా చేస్తూ రిషి సునాక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడంతో అసలు కథ మొదలైంది. రాజకీయ గురువు సమానుడు.. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు కారణమైన వ్యక్తిని(బోరిస్ జాన్సన్)కు వెన్నుపోటు పొడిచాడంటూ టోరీ సభ్యులు రిషి సునాక్‌పై ఆరోపణలు గుప్పించారు. అయితే.. దేశ ఆర్థిక విధానంపై తనకు, జాన్సన్‌కు మధ్య పెద్ద అభిప్రాయ భేదం ఉందని స్పష్టమైన తర్వాతే తనకు వేరే మార్గం లేకుండా పోయిందని రాజీనామాపై సునాక్ ప్రతిస్పందించారు. కానీ, ఆ సమయంలోనే దాదాపు రిషి సునాక్ ఓటమి ఖాయమైంది. బోరిస్ సింపథీ వర్కవుట్ రిషి సునాక్ మంచి సేల్స్‌మ్యాన్.. వెన్నుపోటుదారుడు.. మోసగాడు.. ఈ విమర్శలు చేసింది టోరీ సభ్యులే. తన రాజీనామా ప్రకటన తర్వాత తాత్కాలిక ప్రధానిగా ప్రకటించుకున్న బోరిస్ జాన్సన్.. ‘‘ప్రధాని ఎన్నికల్లో ఎవరికైనా ఓటేయండి.. సునాక్‌కు తప్ప’’ అంటూ ఇచ్చిన పిలుపు టోరీ సభ్యుల్లోకి బలంగా దూసుకెళ్లింది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. జులై నెలలో బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభ తలెత్తింది. ఆ సమయంలో విపక్షం నుంచే కాకుండా సొంత పార్టీ కన్జర్వేటివ్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు బోరిస్. సాజిద్ జావిద్, రిషి సునాక్లాంటి వాళ్ల రాజీనామా తర్వాతే.. చాలామంది ఆ బాటలో పయనించారు. సుమారు 50 మంది రాజీనామాలు చేయడంతో.. ఒత్తిడికి తలొగ్గి రాజీనామా చేశారు బోరిస్ జాన్సన్. ఈ తరుణంలో.. లక్ష్యం కాదు.. విశ్వాస ఘాతుకం బ్రెగ్జిట్ సమయంలో, కరోనాను కంట్రోల్ చేయడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పాత్ర పోషించడం లాంటి చర్యలతో బోరిస్‌పై సింపథీ క్రియేట్ అయ్యింది. అదే ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్‌కు మైనస్ అయ్యింది. ప్రధాని పదవి రేసులోకి ఎంటర్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా.. ‘రెడీ ఫర్ రిషి’ నినాదంతో 10 డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం) వైపు ఉరుకులు మొదలుపెట్టాడు. ఇది చూసి చాలామంది.. ‘‘తన లక్ష్యం(ప్రధాని కావాలనే..) కోసమే జాన్సన్‌ను రాజీనామా వైపు నెట్టేశాడని చర్చించారు టోరీలు. ఇది ద్రోహమని ఫిక్స్ అయిపోయారు. ఈ అభిప్రాయం వల్ల.. నలుగురు మాజీ చీఫ్ విప్‌లు ప్రచారం చేసినా రిషి సునాక్‌కు ప్రయోజనం లేకుండా చేసింది. అదే టైంలో.. ట్రస్ తనను తాను ‘నిజాయితీ పరురాల’నే ప్రచారం చేసుకుంది. బోరిస్ జాన్సన్‌కు నమ్మినబంటునని, తానే ప్రధానినైతే 2019 మేనిఫెస్టో అమలు చేస్తానని ఇచ్చిన హామీలు ట్రస్‌కు బాగా కలిసొచ్చాయి. వివాదాలు.. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి అనే టాప్ జాబ్ రేసులోకి ఎంటర్ కాకముందే నుంచే.. సునాక్ చుట్టూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ► ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో(ప్రత్యేకించి కరోనా సమయంలో..) ఆయన తీసుకున్న నిర్ణయాలు విమర్శలు దారి తీశాయి. ఎంతలా అంటే.. సొంత పార్టీ నేతలే ఆ నిర్ణయాలను తప్పుబట్టేంతగా. ► భార్య అక్షత మూర్తి ఆస్తులు, వ్యాపార లావాదేవీలు, పన్నుల చెల్లింపుల విషయంలో కూడా ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ వచ్చేది. ఇది సొంతపార్టీ కన్జర్వేటివ్‌కు విసుగు తెప్పించింది. ► కరోనా టైంలో శాస్త్రవేత్తలపై నోరు పారేసుకున్నారు రిషి సునాక్. వ్యాక్సిన్ తయారీ వంకతో సైంటిస్టులు ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సైంటిస్టు కమ్యూనిటీల నుంచి తీవ్ర వ్యతిరేకతను కట్టబెట్టింది. ► నార్త్ యార్క్‌షైర్‌లో ఉన్న తన మాన్షన్‌లో భారీగా ఖర్చు చేపట్టి రిషి సునాక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టడంపై దుమారం రేగింది. నీటి కొరత ఉన్న సమయంలో.. పైగా ఆ ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసేసిన టైంలో సునాక్ చేసిన పని వివాదాస్పదంగా మారింది. ఇక ఓటమిపాలైతే.. ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని, ఉత్తర యార్క్‌షైర్‌లోని రిచ్మండ్కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతానని, నియోజకవర్గం కోసం పని చేస్తానని ఆయన వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా ఓటమి తర్వాత.. తనకు ఓటేసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కన్జర్వేటివ్ అంతా ఒక కుటుంబం అని, లిజ్ ట్రస్ కింద పని చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. -
'మమ్మల్ని వెన్నుపోటు పొడిచినప్పుడే ఉద్ధవ్ తలరాత డిసైడ్ అయ్యింది'
ముంబై: బీజేపీకి వెన్నుపోటు పొడిచి ఎన్సీపీతో చేతులు కలిపినప్పుడే ఉద్ధవ్ థాక్రే తలరాత ఖరారైందని వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిప్పుడు ఆయనకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్సీపీతో జతకట్టాలని ఉద్ధవ్ ముందుగానే నిర్ణయించుకున్నారని చెప్పారు. అది అసహజ కూటమి అన్నారు. ఆ రోజు తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్ధవ్ నుంచి స్పందన రాలేదని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి ఇవ్వడం ఎవరికీ ఇష్టం లేదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలంతా తననే ముఖ్యమంత్రి కావాలనుకున్నారని, కానీ అలా జరగకపోయేసరికి బాధపడ్డారని తెలిపారు. తాము అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పనిచేస్తున్నామని నిరూపించేందుకే షిండేకు సీఎం బాధ్యతలు అప్పగించామని ఫడ్నవీస్ వివరించారు. బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలను పాటిస్తున్న అసలైన శివసేన తమతోనే ఉందని ఫడ్నవీస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో షిండే శివసేనతోనే కలిసి పోటీ చేసి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: కూతురిపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు -
శివసేనకు వెన్నుపోటు పొడిచింది ఆయనే!
Maharashtra Political Crisis ముంబై: శివసేనలో సంక్షోభానికి మూల కారకుడు సంజయ్ రౌత్ అనేది ఆ పార్టీ రెబల్స్ ఆరోపణ. అంతేకాదు ఎన్సీపీతో కుమ్మక్కై ఆయన తీరని ద్రోహం చేశాడంటూ మండిపడుతోంది. ‘‘మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఉద్దవ్ థాక్రే అంటే మాకు విపరీతమైన గౌరవం ఉంది. సంజయ్ రౌత్ ఎన్సీపీకి విధేయుడిగా వ్యవహరించాడు. అందుకే శివసేనకు వెన్నుపోటు పొడిచాడు’’ అని రెబల్స్ తరపున ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ గురువారం ఉదయం మీడియాతో స్పందించారు. సొంత మనుషులే శివసేనను వెన్నుపోటు పొడిచారని, తనపై ఈడీ కేసు కూడా రాజకీయ ప్రతీకారమంటూ తాజాగా సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే.. దీపక్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఉద్దవ్ థాక్రే కుటుంబానికి మేం వ్యతిరేకం కాదు. మహా వికాస్ అగాఢితో తెగదెంపులు చేసుకుంటే మేం ఆయనతో చర్చించేవాళ్లం. ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేవాళ్లం కూడా కాదు. ఇప్పటికీ మేం థాక్రేను గౌరవిస్తున్నాం’’ అని దీపక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏక్నాథ్ షిండే గోవా నుంచి ముంబైకి బయలుదేరారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. కేవలం ప్రజల్లో సానుభూతి కోసమే సంజయ్ రౌత్ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఉద్దవ్ థాక్రే నిన్న(బుధవారం) రాజీనామా చేశారు. కానీ, మాకు ఆయన్ని తప్పించే ఉద్దేశం లేదు. ఇప్పటికీ మేం శివసేనలోనే ఉన్నాం. ఆయన్ని అగౌరవపరచడం, బాధపెట్టడం మా ఉద్దేశాలు ఎంత మాత్రం కాదు.. అని రెబల్స్ తరపున దీపక్ కేసర్కర్ మీడియాకు తెలిపారు. Maharashtra BJP leader Devendra Fadnavis will decide the oath-taking date. It is the prerogative of the Governor to give him that date. Our negotiations have already started and we will form a govt: Shiv Sena MLA Deepak Kesarkar, spokesperson of the Eknath Shinde camp pic.twitter.com/8skbQ8IgEf — ANI (@ANI) June 30, 2022 చదవండి: థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం! -
ఆర్జీవీ వర్సెస్ టీడీపీ
-
'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెన్నుపోటు పాట రిలీజ్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలోని ‘వెన్నుపోటు’ పాటను శుక్రవారం తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. పేరుకు తగ్గట్టే పాట ఫస్ట్‌లుక్‌లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును, ఇతర నాయకులను, వెన్నుపోటుకు వేదికగా నిలిచిన వైశ్రాయ్ హోటల్‌ను చూపించారు. దొంగప్రేమ నటనలు చూపి కలియుగాన శకునులై చేరినారు.. కన్నవాళ్లు అక్కర తీరి వదిలి వేసినారు.. అసలు రంగు బయటపెట్టి కాటు వేసినారు.. ఒంటరిని చేసి గుంపు దాడి చేసి.. సొంత ఇంటి నుంచే వెలి వేసినారు అంటూ సాగుతున్న లిరిక్స్ ఎన్టీఆర్ మనోవేదనకు అద్దం పడుతున్నాయి. గీత రచయిత సిరాశ్రీ రాసిన ఈ పాటకు కల్యాణ్ మాలిక్ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. కాగా ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా.. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘కథానాయకుడు’ ఆడియో రిలీజ్ నాడే వర్మ వెన్నుపోటు పాటను రిలీజ్ చేయడం ద్వారా ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి పెంచారు. రిలీజ్ చేసిన గంటలోనే దాదాపు లక్ష వ్యూస్ రావడం విశేషం. Here is #LakshmisNTR #వెన్నుపోటుపాట 🔪🔪🔪🔪..I thank the Music director and Singer @kalyanimalik31 and lyricist @Sirasri for bringing to life the dead truths of backstabbing 🔪🔪🔪🔪 NTRhttps://t.co/2c0xUTzF3P — Ram Gopal Varma (@RGVzoomin) December 21, 2018 -
'లక్ష్మీస్ ఎన్టీఆర్' వెన్నుపోటు పాట రిలీజ్
-
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. నమ్మలేని నిజాలు!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీ రామారావు జీవితకథను తెరకెక్కించాలంటే రాంగోపాల్ వర్మే తీయాలని సీనియర్ జర్నలిస్ట్, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు నడింపల్లి సీతారామరాజు అభిప్రాయపడ్డారు. రాముడు గురించి సినిమా తీయాలంటే రామూనే తీయాలన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ‘వెన్నుపోటు’ పాటను విడుదల చేయనున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘కథానాయకుడు’ సినిమా ఆడియో కూడా ఈరోజు సాయంత్రమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నటుడు, బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు, సీతారామరాజు పాల్గొన్నారు. చివరి రోజుల్లో ఎన్టీఆర్ అనుభవించిన క్షోభపై చిట్టిబాబు మాట్లాడుతూ.. ‘అధికారంతో పాటు కుటుంబాన్ని తనకు చంద్రబాబు దూరం చేశాడని ఎన్టీఆర్ చాలా బాధ పడ్డారు. తన కుమారుల్లో అత్యంత ఇష్టుడైన హరికృష్ణను కూడా దూరం చేయడంతో మరింత కుంగిపోయారు. చంద్రబాబు రాజకీయ జీవితమే వెన్నుపోటుతో మొదలైంది. కుతూహలమ్మకు వెన్నుపోటు పొడిచి నాయకుడయ్యారు. ప్రజాపోరాటాలు చేసి నాయకుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోవడంతో గోడ దూకి టీడీపీలోకి వచ్చేశాడు. 30 ఏళ్లు పోరాడిన కాంగ్రెస్ పార్టీతో మళ్లీ ఇప్పుడు చేతులు కలిపాడు. ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టి, ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. చరిత్రలో జరిగిన విషయాలన్నీ బాలకృష్ణకు తెలుసు. లక్ష్మీపార్వతి కారణంగా నందమూరి వంశం నాశనమైపోతుందన్న భ్రమను ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో చంద్రబాబు కల్పించారు. పార్టీని, కుటుంబాన్ని కాపాడతానని నమ్మించడంతో ఎన్టీఆర్ వారసులు చంద్రబాబు వెనుక నడిచారు. చంద్రబాబు చేసిన ద్రోహం గురించి తెలిసినా ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఎన్టీఆర్ వారసులు ఉన్నార’ని వెల్లడించారు. చివరి ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఎన్టీఆర్ మొదటి, చివరి ఇంటర్వ్యూలు తనకు ఇచ్చారని సీతారామరాజు వెల్లడించారు. లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోబోతున్నట్టు తనకు ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పారని తెలిపారు. తిరుపతిలో మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ జరిగినప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఎన్టీఆర్ ఈ విషయాన్ని ప్రకటించకుండా చంద్రబాబు ఒత్తిడి చేసినా, పెద్దాయన వినిపించుకోలేదన్నారు. ‘నేను చేసింది తప్పా అని ఎన్టీఆర్ తర్వాత నన్ను అడిగారు. నేను తప్పేంలేదని చెప్పాను. దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు కూడా మిమ్మల్ని పిలిచి కుప్పంలో ఎన్నికల ప్రచారం చేయించారు. రాష్ట్రమంతా తిప్పారు. మిమ్మల్ని అభినందించారు. కేబినెట్లో తనకు మంచి పదవిక ఇమ్మని లక్ష్మీపార్వతితో మీకు చెప్పించారు. ఇవన్నీ మీకు తెలుసు. మీరు మాతో ఒకరని చెప్పారు. పెళ్లి విషయంలో రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఆదర్శమని నాతో చెప్పారు. లక్ష్మీపార్వతి వల్ల ఎన్టీఆర్‌కు ఎటువంటి హాని జరగలేదు. వాస్తవానికి ఎన్టీఆర్ ఒక్కరికే కాదు ఆయన కుటుంబం మొత్తానికి వెన్నుపోటు జరిగింది. ఇవాళ నాకు తెలిసి ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్క బాలకృష్ణ తప్పా ఎవరి ఆర్థిక పరిస్థితి బాలేదు. ఎన్టీఆర్ ఇళ్లు అన్ని అమ్మేశారు. ఆయనకు సంబంధించినవి ఏవీ లేకుండా చేశారు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణను వెన్నుపోటు పొడిచారు. ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఓ పెళ్లిలో హరికృష్ణను కలిశాను. తమ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆయన ఎంతో బాధ పడ్డారు. కథానాయకుడు సినిమాలో హరికృష్ణ కుమారులను తీసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. మలక్‌పేట నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని హరికృష్ణ అనుకున్నారు. కేసీఆర్‌తో మాట్లాడినట్టు కూడా నాతో చెప్పారు. ఆయనకు కేబినెట్ పదవికి కూడా నిర్ణయమైంది. నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేశాను మీకు అదే పదవి ఇస్తానని కేసీఆర్ తనతో అన్నారని హరికృష్ణ చెప్పారు. ఎందుకంటే వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. హరికృష్ణను మళ్లీ పైకి తీసుకువాలన్న భావన ఇంట్లోవారి కన్నా కేసీఆర్‌కే వచ్చింది. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే కేసీఆర్ తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ ఏమీ సంపాదించలేదు. బయోపిక్‌లను తీయడంలో రాంగోపాల్ వర్మ ఎక్స్పెర్ట్. ఆయన తెరకెక్కించే సినిమాలో వాస్తవాలు చూపిస్తారని నమ్ముతున్నాన’ని సీతారామరాజు వివరించారు. -
ఎన్టీవార్
-
హ్యాకర్స్ టార్గెట్ ఐఫోన్ యూజర్లే..
దుబాయి : సెల్ఫోన్లు నిత్యవసర వస్తువుగా మారిపోయిన ఈ రోజుల్లో కొన్నిసార్లు వాటి వాడకం వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లలో వీడియోలు రికార్డు చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుచుకోవడం చేస్తుంటాం. అయితే, ఐఫోన్ వాడే యూఏఈ కస్టమర్లను నిపుణులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత డాటా, సెల్ఫీ ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఎస్సెమ్మెస్, ఆఫీస్ డాటా ఇలా చాలా రకాల సమాచారాన్ని హ్యాకర్లు దొంగలించే అవకాశాలు ఉన్నాయని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఫాలో అల్టో నెట్వర్క్ సెక్యూరిటీ కంపెనీ ఇటీవల విడుదల చేసిన వైట్ పేపర్.. మ్యాక్, పర్సనల్ కంప్యూటర్ల నుంచి డాటా ఎలా హ్యాక్ అవుతాయో తెలుపుతుంది. ముఖ్యంగా ఐఓఎస్ ఫోన్లు.. హ్యాకర్ల తొలి లక్ష్యంగా మారుతున్నాయట. బ్యాక్‌స్టాబ్ అనే టెక్నిక్ వాడి హ్యాకర్లు డాటాను సంపాదిస్తారు. ఐఫోన్ యూజర్స్ కోసం ఐట్యూన్స్ క్రియేట్ చేసి డాటా ఎన్‌క్రిప్ట్ చేసి మన డాటాను హ్యాక్ చేస్తారని హెల్ప్ ఏజీ టెక్నికల్ డైరెక్టర్ నికోలాయ్ సాల్లింగ్ తెలిపారు. నికోలస్ సూచించిన జాగ్రత్తలు: ⇒ ఐఫోన్ బ్యాక్ అప్ ఎన్‌క్రిప్ట్ చేసుకోవాలి. ఐ క్లౌడ్ బ్యాక్ అప్ సిస్టమ్‌లో ఐట్యూన్స్ బ్యాక్ అప్ ఎన్‌క్రిప్ట్ చేసుకుని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ⇒ లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌ని యూజర్స్ అప్ డేట్ చేయాలి ⇒ డాటా కేబుల్ ద్వారా మొబైల్ ని కంప్యూటర్‌కు కనెక్ట్ చేసినప్పుడు 'ట్రస్ట్' ఆప్షన్ మీద క్లిక్ చేయవద్దు. ⇒ జెయిల్బ్రేక్, రూట్ ప్రాసెస్ చేయవద్దు. ⇒ ట్రస్ట్డ్(నమ్మదగిన) యాప్స్ మాత్రమే ఇన్‌స్టాట్ చేసుకోవాలి. ⇒ మొబైల్ యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. ⇒ మీ మొబైల్ వాడుతున్నప్పుడు ఇతరులు చూడరాదని భావించిన పనులు, యాక్టివిటీస్ చేయకపోవడమే మంచిది. ట్రాకింగ్ సిస్టమ్, షేరింగ్ లొకేషన్స్ ఇందులో ప్రధానంగా ఉంటాయి.