Badradri temple
-
ముక్కలు చెక్కలై..
ఆ ఐదు పంచాయతీలను కలపాలి.. ప్రజాభీష్టం లేకుండా ఏకపక్షంగా ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలం మండలంలో విలీనం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భౌగోళికంగా భద్రాచలంతో ఆ ప్రాంతాలకు ఉన్న అనుబంధంతో తమను ఇక్కడే కొనసాగించాలని ఆయా గ్రామాల వారు పలుమార్లు బంద్‌లు, రాస్తారోకోలు చేశారు. వీరి ఉద్యమానికి బీఆర్ఎస్ మినహా స్థానిక రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ఇటీవల భద్రాచలం వచ్చిన గవర్నర్ తమిళి సైకి సైతం ఆయా గ్రామాల వారు తమ సమస్యలు వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నారు. భద్రాచలం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ దశాబ్ద కాలంలో రాష్ట్రమంతా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా, భద్రాచలం ఏజెన్సీ మాత్రం దిశా నిర్దేశం, అభివృద్ధి లేక నిస్తేజంగా మారింది. రాష్ట్ర, జిల్లాల విభజనలో ముక్కలుగా చీలిపోయిన భద్రాచలం ఏకాకిగా మిగిలింది. పలు ముఖ్యమైన కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో దిక్కూ మొ క్కూ లేకుండా ఉండిపోయింది. భద్రాచలం అంటే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికే పరిమితమైన ఖ్యాతిని కూడగట్టుకుంది. రాష్ట్రం మొత్తం దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో భద్రాచలానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా పాలకులు స్పందించి పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు. మండల పరిషత్ పోయె.. పాలక మండలి లేదాయె.. మండలాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేసే మండల పరిషత్ సైతం భద్రాచలంలో లేకపోవడం శోచనీయం. ఈ మండలంలో గ్రామాలు లేకపోవడంతో మండల పరిషత్, జెడ్పీటీసీ హోదాలను రద్దు చేశారు. దీంతో ఇక్కడున్న మండల పరిషత్ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పడిన ఆళ్లపల్లి మండలానికి తరలించారు. 80 వేలకు పైగా జనాభా ఉన్న భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో పాలకవర్గం లేక ఐదేళ్లు కావస్తోంది. 2018 ఆగస్టులో గ్రామ పంచాయతీ పాలకవర్గం ముగిసినా, ఇప్పటి వరకు మళ్లీ ఎన్నికలు జరగలేదు. భద్రాచలం, సారపాకను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం ప్రకటించడం, దీనిపై గిరిజన సంఘాలు హైకోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత భద్రాచలంను మూడు, సారపాకను రెండు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడమే కాక అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే రాష్ట్ర, జిల్లా విభజనతో ఇప్పటికే భద్రాచలం నష్టపోయిందని, మళ్లీ పంచాయతీల విభజనతో మరింత నష్టపర్చవద్దని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో స్థానికులు గవర్నర్ తమిళి సైకి విన్నవించారు. దీంతో ఆ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా తిప్పి పంపారు. ఇలా అనేక పరిణామాలతో భద్రాచలం గ్రామపంచాయతీ ఐదేళ్లుగా పాలకవర్గం లేకుండానే సాగుతోంది. ఇక గతంలో భద్రాచలం డివిజన్లో కొనసాగిన అనేక విద్యాలయాలు, కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో పట్టణం కళ తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రాచలానికి ఇస్తామన్న రూ.100 కోట్లలో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో ఈ దశాబ్దిలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతిపెద్ద ఏజెన్సీ చిన్నబోయింది.. తెలంగాణ ఆవిర్భావంతో భద్రాచలం ఏజెన్సీ ప్రాభవానికి గండి పడింది. రాష్ట్ర విభజనతో భద్రాచలం డివిజన్లో ఉన్న కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, భద్రాచలం పట్టణం మినహా ఇతర గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయి. దీంతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన భద్రాచలం ఏజెన్సీ చిన్నదైంది. భద్రాచలం మండలంలోని యటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామపంచాయతీలను సైతం ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో పట్టణానికే పరిమితమై మండల పరిధి కుచించుకుపోయింది. ఇక జిల్లాల పునర్విభజనతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో కలిపారు. రాష్ట్ర విభజనకు ముందు ఎనిమిది మండలాలతో వర్థిల్లిన భద్రాచలం ప్రస్తుతం మూడు మండలాలకే పరిమితమైంది. -
భక్తులకు ప్రసాదంగా బూజ్ పట్టిన లడ్డూలు
-
భద్రాద్రి దివ్యక్షేత్రం పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్
-
భద్రాద్రి ఆలయం పేరుతో అశ్లీల చిత్రాల పోస్టింగ్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సోషల్ మీడియాలో భద్రాద్రి ఆలయం పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడమే కాదు.. అందులో అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం టెంపుల్ సిటీ, భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం పేర్లతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు ఆగంతకులు. అంతటితో ఆగకుండా ఆ పేజీల్లో అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయం గమనించిన కొందరు రామభక్తులు.. భద్రాచలం ఏఎస్పీ దృష్టికి విషయం తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే.. భద్రాచలం టెంపుల్ పేరుతో ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయబడుతున్న పోస్టులతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు జరుగుతోంది. -
సీఎం గారూ.. రామయ్య పెళ్లికి రండి
భద్రాచలం: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 21న జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ ఈవో బి.శివాజీ, వేదపండితులు కలిసి ఆహ్వాన పత్రిక, జ్ఞాపిక, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, మాలోత్ కవిత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కూడా ఆహ్వాన పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు స్థలశాయి, ఏఈవో శ్రవణ్‌కుమార్, సీసీ అనిల్, అర్చకులు పాల్గొన్నారు. చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు -
ముక్కోటి నిరాడంబరమే
సాక్షి, హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి.. ఈ రోజున వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కుంటాయి. ఆయా దేవాలయాలు ప్రత్యేక అలంక రణలతో అలరిస్తాయి. కానీ కోవిడ్ నేపథ్యంలో ఈసారి దేవాలయాల్లో ఆడంబరాలు లేకుండా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమివ్వ బోతున్నారు. చిన్న చిన్న దేవాలయాల్లో భక్తులకు ప్రవేశం ఉన్నా, పెద్ద దేవాలయాల్లో ఆంతరంగిక వేడుకగానే నిర్వహించనున్నారు. తెలంగాణలో వైకుంఠ ఏకాదశికి పరవశించే భద్రాద్రిలో ఈ వేడుకను పూర్తిగా ఆంతరంగికంగా నిర్వహిస్తున్నారు. సాధారణ భక్తులకు స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇవ్వట్లేదు. చదవండి: (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం) అర్చకస్వాములు, వేదపండితుల సమక్షంలో ఉదయం 4 గంటలకే ఉత్తర ద్వారం వద్ద ఎప్పటిలాగానే వేడుకలు నిర్వహించనున్నారు. పూజాధికాల తర్వాత ఉత్సవమూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్తారు. అక్కడ సాధారణ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉత్సవాల చివరి రోజైన గురువారం నిర్వహించిన తెప్పోత్సవాన్ని గోదావరిలో కాకుండా దేవాలయం వద్దే చిన్న నీటి గుండాన్ని నిర్మించి నిర్వహించారు. ఇక, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా కోవిడ్ నిబంధనలకు లోబడే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఉదయం 6–43 గంటలకు తూర్పుద్వారం గుండా స్వామి వారి వైకుంఠద్వార దర్శనం కల్పిస్తారు. కాగా, లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 30 వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ ఆరు రోజులపాటు ఆర్జిత సేవలను రద్దు చేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం, హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి బాలాజీ దేవాలయం, శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం, జియాగూడ రంగనాథ స్వామి దేవాలయాలతో పాటు అన్ని వైష్ణవాలయాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్లా కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులను అనుమతించనున్నారు. ప్రధాన దేవాలయాల్లో పదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడ్డ భక్తులను అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు. -
రాములోరి పెళ్లిపై కరోనా ప్రభావం
-
భద్రాద్రి ఆలయంపై ఆర్టీసీ సమ్మె ప్రభావం
భద్రాచలం: హనుమజ్జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ప్రఖ్యాత శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని ఆంజనేయస్వామికి బుధవారం ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ఆలయానికి భక్తుల రాక తగ్గింది. హనుమజ్జయంతి కావడంతో ఉదయం వేళల్లో భక్తుల రద్దీ కనిపించింది. సుమారు ఐదారువేల మంది భక్తులు వచ్చినట్టు సమాచారం. దీక్ష తీసుకున్నవారు స్వామిని దర్శించుకుని, దీక్ష విరమణ చేసి తిరుగు ప్రయాణం అయ్యారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.