Badri Movie
-
ఆ రోజులను గుర్తుచేసుకున్న రేణు దేశాయ్..
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ జంటగా నటించిన ‘బద్రి’ చిత్రం విడుదలై నేటికి 20 ఏళ్లు. ఈ చిత్రంతో పూరి జగన్నాథ్.. దర్శకుడిగా పరిచమయ్యారు. అప్పట్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీలో డైలాగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బద్రితో హీరోయిన్గా పరిచయమైన రేణు దేశాయ్.. తనకు ఈ చిత్రంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పుడు జరిగిన సంభాషణలు తనకు స్పష్టంగా గుర్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్ చేసిన రేణు దేశాయ్.. అప్పుడు జరిగిన సంభాషణలను, ఘటనలను గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే పవన్, రేణుల మధ్య ప్రేమ చిగురించిన సంగతి తెలిసిందే. ‘మేము మారుమూల ప్రాంతంలో షూట్ చేస్తున్నప్పుడు.. షూటింగ్ మధ్యలో కూర్చొవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. అప్పుడు నేను షార్ట్ స్కర్ట్ ధరించి ఉండటం వల్ల రాయిపై కూర్చోలేకపోయాను. అప్పుడు నేను ఒక అమ్మాయి మీ పక్కన నిలబడి ఉండగా.. మీరు కూర్చోవడం మంచి ప్రవర్తన కాదని కల్యాణ్ గారితో సరదాగా మాట్లాడుతున్నాను. ఆ ప్రాంతం షూటింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండింది. బలమైన గాలులు వీచడంతో నేను నిలబడటానికి, డ్యాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను.’-రేణు ‘మేము ఒక రోజు షూటింగ్ ముగించుకుంటున్న సమయంలో తీసిన ఫొటో ఇది. కల్యాణ్ గారు ఏ చికితా సాంగ్‌కు సంబంధించి తన పార్ట్ పూర్తిచేశారు. నేను ‘వరమంటే’ సాంగ్ పూర్తిచేశాను. ఆరోజు ఎండగా ఉండటం, లోకేషన్ చాలా దూరం నడవాల్సి ఉండటంతో మేము చాలా అలసిపోయాం. ఆకలి, నీరసంతో మేమిద్దరం ప్రపంచాన్ని మరచిపోయాం.’-రేణు ‘మళ్లీ అదే లోకేషన్.. కానీ మరో రోజు షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటో. ఇది జరిగి 20 ఏళ్లు అవుతుంది. కానీ అప్పుడు మేము మాట్లాడుకున్న సంభాషణ నాకు ఇప్పటికి స్పష్టంగా గుర్తుంది. ఇది నాకు చాలా ఇష్టమైన ఫొటో. నాకు చాలా హ్యీపీగా ఉంటుంది.. ఎందుకంటే మాకు ప్రైవసీ ఇస్తూ.. దూరం నుంచి మా ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోను తీశారు.’-రేణు అన్నా అంతా ద్వేషం ఎందుకు? రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బద్రి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్న సమయంలో ఓ నెటిజన్ ఆమెను ఉద్దేశించి ఓ కామెంట్ చేశాడు. దీనిపై రేణు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘నాకు ఇప్పుడే ఈ మెసేజ్ వచ్చింది. అవసరమా?.. అవును.. అవసరం. మీకు తెలియకపోతే చెప్తున్నా.. బద్రీ వచ్చి ఇప్పటికి 20 ఏళ్లు. చాలా మంది మరచిపోతారు.. కావున ఈ మూవీ నాకు చాలా స్పెషల్. అంతా ద్వేషం ఎందుకు అన్నా?. ఈ వైరస్ వల్ల మనం ఒక సంక్షోంభంలో ఉన్నాం.అందరి కోసం మనం మంచి ఆలోచనలు పెట్టుకోండి. ఇంత కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాదు’ అని పేర్కొన్నారు. మరోవైపు దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్‌కు కూడా పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. -
యే మేరా జహా.. రేణు దేశాయ్
బద్రి సినిమాలో ‘బంగాళాఖాతంలో నీరంటే నీవేలే...’ పాట గుర్తుంది కదా! ఆ పాటలో పవన్‌తో మిస్సమ్మా.. అని అనిపించుకున్న రేణు తర్వాత నిజంగానే ఆయనకు మిస్సెస్ అయ్యింది. రెండేళ్ల కిందట పవన్‌కల్యాణ్‌తో విడాకులు తీసుకుని హైదరాబాద్‌ను ‘మిస్’ అయ్యింది. పుట్టిల్లు పుణే చేరిన రేణు సినీ నిర్మాణంలో ప్రతిభను చాటుకుంటుంది. నిర్మాతగా రెండో సినిమా, దర్శకురాలిగా తొలి సినిమా ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతోంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన రేణుదేశాయ్‌ని ‘సిటీ ప్లస్’ పలకరించింది. హైదరాబాద్‌ను పుట్టింటితో పోల్చిన రేణు.. సిటీతో తన అనుబంధాన్ని పంచుకుంది. అందరి విషయం ఎలా ఉన్నా.. నేను మాత్రం మెట్టినింటినే పుట్టింటిగా చెబుతాను. అవును.. నాకు హైదరాబాదే పుట్టిల్లు. పుణే అత్తిల్లు. ఎందుకంటే నా స్వీట్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ గడ్డపై అడుగుపెట్టి పదిహేనేళ్లవుతోంది. బద్రి సినిమా కోసం ఇక్కడికి వచ్చాను. అప్పట్లో నగరంలో మారుతి 800, ఎంబాసిడర్ కార్లే ఎక్కువ కనిపించేవి. ఇప్పుడు.. ఎయిర్‌పోర్టు నుంచి సిటీకి వస్తుంటే.. ఇది మన హైదరాబాదేనా అనిపిస్తోంది. మైగాడ్.. 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జ్. దానిపై ప్రయాణిస్తూ చాలా హ్యాపీగా ఫీలయ్యాను. గతంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన జ్ఞాపకాలు.. ట్రాఫిక్ జామ్‌లు గుర్తొచ్చాయి. ఆడీ, స్కోడా కార్లతో పాటు కార్లలో తిరిగే ఆడవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇన్నాళ్లకు మళ్లీ హైదరాబాద్ వచ్చిన నాకు ఇక్కడి ప్రతి దృశ్యం చాలా అపురూపంగా తోచింది. చట్నీస్లోని స్టీమ్ ఇడ్లీ రుచుల విషయంలో హైదరాబాద్‌ను మించింది మరొకటి లేదు. ఇక్కడ ప్రతి ఫుడ్ టేస్టీగా ఉంటుంది. నాకు చట్నీస్ రెస్టారెంట్లో స్టీమ్ ఇడ్లీ చాలా ఇష్టం. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెప్పించుకునేదాన్ని. అందులో ఇచ్చే చట్నీస్ సూపర్బ్. ఇక హైదరాబాద్‌కీ షాన్ ఇరానీ చాయ్ కూడా అదుర్స్. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఓపెల్ ఆస్ట్రా కారు కొన్నాను. అప్పట్లో.. సిటీలోని అన్ని ప్రాంతాలూ తిరిగేదాన్ని. బద్రి, జానీ షూటింగ్ స్పాట్లను ఎప్పటికీ మరచిపోలేను. ముఖ్యంగా గోల్కొండ టూంబ్స్. అక్కడ కొన్ని నెలలు షూటింగ్ జరిగింది. ఇలా సినిమాల కోసం నగరంలోని చాలా ప్రాంతాలను విజిట్ చేశాను. ఎంత మార్పో... బద్రి సినిమాతో నటిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత ‘ఖుషి’ సినిమాలోని ‘ఏ మేరా జహా..’ పాటకు ఎడిటింగ్ నే నే చేశా. ఆ సినిమా టైటిల్స్‌లో అసిస్టెంట్ డెరైక్టర్ల లిస్ట్‌లో నా పేరూ కనిపిస్తుంది. తర్వాత జానీ సినిమాలో నటించడమే కాక, అసిస్టెంట్ డెరైక్టర్‌గానూ పనిచేశాను. వరుసగా కొన్నేళ్లపాటు షూటింగ్లో పాల్గొనడం వల్ల నగరంలో చాలా ప్రాంతాలను దగ్గరగా చూసే చాన్స్ వచ్చింది. పదిహేనేళ్ల కిందటి హైదరాబాద్‌కు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏమైనా.. నాకు కొత్త లైఫ్ ఇచ్చిన ఈ మహానగరం నాకెప్పుడూ ప్రత్యేకమే. ఇక నగరంలో నాకు ఇష్టమైన ప్లేస్ అంటారా.. (నవ్వుతూ) మీ అందరికీ తెలిసిందే నందగిరిహిల్స్. - భువనేశ్వరి -
పూరీ జగన్నాథ్‌కు థ్యాంక్స్: రేణు దేశాయ్
దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సదా రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పేర్కొన్నారు. తన తొలి సినిమా 'బద్రీ' విడుదలయి ఏప్రిల్ 20 తేదీకి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె అభిమానులతో ట్విటర్లో సంభాషించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. అభిమాని: పవన్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? అత్తారింటికి దారేది సినిమా చూశారా? రేణు: పవన్ సినిమాలన్నీ చూశాను. ఆయనకు నేను వీరాభిమానిని. అభిమాని: బద్రీ సినిమాలో మీకు నచ్చిన సీన్ లేదా డైలాగ్ ఏది? రేణు: క్లైమాక్స్ సీన్ బాగా నచ్చింది. ఈ సన్నివేశంలో నాకు ఒక్క డైలాగ్ కూడా లేదు. 'ఈ రింగ్ ఎంత బావుంది' ఇది నాకు నచ్చిన డైలాగ్. హోటల్లో సరయును కలిసినప్పుడు వచ్చే సన్నివేశంలో నేను చెప్పే డైలాగ్ చెప్పిన డైలాగ్ ఇది. అభిమాని: పవన్‌ను మీ జీవితంలోకి తీసుకొచ్చిన పూరీ జగన్నాథ్ గురించి చెప్పండి. రేణు: నా కెరీర్ మంచి సినిమా అందించిన పూరీ జగన్నాథ్‌కు ఎప్పుడు ధన్యవాదాలు చెబుతాను. అంతేకాదు పవన్ ను నా జీవితంలోకి తీసుకొచ్చినందుకే కాకుండా పవన్నే నా జీవితంగా చేసినందుకు కూడా పూరీకి థ్యాంక్స్.